మెగా ఫ్యామిలీలో మనస్పర్థలు, వివాదాలు కొత్తేమీ కాదు. ఆర్ధిక, రాజకీయ కారణాలతో మెగా బ్రదర్స్ కి చిన్న చిన్న గొడవలు జరిగాయి. అభిప్రాయ బేధాలు చోటు చేసుకున్నాయి. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని పవన్ తప్పుబట్టారు. అన్న అని కూడా చూడకుండా బహిరంగ విమర్శలు చేశాడు. తమ్ముడు ఆరోపణలను చిరంజీవి సున్నితంగా ఖండించారు. పవన్ కి ఆవేశం ఎక్కువ, అవగాహన తక్కువంటూ... నవ్వుతూ మీడియా ప్రశ్నలకు చిరు సమాధానం చెప్పారు.