Intinti Gruhalakshmi: మళ్లీ నిరుద్యోగి అయిన నందు.. అది తెలిసి లాస్య కొడుకు సంబరాలు?

Published : May 18, 2022, 11:07 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Intinti Gruhalakshmi: మళ్లీ నిరుద్యోగి అయిన నందు.. అది తెలిసి లాస్య కొడుకు సంబరాలు?

ఎపిసోడ్ ప్రారంభం లోనే దివ్య (Divya) తన తాతయ్యతో కలిసి చెస్ ఆడుతూ ఉంటుంది. ఆ క్రమంలో తులసి దివ్య కి సపోర్ట్ గా నిలబడి చెస్ లో దివ్యను గెలిపిస్తుంది. దాంతో పరందామయ్య తులసి (Tulasi) ను ఆటలో గెలిచినందుకు ప్రశంసిస్తూ ఉంటాడు. ఇక తులసి తాను సంగీతం నేర్పే సంగతి ఆనందంగా పంచుకుంటుంది.
 

26

మరోవైపు ప్రేమ్ (Prem) దంపతుల దగ్గరకు ఇంటి ఓనర్ వచ్చి వెంటనే ఇల్లు ఖాళీ చేయండి అని అంటారు. అంతేకాకుండా సామాన్లు మీరే బయటికి తెస్తారా? లేక నన్నే విసిరేయామంటారా అని అంటారు.  ఇక శృతి (Shruthi) దంపతులు వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని తప్పై పోయింది అని ప్రాధేయ పడుతూ ఉంటారు.
 

36

మరోవైపు నందు (Nandu) వాళ్ళ ఫ్రెండ్స్ ఆస్తి విషయంలో గొడవ పడుతూ ఒకరికి ఒకరు చొక్కాలు పట్టుకుంటూ ఉంటారు. అది గమనించిన నందు అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరినీ ఆపుతాడు. మరోవైపు తులసి (Tulasi) మొదటి రోజు పిల్లలకు సంగీతం నేర్పించడానికి వెళ్లి సంగీతం నేర్పిస్తూ ఉంటుంది. ఇక ఆ పిల్లల తల్లికి లాస్య బెస్ట్ ఫ్రెండ్.
 

46

ఇక ఇంతలో లాస్య (Lasya) ఆమె దగ్గరకు వస్తుంది. ఇక సంగీతం వినడానికి చాలా బాగుంది అని అంటుంది. దాంతో ఆమె లాస్య ను తులసి దగ్గరకు తీసుకుని వెళుతుంది. ఇక లాస్య తులసి ను అనేక రకాలుగా దెప్పి పొడుస్తుంది. అంతేకాకుండా నీ నోటి కాడకూడు కూడా చెడగొట్టగలను అని అంటుంది. ఇక తులసి (Tulasi) లాస్య కు తగ్గట్టుగా సమాధానం ఇచ్చి వెళుతుంది.
 

56

ఇక లాస్య (Lasya) నందు కి తులసి మా ఫ్రెండ్ ఇంట్లో సంగీతం నేర్పడానికి కుదిరిందని చెబుతుంది. ఇక నందు (Nandu) కూడా నా జాబ్ కూడా పోయింది రెస్టారెంట్ మూసేశారు అని అంటాడు. ఇక లాస్య కొడుకు అంకుల్ ఇంటి దగ్గరే ఉంటారు అతను నన్ను చూసుకుంటారు అంటూ ఆనందంగా ఉరకలు వేస్తాడు. దానితో నందు షట్ అప్ అంటూ విరుచుకు పడతాడు.
 

66

మరో వైపు తులసి (Tulasi) సరుకుల కోసం కిరాణా షాప్ కి వెళుతుంది. అక్కడ డబ్బు లేక కొన్ని సరుకులు రిటర్న్ ఇస్తుంది. దానితో ఆ కిరాణా షాప్ యజమాని తులసిని అవమాన పరుస్తాడు. అది గమనించిన ప్రేమ్ (Prem) ఆ షాప్ యజమాని చొక్కా పట్టుకుంటాడు. ఇక తులసి నీకేం సంబంధం అని ప్రేమ్ పై అరుస్తుంది.

click me!

Recommended Stories