29 రోజుల్లో షూటింగ్ చేసి.. 500 రోజులు ఆడిన మెగాస్టార్ సినిమా...?

Published : Aug 22, 2022, 09:49 AM ISTUpdated : Aug 22, 2022, 09:52 AM IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో మలుపులు.. కొన్ని విజయాలు.. కొన్ని అపజయాలు..మరికొన్ని రికార్డ్ లు.  ఇలా ఉగాది పచ్చడిలో సాగిపోయిన చిరంజీవి ఫిల్మ్ జర్నీలో.. ఓ  సినిమా  స్పెషల్ అని చెప్పాలి. ఆసినిమా క్రియేట్ చేసిన రికార్డ్ చాలా అరుదైనదే. మరి ఇంతకీ ఏంటా సినిమా..? ఎంటా రికార్డ్..? 

PREV
18
29 రోజుల్లో షూటింగ్ చేసి.. 500 రోజులు  ఆడిన మెగాస్టార్ సినిమా...?

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నాు. రెండేళ్లు కరోనా వల్ల మెగా ఈవెంట్ సరిగ్గా జరగలేదు. దాంతో ఈసారి రెట్టింపు ఉత్సాహంతో ఉత్సవాలు చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా మెగా కెరీర్ లో కొన్ని విషయాలు తలుచుకుని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. అందులో చిరంజీవి సినిమాల్లో రికార్డ్ క్రీయేట్ చేసిన ఓ సినిమా వెరీ స్పెషల్ అని చెప్పవచ్చు. 

28

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ ను టర్న్ చేసింది. ఇంట్లో భార్య అంటే ప్రేమ.. కాని బయటకు వెళ్ళగానే మరో ప‌రాయి స్త్రీల‌తో ఆనందం కోసం వెంప‌ర్లాడే మ‌గ‌వాడి జీవితం ఎలా ఉంటుందో చూపించే సినిమానే  ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య. ఒక సామెతను టైటిల్ గా తీసుకుని.. అదే కథను లీడ్ తీసుకుని దివంగత దర్శకులు కోడి రామ‌కృష్ణ  ఈ సినిమాను  రూపొందించారు.  

38

ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే  40 ఏళ్లు అవుతోంది.  1982 ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా. రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమాకు హిట్ టాక్ రాలేదు. ముందు యావ‌రేజ్ సినిమా అనుకున్నారు. కాని  కాల‌క్ర‌మేణా ప్రేక్ష‌కాధ‌ర‌ణ పెరిగి సూప‌ర్ హిట్ గా నిలిచింది. హిట్ అంటే మామూలు హిట్ కాదు.. బ్లాక్ బస్టర్ హిట్.. అప్పట్లో  512 రోజులు ఆడింది మూవీ. 
 

48

అయితే ఈ సినిమాకు మరో విశేషం ఉంది. ఈరోజుల్లో  ఒక సినిమా షూటింగ్ అంటే నేలలు సమయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు రెండేళ్లకు పైనే పడుతున్నాయి .. చిన్న సినిమాలంటే  యావరేజ్ గా 150 నుంచి 200 రోజులు కూడా తీసుకుంటున్నారు.  కాని 512 రోజులు ఆడిన ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమాని కేవ‌లం 29  రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు నిర్మాత రాఘ‌వ గారు.
 

58

అప్పటికే యాక్షన్ హీరో ఇమేజ్ ఉన్న మెగాస్టార్  ఇలాంటి ప్యామిలీ సబ్జెక్ట్ చేయడం ఒక ప్రయోగమే అనుకోవాలి. కాని ఆ సాహసమే ఈ సినిమాకు అంతటి విజయాన్ని ఇచ్చింది. ఆయ‌న కెరీర్‌లో మంచి  సినిమాల్లో ఒకటి గా నిలిచిపోయింది. ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌ సినిమాలో మెగాస్టార్ జోడీగా మాధవి, మరో కీలకప పాత్రలో పూర్ణిమా నటించి మెప్పించారు. 

68

దర్శక దిగ్గజం కోడి రామ‌కృష్ణ డైరెక్షన్ లో కేవలం 3ల‌క్ష‌ల 20వేల  బడ్జెట్ తో  ఈ సినిమాను తెరకెక్కించారు. లాంగ్ లొకేషన్లు లేవు పాల‌కొల్లు, న‌ర్సాపురం, పోడూరు, స‌కినేటిప‌ల్లి, భీమ‌వ‌రం, మ‌ద్రాస్‌ల్లో సినిమా షూటింగ్  కంప్లీట్ చేశారు.  సినిమా కంప్లీట్ అయిన తరువాత సెన్సార్ ఇబ్బందులు ఎదురైనా కూడా.. పట్టువదలని విక్రమార్కుడిలా.. నిర్మాత రాఘవ పోరాడి బయట పడ్డారు. 

78

ఈసినిమాలో ప్రతీది విశేషమే.. కోడి రామకృష్ణ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మెగాస్టార్ నటన, మాధవి గ్లామర్ . పెర్ఫామెన్స్,  ఎస్పీ బాలు, సుశీల, జానకి గాత్రం, రాఘవులు సంగీతం. ఇలా అన్నీ ఈ సినిమాకు ప్లస్ గా మారాయి. ఒక అద్భతమైన సినిమా రూపొందింది. 

88

ప్రస్తుతం 67వ పుట్టన రోజును జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి మూవీ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఇలాంటి అద్భతమైన సినిమాలెన్నో కనిపిస్తాయి. ఎప్పటికీ ఆడియన్స్ తో పాటు ఆయన అభిమానులను కూడా అలరిస్తుంటాయి. 

click me!

Recommended Stories