ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి, జగతి ఒక జట్టు, వసుధార, మహేంద్ర ఒక జట్టుగా క్యారమ్స్ ఆడడం మొదలుపెడతారు. అప్పుడు రిషి,జగతి నీ బాగా ఆడండి మేడం, మనం గెలవాలి అని ప్రోత్సహిస్తాడు. జగతి చాలా ఆనందపడుతుంది మరోవైపు మహేంద్ర వసూ లు కూడా గట్టి పోటీ ఇస్తారు. పోటాను పోటీగా ఇద్దరు ఆడుతున్నప్పుడు చివరికి ఒక నల్ల కాయిన్,ఒక తెల్ల కాయిన్ మిగిలిపోతుంది. జగతి చేతుల మీదే ఆట ఉంది. అప్పుడు జగతి,నేను కొట్టగలనా రిషి ఒకవేళ నేను తప్పుడుది కొడితే వాళ్ళు గెలుస్తారు అని భయపడతాది. అదే సమయంలో దేవయాని అక్కడికి వస్తుంది. అప్పుడు రిషి దేవయానికి పిలిచి, రండి పెద్దమ్మ నేను జగతి మేడం కలిసి ఒక టీంలో ఆడుతున్నాము చూడండి అని చూపిస్తాడు.