అప్పుడు సామ్రాట్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. పక్క నుంచి లాస్య, నందులు కుళ్ళుకుంటూ ఉంటారు. అప్పుడు తులసి ఈ ఫోటోలు చూసుకుంటూ మురిసిపోతుంతుంది. అప్పుడు సామ్రాట్ మనసులో, చిన్న చిన్న ఆశలు తీర్చుకోవడంలో ఎంత సంతోషం ఉంటుందని ఇప్పుడే చూస్తున్నాను అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో ఇంట్లో వాళ్ళందరూ బయట కూర్చుని మాట్లాడితే ఉండగా తులసి ఫోటోలు పెట్టింది. ఫోన్ ని అందరూ లాక్కొని ఫోటోలు చూస్తూ మురిసిపోతూ ఉంటారు. పక్కనుంచి లాస్య,నందు లు తొంగి తొంగి చూస్తుండగా వెనకాతల నుంచి బొత్తాయి బాలరాజు మెడ పట్టేస్తదేమో జాగ్రత్త అని ఏటకారిస్తాడు.ఈలోగ తులసి, ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి సంబరపడిపోతూ ఉంటుంది. వాళ్ళందరికీ జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది పక్క నుంచి సామ్రాట్ నవ్వుకుంటూ ఉంటాడు.