మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. చిరు బర్త్ డే సందర్భంగా గ్రాండ్ మెగా కార్నివాల్ పేరుతో ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నాగబాబు, హీరో శ్రీకాంత్, సాయిధరమ్ తేజ్, దిల్ రాజు లాంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. నాగబాబు ఈ ఈవెంట్ లో సుదీర్ఘంగా ప్రసంగించి చిరంజీవిపై తన ప్రేమ చాటుకున్నారు.