ఒప్పుకున్నారు కాబట్టి మీరు నాకు క్షమాపణ చెప్తున్నారు లేకపోతే కథ ఇంకోలా ఉండేది కదా? నేను నిజంగానే మిమ్మల్ని నా సాయి శక్తుల లేపడానికి ప్రయత్నించాను, మీరు లెగకపోతే అది నా తప్పుకాదు, అయినా సరే నన్ను అంటున్నారు అని అనగా సామ్రాట్, బాస్ కూడా తప్పులు చేస్తారండి. ప్రతిసారి సరిగ్గా ఉండడానికి మేము మనుషులమే కదా, ఇకనుంచి ఏ పనైనా సరే మీకు నచ్చితే మీరు చేయండి దాని ఫలితం మంచిదైనా చెడ్డదైనా మీకు నచ్చిందంటే చేయండి.నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో ఇంట్లో అనసూయ పరంధామయ్యకి కాఫీ పెట్టి ఇస్తుంది.