Intinti Gruhalakshmi: నందు అనసూయకు అల్టిమేట్ షాక్.. ప్రేమ్‌తో పాటు ఇల్లు వదిలి వచ్చేసిన తులసి!

First Published Oct 29, 2022, 10:47 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 29వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. లాస్య తులసితో, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్లి చేసుకుంటున్నారా లేకపోతే లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారా? పెళ్లి తర్వాత శోభనం రోజు జరిగేవన్నీ నిన్నే అయిపోయాయి కదా అని అంటుంది. దానికి తులసి,  అలాంటివన్నీ నువ్వు నా మాజీ మొగుడుతో విడాకులు ముందు నా బెడ్ రూమ్ లోనే చేసినవి. నేను నీలాంటి దాన్ని కాదు. నీచమైన మనిషి  నీచపు మాటలు చెప్తుంటే నవ్వొస్తుంది అని అంటుంది. మళ్లీ అనసూయ దగ్గరికి వెళ్లి, మీరు నన్ను ఈ రోజు ఇన్ని మాటలు అంటున్నారే ఇవన్నీ మీ కొడుకు, కోడలు ఎన్నో రోజుల ముందే చేశారు కదా.
 

 అప్పుడు మీకు ఇవేవీ గుర్తుకు రాలేదా ఇప్పుడు నాకు వచ్చి చెప్తున్నారు. మీరు నన్ను అన్ని మాటలు అన్నారు కదా వాటి అన్నిటికి అర్హులు మీ కొడుకు, కోడలు సాలువలు వేయమంటారా అని అనగా మామ్ ఏం మాట్లాడుతున్నావు అని అభి అరుస్తాడు. దానికి తులసి, నోరు ముయ్ చెంప పగలగొట్టానంటే వెళ్లి అత్తారింట్లో పడతావు అని అరుస్తుంది. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను కానీ నేను తీసుకెళ్లాల్సిన అమూల్యమైన వన్నీ తీసుకెళ్తాను అని అంటుంది తులసి. దానికి లాస్య,  ఇప్పుడు వచ్చావు అసలు విషయానికి ఇంటి నుంచి డబ్బు, బంగారం, పైసా కూడా తీసుకెళ్లనివ్వను అని అంటుంది. 
 

డబ్బు, బంగారం  మాత్రమే విలువైనవి అనుకునే వాళ్లకన్నా పేదవాళ్ళు ఇంక ఎవరూ ఉండరు. నేను ఇంటి నుంచి తీసుకెళ్తుంది నా సంతోషాన్ని, నా ఆత్మగౌరవాన్ని, నేను తప్పు చేయలేదు అన్న నిజాన్ని అని అంటుంది తులసి. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వెళ్లొద్దు అని అంటారు. అప్పుడు పరంధామయ్య వచ్చి, నేను మాటలన్నీ విన్నాను. తులసి నువ్వు వెళ్ళు. తులసిని ఆపడానికి ఎవరు ముందడుగు వేయకూడదు వీళ్ళ ముగ్గురు మనసులు ఎంత కుళ్ళిపోయి ఉన్నాయో నాకు ఈరోజు అర్థమైంది. వినడానికే నాకు చాలా అసహ్యంగా ఉన్నది అని అంటాడు. మరోవైపు సామ్రాట్, తులసి గారి ఇంట్లో ఏం జరుగుతుంటుంది.
 

 ఇప్పటివరకు ఫోన్ చేయలేదంటే ఏదో ఘోరం అయిపోయి ఉంటుంది. అందరూ ఎన్నెన్ని మాటలు అంటూ ఉంటారో ఒకసారి ఏం జరిగిందో ఫోన్ చేద్దామా? ఒకవేళ ఫోన్ చేసినట్లయితే అక్కడ ఇంకా గొడవ పెరుగుతుంది. ఏం జరగకుండా ఉంటే బాగుండు అని అనుకుంటాడు. ఇదిలా ఉండగా పరంధామయ్య, నువ్వు వెళ్ళమ్మా ఈరోజు నుంచి నీ జీవితం మొదలుపెట్టు ఎవరూ నీకు అడ్డు చెప్పరు. నీ స్వేచ్ఛ మీకు ఇస్తున్నాము ఎవరికి అందనంత ఎత్తుకు ఎదుగు అందరూ తలెత్తుకునేలా చేయాలి.
 

 అలాగే ప్రేమ్ నువ్వు అని చెప్పక ముందే, తాతయ్య మీరు చెప్పినా చెప్పకపోయినా నేను అమ్మకు తోడుగానే ఉంటాను అమ్మతోనే వెళ్తాను అని అంటాడు ప్రేమ్. అప్పుడు పరంధామయ్య వెళ్లి దేవుడికి పూజ చేసి వెళ్ళమ్మా ఈరోజు నుంచి నీ పయనం మొదలవుతుంది అని అనగా, అక్కడ ఉన్న వాళ్ళందరూ నందు, లాస్య అనసూయ, అభి తప్ప మిగిలిన వాళ్ళు తులసికి చప్పట్లు కొడుతూ ఉంటారు. అప్పుడు తులసి పైకి వెళ్లి తన బట్టలు సర్దుకుంటూ ఆ ఇంట్లో తను గడిపిన తీపి క్షణాలన్నీ గుర్తుతెచ్చుకుంటూ కిందకు వెళ్తుంది. 
 

కింద దేవుడి దగ్గరికి వచ్చి, నేను ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను ఇల్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయినా ఇల్లు ఎలా ఆనందంగా ఉంటుంది ఒక ఆడపిల్లని ఏడిపించిన ఇల్లు ఎప్పటికీ ఆనంద పడలేదు అని చెప్పి అనసూయ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోగా అనసూయ వెనక్కి వెళ్ళిపోతుంది దండం పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తులసి. అప్పుడు వాళ్ళ మామయ్య దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వచ్చి తులసి ని హద్దుకోగా, మీరందరూ నన్ను గర్వంగా పిలిచే రోజు వస్తుంది నేను అక్కడి వరకు ఎదుగుతాను.
 

నేను వెళ్ళిపోతున్నాను అంటే దూరంగా వెళ్లడం లేదు ఈ ఇంట్లో అమ్మ అనే అవసరం వచ్చిన ప్రతిసారి నేను మీకు ఎదురుపడతాను. ఎట్టి పరిస్థితుల్లోనే నేను లేను అని అనుకోవద్దు అని చెప్పి ప్రేమ్తో పాటు వచ్చేస్తుంది తులసీ. దారిలో ప్రేమ్ తో కూడా, ప్రేమ్ నువ్వు కూడా నాకు కొన్ని రోజులు వరకే వస్తున్నావు తర్వాత నువ్వు వెళ్లిపోవాలి నేనే నా జీవితం ఒంటరిగా బతుకుతాను అని అంటుంది. 

ఆ తర్వాత ప్రేమ్ తులసి లు ఇద్దరు వెళ్తూ ఉండగా అమ్మ మనం విటువైపు వెళ్ళకూడదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అంటాడు. దానికి తులసి, నాకు తెలిసి ప్రేమ్ నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావని. కానీ నాకు ఒంటరిగా సమయం కావాలి నేను వస్తాను అని అంటుంది. నువ్వు తిరిగి నా దగ్గరికి క్షేమంగా వస్తాను అని నాకు మాట ఇవ్వు అని మాట తీసుకొని తులసిని పంపిస్తాడు ప్రేమ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!