Vikram story leak: కమల్ హాసన్ విక్రమ్ మూవీ స్టోరీ లీక్.. దిమ్మ తిరిగే ట్విస్టులు ఇవిగో 

Published : May 18, 2022, 10:31 AM IST

లోక నాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ విక్రమ్. ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

PREV
16
Vikram story leak: కమల్ హాసన్ విక్రమ్ మూవీ స్టోరీ లీక్.. దిమ్మ తిరిగే ట్విస్టులు ఇవిగో 

లోక నాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ విక్రమ్. ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనితో ఈ మూవీపై సాలిడ్ బబజ్ నెలకొని ఉంది.  జూన్ 3న ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. 

26

ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా విక్రమ్ చిత్ర కథ లీకైనట్లు ప్రచారం జరుగుతోంది.  లీకైన కథ ప్రకారం ఈ చిత్రంలో ట్విస్టులు అదిరిపోనున్నాయట. 

 

36

లోకేష్ కనకరాజ్ చిత్రాల్లో అద్భుతమైన యాక్షన్ తో పాటు.. సాలిడ్ ట్విస్ట్ లు కూడా ఉంటాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు ఫహద్ ఫజల్, విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో కమల్ హాసన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అమర్ గా నటిస్తున్నారు . 

46
vikram movie

అతనికి ఓ సీరియల్ కిల్లింగ్ కేసు అసైన్ చేయబడుతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ లో దొరికిన ఒక లీడ్ తో అమర్ లోతుగా విచారణ చేస్తాడు. దీంతో దిమ్మతిరిగే ట్విస్ట్ రూపంలో అసలైన నిజం బయట పడుతుంది. ఇదిసీరియల్ కిల్లింగ్ కేసు కాదని.. దీని వెనుక చాలా పెద్ద మాఫియానే ఉందని అమర్ గ్రహిస్తాడు. 

56
Vikram

ఈ కేసుని ఛేదించే కమ్రంలో అమర్ పెద్ద పెద్ద వారితో చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది. కథలో కమల్ హాసన్ అమర్ అయితే.. విక్రమ్ ఎవరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ట్రైలర్ చివర్లో కమల్ హాసన్.. విక్రమ్ విక్రమ్ అంటూ గట్టిగా అరుస్తూ కనిపిస్తాడు. 

66

విక్రమ్ ఎవరనే విషయం కథలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ గా మారబోతోంది అని అంటున్నారు. గతంలో కమల్ హాసన్ కళ్ళు చెదిరే యాక్షన్ అంశాలతో విశ్వరూపం సిరీస్ ని తెరకెక్కించారు. ఆ చిత్రం కొందరిని మెప్పించగా మరికొందరిని ఆకట్టుకోలేకపోయింది. విక్రమ్ చిత్రం కమల్ హాసన్ కి పూర్తి స్థాయి విజయం అందిస్తుంది అని భావిస్తున్నారు. 

click me!

Recommended Stories