Intinti Gruhalashmi: అభి ఆస్తిని కొట్టేసే ప్లాన్ లో లాస్య, నందు.. తులసి మాటలు విన్న దివ్య!

Published : May 27, 2022, 11:35 AM IST

Intinti Gruhalashmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Intinti Gruhalashmi: అభి ఆస్తిని కొట్టేసే ప్లాన్ లో లాస్య, నందు.. తులసి మాటలు విన్న దివ్య!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే అంకిత (Ankitha) జరిగినదంతా చెప్పి.. మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లి నేనే తప్పు చేశాను ఆంటీ.. సారీ చెప్పడానికి వచ్చాను చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరో వైపు శృతి (Sruthi) భోజనం తీసుకొని స్టూడియోలో వెళుతుండగా అది ప్రేమ్ గమనిస్తాడు.
 

26

ఇక శృతి (Sruthi) మీకోసమే భోజనం తీసుకుని వచ్చాను అని కవర్ చేసుకుంటుంది. మరోవైపు నందు (Nandhu) అభికి కాల్ చేసి ఎలా ఉన్నావ్ అని అడుగుతాడు. ఇక అభి ఆనందం తో ఎంతో హ్యాపీగా ఉన్నాను అని అంటాడు. అంతేకాకుండా మీరు నాకు ఫోన్ చేశారు నాకది చాలు అని అంటాడు.
 

36

ఇక నందు (Nandhu) ఎమోషనల్ గా మనందరం కలిసి ఉన్నప్పుడు చాలా బాగుండేది కానీ మీ అమ్మ ఈగో వల్ల మనందరం పుట్టకు ఒకరం అయిపోయాం అని అంటాడు. ఇక నందు అనేక మాటలతో తన మనసులోని బాధను అభి (Abhi) కి అర్థమయ్యేలా చెబుతాడు. ఇక అభి కూడా కొంతవరకు ఎమోషనల్ అవుతాడు.
 

46

ఇక లాస్య (Lasya) ఏమో అనుకున్నాను కానీ..  సెంటిమెంట్ పిండేసావు నందు (Nandhu) అంటూ గట్టిగా కౌగిలించుకుంటుంది. ఇక నందు నా ఎమోషన్ డ్రామా కాదు నిజం అని అంటాడు. నీ ఎమోషన్ మన ప్లాన్ కి అడ్డు రాకూడదు అని లాస్య చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరో వైపు తులసి.. ప్రేమ్, అభిల ఫోటోలు చూసుకుంటూ బాధపడుతుంది.
 

56

మిమల్ని అందర్నీ దూరం పెట్టి మనసు రాయి చేసుకుని బాధను దిగమింగుతూ ఉన్నాను అని అనుకుంటుంది. ఈ మాటలు దివ్య (Divya) ఒక దగ్గర నుంచి వింటుంది. నా పిల్లలు తమ సొంత కాళ్ళ మీద నిలబడాలి అనేది నా ఉద్దేశం అని దివ్య కు అర్థమయ్యేలా తులసి  (Tulasi) చెబుతుంది.
 

66

ఇక తరువాయి భాగంలో లాస్య (Lasya) నువ్వు అభి ని బయటకు పంపి తప్పు చేసావు అని తులసి (Tulasi) తో అంటుంది. ఇప్పుడు అభి మళ్ళీ నీ ఇంటికి రాకుండా నేను చేస్తాను అని అంటుంది. నువ్వు ఎన్ని ఎత్తులు వేసిన అభి మాత్రం నీ ఉచ్చులో పడడు అని అంటుంది. కానీ తన తండ్రి ఉచ్చులో పడతాడుగా అని లాస్య అంటుంది.

click me!

Recommended Stories