ఈరోజు ఎపిసోడ్లో లాస్య నందుని రెచ్చగొడుతూ నా కంటే కొంచెం వంకర బుద్ధి ఉంది నువ్వు ఎప్పుడూ బాగానే ఉన్నావు కదా, మీ వాళ్ళు అనుకున్న నీ కుటుంబ సభ్యుల ప్రవర్తన నీకు కోపం తెప్పించే ఎలా చేశారు అంటే వాళ్ళు ఎంత అన్యాయంగా బిహేవ్ చేసారో అర్థం అవుతోంది అని అంటుంది లాస్య. నీ కోపాన్ని వాళ్లకు ప్రూవ్ చేయ్ నందు అని రెచ్చగొడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి అందరూ వస్తారు. అప్పుడు ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్తూ ఉండగా ఆగండి అని అంటాడు నందు. నన్ను మీరందరు ఏమనుకుంటున్నారు. నా మాటంటే మీకు లెక్క లేదా నన్ను మీరు ఇంట్లో మనిషిగా కూడా ట్రీట్ చేయలేదా అని అంటాడు. అప్పుడు పరందామయ్య నాకు ఇలాంటివి మాకు మనసులో లేవు నువ్వే నీ గురించి అలా అనుకుంటున్నావు అని అనడంతో అలాంటప్పుడు ఆ తులసి వాళ్ళ అమ్మ అని అనగా అత్తయ్య అని సంబోధించు పెద్దావిడ అని అంటుంది అనసూయ.