నందు లాస్యలకి ఆ ఇంట్లో ఘోర అవమానం జరుగుతుంది. ఆ తర్వాత సీన్లో సామ్రాట్ అక్కడ జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ బాధపడతాడు. ఏమైంది అని వాళ్ళ బాబాయ్ అడగగా నేను తులసి గారికి సహాయం చేద్దాం అనుకుంటే ఎందుకు అందరూ ఇంత తప్పుడు విధంగా ఆలోచిస్తున్నారు అంటే ఒక ఆవిడకి సహాయం చేయడానికి కూడా సమాజం ఇంతలా అనుకుంటుందా అని అంటాడు. దానికి వాళ్ళ బాబాయ్, నీకు నిజంగా తులసి గారి మీద కేవలం సహాయభావం మాత్రమే ఉన్నదాని అనగా ఇప్పుడు మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు బాబాయ్, నాకు తులసి గారంటే కేవలం వ్యాపార భాగస్వామి మాత్రమే, స్నేహితురాలు మాత్రమే. అంతకు మించి ఇంకేమీ లేదు అని అరిచి వెళ్ళిపోతాడు సామ్రాట్.