Intinti Gruhalakshmi: అందరి ముందు తులసిని క్షమాపణ అడిగిన సామ్రాట్.. భయంతో లాస్య, నందు పరుగు!

Published : Sep 14, 2022, 10:46 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
16
Intinti Gruhalakshmi: అందరి ముందు తులసిని క్షమాపణ అడిగిన సామ్రాట్.. భయంతో లాస్య, నందు పరుగు!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. శృతి,ప్రేమ్ లు ఒకరినొకరు తిట్టుకుంటూ నేను నిన్ను ప్రేమించాను కానీ అప్పుడు  నీ బుద్ధి తెలియలేదు  అని శృతి అంటుంది. అప్పుడు ప్రేమ్, నీ ప్రేమను నమ్మి నేను కూడా తిరిగి ప్రేమించాను చూడు నన్ను నేను అనుకోవాలి ఇప్పుడు ఇన్ని పాట్లు పడాల్సి వస్తుంది నాకు నాకు నీతో ప్రేమ ఏం అవసరం లేదు నువ్వు నాకు విలువ ఇవ్వట్లేదు అని ఇద్దరూ కొట్టుకుంటారు. ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు.తులసి కి కోపం వచ్చి, మీరు ఇంక  ఆపుతారా!.
 

26

మీరు నిజం మాట్లాడుతున్నారో నటిస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు అని అంటుంది. అప్పుడు ప్రేమ్ శృతిలు లేదు మేము నటిస్తున్నాము అని అంటారు. అప్పుడు అనసూయ మీరు నటించడం లేదు అమ్మ జీవించేస్తున్నారు  అని కూర్చోబెడుతుంది. ఆ తర్వాత అనసూయ పరంధామయ్యలు ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు.అప్పుడు చీటీ నందు దగ్గరికి వెళుతుంది అందులోని తన భార్యతో కలిసి నాట్యం చేస్తూ తనని ఎత్తుకోమని వస్తుంది.
 

36

అప్పుడు నందు,లాస్య లు డాన్స్ చేస్తూ ఉంటారు,చివరిలో నందు లాస్య నీ ఎట్టుకుంటాడు. అప్పుడు సామ్రాట్ తులసి వైపు చూసి బాధపడుతూ ఉంటాడు. కానీ తులసి చప్పట్లు కొడుతుంది. అప్పుడు తులసి ఆ చీటీ తీయగా తులసికి ఒక పాట పాడమని వస్తుంది  తులసి తన జీవితంలో స్నేహం గురించి ఒక పాట పాడుతూ తను స్నేహితురాలు తనకి ఎంత సహాయం చేసిందో గుర్తుతెచ్చుకుంటుంది.అలాగే సామ్రాట్ గారు కూడా తనకి ఎంత సహాయం చేశారో గుర్తు తెచ్చుకొని పాట పాడుతూ ఉంటుంది.
 

46

 ఆ పాటకి ఇంట్లో వాళ్ళందరూ మైమరిచిపోతారు. ఆ తర్వాత లక్కీ,సామ్రాట్ ఇద్దరూ డాన్స్ చేస్తూ ఉంటారు. అలాగే మధ్యలో హనీ ని కూడా తీసుకొని వచ్చి అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ కి వచ్చిన దాంట్లో సామ్రాట్ కి ఒక కథ చెప్పమని వస్తుంది. అప్పుడు సామ్రాట్ నేను ఒక బాస్ గురించి కథ చెప్తాను, తను ఎంతో మొండివాడు ఎంప్లాయిస్ గురించి ఆలోచించేవాడు కూడా కాదు అలాంటి బాస్ కి ఒక స్నేహితురాలు పరిచయం అయింది.
 

56

 తను ఎంత మంచిది అంటే బాస్ తనని చాలా నమ్మాడు కానీ ఒక పొరపాటు వల్ల తనని దూరం పెట్టాడు. తర్వాత తెలిసిన నిజం ఏంటంటే తన మాజీ భర్త చెప్పడం వలనే తను తన బాస్ కి నిజం చెప్పలేదు అని తెలుసుకుని చేతులెత్తి క్షమాపణ చెప్పాలనుకున్నాడు అని చెప్పి తులసికి వెళ్లి నన్ను క్షమించండి తులసి గారు అని క్షమాపణలు అడుగుతాడు. ఇంట్లో వాళ్ళందరూ ఒకేసారి లెగుస్తారు ఆశ్చర్యపోతారు.నందు లాస్య లు ఆశ్చర్యపోతారు.
 

66

 అప్పుడు సామ్రాట్, మీరు మళ్లీ బిజినెస్ లోకి రావాలి అని కోరుకుంటున్నాను, మీకోసం ఎదురు చూస్తుంటాను అని హనిని తీసుకొని వెళ్ళిపోతాడు . అప్పుడు తులసి ఆనందంగా వినాయకుడు దగ్గరికి వెళ్లి వినాయక, నేను మిమ్మల్ని నా నిందలు పోగొట్టాలి అని వేడుకున్నాను. మీ పుట్టినరోజు సందర్భంగా నాకు ఆ విముక్తి దొరికింది ,మీరు నాకు రెండో జన్మ ఇచ్చారు ధన్యవాదాలు అని వినాయకుడిని ప్రార్థిస్తుంది తులసి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయ భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories