అప్పుడు ఆవిడ వసు ని కాలేజీలో ఒక గదిలో పడేస్తుంది. ఆరోజు రాత్రి రిషి, వసుకి మెసేజ్ చేస్తే వసు తిరిగి రిప్లై ఇవ్వదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రిషి కంగారు పడతాడు. ఇంతలో దేవయానికి సాక్షి పని విజయవంతంగా జరిగింది అని అంటుంది. దేవయాని చాలా సంతోష పడిపోతుంది. తర్వాత గౌతమ్, రిషి వసుధార ఇంటికి వెళ్లి చూద్దాము అని బయలుదేరుతారు. ఇంటికెళ్లి చూస్తే వాసుధార ఇంట్లో తాళం వేసి ఉంటుంది. గౌతమ్, జగతి మహీంద్ర లకు విషయం చెప్తాడు.వాళ్లు కూడా వసుని వెతకడానికి బయలుదేరుతారు దేవయాని కింద నే ఉంటుంది.