Guppedantha Manasu: వసు జ్ఞాపకాలతో సతమతమవుతున్న రిషి.. వసుని జైలు నుంచి విడిపించిన దేవయాని?

First Published Jan 11, 2023, 9:44 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 10వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో జగతీ,మహేంద్ర,దేవయాని అందరూ రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉండగా దేవయాని మహేంద్ర పెద్దరికం చేస్తుంది పెత్తనాలు చేస్తుంది అని మీరందరూ నన్ను అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా అందరికి పెద్దరికం చేయడం రాదు ఏవైనా పనిచేసేటప్పుడు దాని లాభనష్టాలు సమయ అనుకూలనలు అన్ని ఆలోచించి చేయాలి అని అంటుంది దేవయాని. ఏదనికైనా ముందుచూపు ఉండాలి అది మీ ఇద్దరికీ లేదు నన్ను కాదు అని నన్ను కావాలని వెనక్కి నెట్టేసి మీరిద్దరూ వెళ్లిపోయారు అంటూ జగతి దంపతులపై కావాలనే ఏమి తెలియనట్టుగా నాటకాలు వాటితో సీరియస్ అవుతుంది దేవయాని. నేను అక్కడ ఉండి ఉంటే ఈపాటికి ఇలా జరిగి ఉండేది కాదు.
 

తగుదునమ్మ అని వెళ్లారు వెళ్లి రిషి ని బాధపెట్టారు అని వారిపై సీరియస్ అవుతూ ఉంటుంది. అక్కడ వసు జైల్లో ఉంది రిషి మాత్రం ఇంటికి రాలేదు మీరేమో ఇక్కడికి వచ్చి బాధపడుతూ ఏం ఆలోచించకుండా ఉన్నారు అని అంటుంది. దీన్నే అసమర్థత అని కూడా అంటారు అని మాటలతో రెచ్చిపోతూ ఉంటుంది దేవయాని. అప్పుడు జగతి,మహేంద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఇంతలోనే రిషి రావడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు దేవయాని ఏమీ తెలియదు అన్నట్టుగా ఎక్కడికి వెళ్లావు నాన్న ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ధరణి వెళ్లి రిషికి కాఫీ తీసుకుని రా అని అనగా నాకేం వద్దు అని లోపలికి వెళ్ళిపోతుండగా మహేంద్ర ఆపుతాడు. ఏంటి నాన్న రిషి ఎక్కడికి వెళ్ళిపోయావు.
 

ఎక్కడ ఉన్నావు అని అనడంతో ఇంకా ఉన్నాను కదా డాడ్ అని అనగా అందరూ షాక్ అవుతారు. అప్పుడు జగతి మాట్లాడగా ఏం మాట్లాడొద్దు మేడం అంటూ నాకు చిన్నప్పటి నుంచి ఇలా జరుగుతూనే ఉంది. ఒకరి చిన్నప్పుడే వదిలేసి నా బాల్యంలో మోసం చేశారు. ఇంకొకరు పెద్దయ్యాక వచ్చి జీవితాంతం నీతో కలిసి అడుగులు వేస్తాను అని చెప్పి కాదనుకొని వెళ్లిపోయారు. స్వార్థం చూపించారు ఆ స్వార్థం పేరే సాక్షి అని అంటాడు రిషి. ఇప్పుడేమో ఇంకొకరు, అందమైన లోకాన్ని పరిచయం చేసి అదంతా అబద్ధమని నిరూపించారు అని ఏడుస్తూ మాట్లాడడంతో జగతి ఎమోషనల్ అవుతూ ఉంటుంది.  తను ఎవరో మీ అందరికీ తెలుసు. అసలేంటి మేడం శాపాలన్నీ నాకేనా, నాకు ఎలా ఎందుకు జరుగుతుంది. వరుసగా అందరు నన్నే మోసం చేస్తున్నారు.
 

మీరు మీ శిష్యురాలిని కాలేజీకి తీసుకొని వచ్చి పరిచయం చేసినప్పుడు నా మనసులో మీకు థాంక్స్ చెప్పుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మీకు థాంక్స్ చెప్పాలా మేడం అని అంటాడు రిషి. అప్పుడు వసుధార అన్న మాటలు తలుచుకొని తాను జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పించింది థాంక్యూ మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ మాటలకు జగతి ఏడుస్తూ ఉండగా దేవయాని నవ్వుకుంటూ ఉంటుంది. మరొకవైపు వసు జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు రిషి ఇంట్లో నేలపై పడుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రిషి వసు ఇచ్చిన కర్చీఫ్, నెమలి ఈక, అన్ని చూస్తూ వసు అన్న మాటలు గుర్తుతెచ్చుకొని వాటిని బయటకు విసిరి వేయాలి అనుకుంటుండగా అప్పుడు మళ్ళీ వసుధార గుర్తుకు రావడంతో ఆ జ్ఞాపకాలను చూస్తూ బాధపడుతూ ఉంటాడు రిషి.
 

మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చుని ఉండగా ఫణీంద్ర దేవయాని రిషి లేచాడా అని అనడంతో ఇంట్లో రిషి లేచాడా తిన్నాడా ఎవరు పట్టించుకుంటారు అంటూ జగతి, మహేంద్రను ఉద్దేశించి మాట్లాడుతుంది దేవయాని. అప్పుడు వాళ్ళ బాధలు ఏవో వాళ్ళకి ఉంటాయి లే అనడంతో వాళ్లకి ఉంటాయి బాధలు అని వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని. అప్పుడు ధరణి కాఫీ తీసుకొని రావడంతో నేను రిషికి కాఫీ ఇస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతుంది దేవయాని. అప్పుడు మహేంద్ర దేవయానని ఆపి కాఫీ తీసుకుని వెళ్తాడు. అప్పుడు మహేంద్ర రిషి రూమ్ కి వవెళ్ళి చూడగా కింద పడుకొని ఉండడంతో అది చూసి మహేంద్ర లోపలికి వెళ్తాడు. రిషిని చూసి బాధపడుతూ ఉంటాడు మహేంద్ర. ఇప్పుడు రిషి ని నిద్ర లేపుతాడు మహేంద్ర.
 

అలా కింద పడుకున్నావేంటి నాన్న అనడంతో మహేంద్ర భుజంపై పడుకుని ప్రేమిస్తే ఇంత పెయిన్ ఉంటుందా డాడ్ అని అంటాడు. ప్రేమ ఎంత ఆప్యాయంగా ఉంటుందో అంతకు రెండింతలు బాధను కూడా ఇస్తుంది అని ఇప్పుడే నాకు తెలిసి వచ్చింది డాడ్ అని అంటాడు రిషి. అప్పుడు రిషి మహేంద్ర తో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రిషి తన బాధను మొత్తం మహేంద్రతో చెప్పుకుంటూ ఉండగా ఇంతలో జగతి అక్కడికి వచ్చి ఆ మాటలు విని బాధపడుతు ఉంటుంది. అప్పుడు రిషి మాటలు విని జగతి కూడా ఎమోషనల్ అవుతుంది. వసుధార నా జీవితంలోకి వస్తానని చెప్పి నాకు కొత్త ప్రపంచాన్ని చూపించింది కానీ ఇప్పుడు మధ్యలో ఇలా వదిలేసి వెళ్లిపోయింది డాడీ అని బాధతో మాట్లాడుతాడు రిషి. అప్పుడు జగతి వసు నా మీద కంటే నీ మీదనే నాకు ఎక్కువ నమ్మకం ఉండేది.
 

రిషి జీవితంలోకి వచ్చి రిషి ని ఒక ఫ్రెండ్ ఆదరిస్తావని అనుకున్నాను. కానీ నువ్వు రిషి ని మోసం చేసావా లేక నిన్ను నువ్వే మోసం చేసుకున్నావో అని మనసులో అనుకుంటూ ఉంటుంది జగతి. మరొకవైపు దేవయానికి రాజీవ్ ఫోన్ చేసి నా మరదలు వసుధారని విడిపించమని చెప్పాను కదా మేడం అని అంటుంది. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడగగా పోలీస్ స్టేషన్ కి దగ్గర్లో ఉన్నాను అనడంతో అది ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి చూడు అనడంతో థాంక్స్ మేడం జి అని రాజీవ్ అక్కడికి బయలుదేరుతాడు. మరొకవైపు వసు ని లాయర్ విడిపించుకుని రావడానికి వెళ్లగా అక్కడికి దేవయాని ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండడంతో జగతి మేడం ఫోన్ చేసిందా అని అనుకుంటూ ఉంటుంది వసుధార.
 

ఇంతలోనే రాజీవ్ అక్కడికి వచ్చి రా వసుధార వెళ్దాం అని అంటాడు. అప్పుడు పోలీస్ రాజీవ్ ని నేను గుడ్డిగా నమ్మి మీ ఆయన నీ కోసం ఎంతలా తాపత్రయపడుతున్నాడో తెలుసా ఇలా ఇంకొకసారి చేయవు అని వసుకి చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక వెళ్దాం పద అని అనడంతో ఎక్కడికి అని అంటుంది వసుధార. అమ్మ నాన్న దగ్గరికి అని అంటాడు రాజీవ్. మనం పెళ్లి చేసుకొని మనం వాళ్ళని సంతోష పెడదాము అనడంతో నాకు ఇప్పటికే పెళ్లయింది అని అంటుంది వసు. నువ్వు ఈ రాజీవ్ ని తక్కువ అంచనా వేస్తున్నావు నీకు పెళ్లి కాలేదని నాకు తెలుసు అని అంటారు రాజీవ్. అప్పుడు రిషి అన్న మాటలు తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార.

click me!