గోల్డెన్ గ్లోబ్ వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన రాజమౌళి దంపతులు, ప్రత్యేక ఆకర్షణగా జక్కన్న

First Published Jan 11, 2023, 10:16 AM IST

తెలుగు వారు ఎక్కడున్నా తెలుగువారే అని నిరూపనించాడు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి. ఇంటన్నేషనల్ ఫెస్టివల్ కు సూటు బూటు వేసుకుని వెళ్ళాలనుకుంటారు ఎవరైనా.. కాని రాజమౌళి దంపతులు మాత్రం తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. 

ఆస్కార్ తో పాటు.. గోల్గెన్ గ్లోబ్ అవార్డ్స్ లో కూడా సత్తా చాటుతోంది ఆర్ఆర్ఆర్ మూవీ. ఆస్కార్ కు కొన్నిఅడుగుల దూరంలో ఉంది. ఇక గొల్గెన్ గ్లోబ్ అవార్డ్స్ లో మాత్రం సత్తా చాటింది. నాటునాటు పాటకు అవార్డ్ సాధించి టాలీవుడ్ పరువును మరోసారి అంతర్జాతీయస్థాయిలో నిలబెట్టింది. దేశమంతా గర్విచేలా తల ఎత్తుకు నిలబడింది తెలుగు సినిమా. 

80 వ.. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, 2023 ప్రారంభమైంది మరియు ప్రపంచవ్యాప్తంగా.. సినిమాలు ఈ అవార్డ్ కోసం పోటీపడుతుండగా.. మన దేశం నుంచి కూడా కొన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ సంవత్సరం, RRR ఉత్తమ చిత్రం, నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు ఒరిజినల్ సాంగ్ కోసం నాటు నాటు పాట పోటీపడగా..నాటు నాటు పాటకుగాను గోల్టెన్ గ్లోబ్ అవార్డు సాధించారు ఆర్ఆర్ఆర్ టీమ్. 

ఇప్పటికే అవార్డ్ వేడుకల్లో సందడిచేస్తున్నారు ట్రిపుల్ ఆర్ టీమ్. వేడక మొత్తానికి సెంట్రల్ అట్రాక్ష్ గా నిలిచారు. ఎన్టీఆర్ తారక్ తో పాటు రాజమౌళి దంపతులు అవార్డ్ వేడుకల్ల సందడిచేస్తున్నారు. ఈక్రమంలోనే రాజమౌళి ఈ వేడుకల్లో స్పెషల్ గా నిలిచారు. అందరిలా సూటుబూటు వేసుకుకోకుండా ట్రెడిషనల్ డ్రెస్ టో మెరిసాడు రాజమౌళి. 
 

రెడ్ కుర్తా.. దొతితో  రాజమౌళి.. వాటికి మ్యాచింగ్ అయ్యేలా.. చీరలో మెరిసింది రమా రాజమౌళి. ఈ ఇద్దరు స్టార్లు గోల్డెన్ గ్లోబ్ లోనే స్పెషల్ అట్రాక్షన్ గానలిచారు. ఇండియాలోనే  కాకుండా ఓవర్సీస్‌లో కూడా  సంచలనం  సృష్టిస్తోంది ఆర్ఆర్ఆర్ మూవీ.కాదు. గోల్డెన్ గ్లోబ్స్‌లో రెండు నామినేషన్‌లను కైవసం చేసుకున్న ఈసినిమా ఆల్ రెడీ ఒక అవార్డ్ ను సొంతం చేసుకుంది. 
 

80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో  రెడ్ కార్పెట్‌పై, SS రాజమౌళి ధర్జాగా కనిపనించారు. ఈసందర్భంగా మాట్లాడిన జక్కన్న  RRR సీక్వెల్ గురించి కూడా మాట్లాడారు. ఈ ఆలోచన వారికి కాస్త లేట్ గా వచ్చిందన్నారు. దానికి సంబంధించిన ఐడియాలు రాసుకుంటున్నామన్నారు. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవ్వగానే సీక్వెల్ చేయాలి అనే ఆలోచన వచ్చిందని. ప్రపంచ మెచ్చిన ఆర్ఆర్ఆర్ కోసం సీక్వెల్ ను తయారు చేయడం అంత సులువైన పని కాదని. దానికోసం చాలా సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం తాము ఆపనిలోనే ఉన్నామన్నారు. 
 

RRR యాక్షన్ సీన్స్ లో గాయపడిని సంఘటనల గురించి ప్రశ్న వచ్చినప్పుడు జక్కన్న డిఫరెంట్ గా స్పందించారు. చిన్న చిన్నవి జరుగుతుంటాయి. కాని చాలా వరకూ తమ హీరోలను పసిపిల్లల్లా చూసుకున్నామని చమత్కరించారు రాజమౌళి. ఈసందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు స్టార్ డైరెక్టర్. 
 

RRR తోపాటు  గోల్డెన్ గ్లోబ్స్ కోసం  మరో నాలుగు  సినిమాలు పోటీపడ్డాయి. అందులో జన్మనీ నుంచి  ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ , బెల్జియం ఫ్రాన్స్  నెదర్లాండ్ నుంచి  క్లోజ్  మూవీ,  సౌత్ కొరియా నుంచి డెసిషన్ టు లీవ్..  మరియు అర్జెంటీనా నుంచి  అర్జెంటీనా సినిమాలు పోటీలో ఉన్నాయి. 

click me!