F3: వెంకీ, వరుణ్‌ల 'ఎఫ్‌3' రివ్యూ

First Published | May 27, 2022, 11:28 AM IST

 వెంకటేష్,   వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఫన్- ఫిల్డ్ ఎంటర్టైనర్ `ఎఫ్‌3` . ఈ వేస‌వికి మూడు రెట్ల వినోదాన్ని అందిస్తామని హామీ ఇచ్చిన ఈ చిత్రం ఈ రోజు థియోటర్స్ లో దిగింది. 


ఓ సూపర్ హిట్ చిత్రం సీక్వెల్ వస్తోందంటే ఖచ్చితంగా ఓ వర్గం ఎదురుచూపులు. మొదట సినిమాని ఇష్టపడినవాళ్లు,సదరు హీరో అభిమానులు మాత్రమే కాక, సినిమా సీక్వెల్ లో ఈ సారి ఏం తీసారు అనే ఆసక్తి ఉన్నవాళ్లకు ఇలాంటి సినిమాలు సాదరంగా ఆహ్వానం పలుకుతూంటాయి. అందులోనూ ఈ సినిమా రిలీజ్ టైమ్ కూడా ఫెరఫెక్ట్ గా కుదిరింది. వరస యాక్షన్ సినిమాలు చూసిన ప్రేక్షకులు రిలీఫ్ కోసం ,ఫ్యామిలీ ప్రేక్షకులు వెళ్లటం సమ్మర్ లో ఓ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘ఎఫ్3’ టైటిల్, టీజర్, పోస్టర్స్  నుంచే  ఓ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాడు దర్శకుడు. ఈ చిత్రంపై ఫ్యామిలీ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా,టాక్ బాగా వస్తే వెళ్దామని ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఆసక్తిని,ఎదురుచూపులను ఈ సినిమా న్యాయం చేసిందా..థియోటర్స్ ని నవ్వులతో నింపేసిందా... టార్గెట్ ఆడియన్స్ ని  ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…


కథ


అత్యాశకు పోయి,  అతి తెలివి వ్యాపారాలు చేసి ఇరుక్కుపోయిన  వెంకీ (వెంకటేష్) అప్పులు పాలైపోతాడు. మరో ప్రక్క వరుణ్ (వరుణ్ తేజ) తనో పెద్ద కోటీశ్వరుడు అయ్యినట్లు పగటి కలలు కంటూ జీవిస్తూంటాడు. అతని దగ్గర రూపాయి కూడా ఉండదు. మరో ప్రక్క తమన్నా ,మొహ్రీన్ లు రోడ్డు ప్రక్కన పునుకులు బండి నడుపుతూంటారు. వీళ్ళవీ అత్యాశలే. మరో ప్రక్క నిజాయితీగా ఉండాలనుకుని ఉండలేక దాన్ని వదిలేసి సెటిల్ అయ్యిపోదామనుకుంటాడు ఎస్సై రాజేంద్రప్రసాద్. ఈ ప్రాసెస్ లో వీళ్లందరూ కలిసి ఓ క్రైమ్ లో ఇరుక్కుంటారు. దాన్నుంచి బయిటపడటానికి చాలా డబ్బు కావాలి. మరో ప్రక్క చిన్నప్పుడే తప్పిపోయిన తన వారసుడు కోసం వెతుకుతూంటాడు ఇండస్ట్రిలియస్ట్ ఆనంద్ ప్రసాద్ (మురళి శర్మ). ఆయన తన కొడుకు తిరిగి రమ్మని ప్రకటన ఇస్తాడు. దాంతో ఆ పెద్దాయన డబ్బు నొక్కేయటం కోసం  వీళ్లంతా కలిసి ఓ నాటకానికి తెర తీస్తారు. ఆయనకు కొడుకుగా వీళ్లంతా వరసగా ఆ ఇంట్లో చేరుతారు. దాంతో ఆనందప్రసాద్ కు తన కొడుకు ఎవరో కన్ఫూజ్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో ఆయన ఏం చేసారు. అసలు వీళ్లంతా చేసిన క్రైమ్ ఏమిటి..చివరకు ఆనంద్ ప్రసాద్ వీళ్లంతా తన కొడుకులాగ యాక్ట్ చేయటానికి వచ్చిన వాళ్ళని తెలుసుకున్నారా అనేది మిగతా కథ. 
 

Latest Videos


F3 Movie Review

విశ్లేషణ

చార్లి చాప్లిన్ ఓ చోట చెప్తారు ...., “Life is a tragedy when seen in close-up, but a comedy in long-shot.” సరైన కామెడీ రోజూ వారి నిత్య జీవితంలోని ఎమోషన్ ని డ్రామా నుంచి దూరం నుంచి చూపిస్తూ , నవ్విస్తుంది.   ఈ సూత్రమే ఎఫ్ 2 హై సక్సెస్ కు కారణమైంది. అనీల్ రావిపూడి కామెడీ టోన్...టానిక్ లా పనిచేసింది. అయితే ఆ సినిమాలో అంతర్లీనంగా ఓ కథని చెప్పే ప్రయత్నం చేసారు. అయితే ఎఫ్ 3 దగ్గరకు వచ్చేసరికి ...కథను ప్రక్కన పెట్టి ఓ చిన్న స్టోరీ లైన్ కు కామెడీ సీక్వెన్స్ లు కూర్చుకుంటూ వెళ్లారు. వాటిలో అన్ని క్రాక్స్ పేలలేదు. అయితే డైరక్టర్ కూడా అది అంచనా వేసేరామో...'అతడు'  సినిమాలో బ్రహ్మాజీ డైలాగులా....ఒక జోక్ పేలకపోతే మరొకటి...అది కాకపోతే మరొకటి ...ఇలా ఎక్కడో చోట ఆడియన్స్ దొరక్కపోతాడా అని వలేసి కూర్చున్నాడు. కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ జోక్స్ కు నవ్వాల్సిందే.  అదిరిపోయేవి జోక్స్ కొన్ని...అరిగిపోయిన  జోక్స్ కొన్ని..ఎవరి స్దాయికి తగ్గట్లు వాళ్లకు నవ్వొచ్చేలా సెట్ చేసి పెట్టారు. అయితే జోక్స్ తోనే ఎంతసేపు కాలక్షేపం చేస్తాం. అనుకుంటే చిన్న మెసేజ్ చివర్లో ఇచ్చి ముగించేసారు. 

F3 movie


 ఇక ఎఫ్ 3 ని  ప్రెజర్ లో చేసారో లేక బేసిక్ ఐడియాలో బాంబులా పేలే ఎలిమెంట్స్ లేకపోవటమో కానీ మొదటి ఎఫ్ 2  స్దాయిలో ఫన్ ని క్రియేట్ చేయలేకపోయాయి. జోక్స్, బిట్స్, గాగ్స్ కు లోటు లేదు. కానీ అవి వరసగా వచ్చి పడిపోయాయి కానీ క్యారక్టరైజేషన్స్ ని రిప్రజెంట్ చేయలేదు. ఈ మూవీకున్న బలమేమిటంటే, ప్రతీ ఐదూ పదినిమిషాల కొక కొత్త జోక్ తో  సర్ప్రైజ్ చేయడం.  బలహీనత ఏమిటంటే...ఈ జోక్స్ గోలలో పడి చెప్తున్న కథని వదిలేయటం. అయితే చాలా వరకూ పండినప్పటికీ.. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో తేలిపోయింది. హడావిడి ముగింపు కనిపిస్తుంది.ఇవివి సత్యనారాయణ స్టైల్ ఆఫ్ ఫన్ ని క్లైమాక్స్ ట్రై చేసారు. 

ఎక్కువగా స్లాఫ్ స్టిక్ కామెడీ చేయటంతో అక్కడికక్కడ నవ్వు వస్తుంది. థియోటర్ నుంచి బయిటకు వచ్చాక ఏమి చూసామా అంటే ఏమీ గుర్తు రాదు. అయితే ఫస్టాఫ్ లో  వెంకీ రీచీకటి చుట్టూ అల్లిని కామెడీ జోక్ బాగా పేలింది. అలాగే ఎదుటివారి చేతిలో మోసాపోయామనుకున్నప్పుడు  మూర్చవచ్చినట్లు పడిపోవటం కూడా నవ్విస్తుంది. సెకండాఫ్ లో తమన్నా పాత్ర అనసరంగా కథలోకి తెచ్చారనిపించింది. అయితే పూజ హెగ్డే సాంగ్, సోనాలి చౌహాన్ సాంగ్ బాగా వర్కవుట్ అయ్యాయి. అలాగే పవన్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ ఇలా అందరి హీరోల బొమ్మల ఎపిసోడ్ సైతం బాగా నవ్వించింది. చివర్లో వెంకటేష్ నారప్పగా, వరుణ్ తేజ్...వకీల్ సాబ్ గా కనపడి ఫ్యాన్స్ కు పండగ చేసారు. ఇలా కథ కన్నా ఎక్కువ ఎలిమెంట్స్, ఎపిసోడ్స్ పైనే ఆధారపడ్డారు.  

F3 Movie Review


 
టెక్నికల్ గా..

ఫన్  మూడ్ ని ఎలివేట్ చేస్తూ ఆహ్లాదంగా స్క్రీన్ ప్రెజన్స్ ని ఉంచే 'సాయి శ్రీరామ్' కెమెరా వర్క్ కాదనలేని బలం. పాటలు దేవిశ్రీ ప్రసాద్ కథ డ్రాప్ అవుతుందనుకున్నప్పుడు ఊపు తెప్పించే ప్రయత్నం చేస్తాడు. చేసాడు. రెండు పాటలు బాగున్నాయి. కాకపోతే కాలపరీక్షలో నిలబడవేమో.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్... ఫన్ సినిమా అని పదే పదే గుర్తు చేస్తూ సాగింది. సినిమా నిడివి కాస్త తగ్గించినా కోల్పోయిదేమీ లేదనిపిస్తుంది. రాసేప్పుడు వరస జోక్స్  తీసేటప్పుడు కంట్రోలు చేసుకోవటం, ఎడిటింగ్ చేసుకోవటం కష్టమే.   డైలాగులు చాలా చోట్ల సినిమాటిక్ గా ఉన్నాయనిపించినా, కామెడీ సినిమా కాబట్టి తేడా అనిపించదు.  నిర్మాతలు కామెడీ సినిమా అని చుట్టేయాలనుకోలేదు. బాగానే ఖర్చుపెట్టారు. అదే పెద్ద రిలీఫ్. 


నటీనటుల్లో...
వెంకటేష్ వయస్సు మీద పడటం చాలా స్పష్టంగా కనపడుతోంది. మ్యానేజ్ చేసినా తెలిసిపోతోంది. అయితే వెంకీ మానరిజమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. రాజా సినిమాలోని పాటను సైతం పేరడీ చేసి వాడటం నచ్చుతుంది. అలాగే నారప్ప గెటప్ లో కనపడటం కూడా ఫ్యాన్స్ కు కనువిందే. వరుణ్ తేజ్ ..యంగ్ బ్లడ్..ఆ స్పీడు కనపడుతోంది. నత్తి ని మేనేజ్ చేస్తూ చేసే మేనరిజం అదిరిపోయింది. సునీల్ అయితే అప్పటి సినిమాల్లో కామెడీని,పంచ్ ని గుర్తు చేసారు. తమన్నా, మెహ్రిన్ చెప్పుకోదగన పాత్రలు కావు, రఘుబాబు, రాజేంద్రప్రసాద్ నటన గురించి చెప్పేదేముంది. సంపత్ రాజ్ కపర్ట్ పోలీస్ గా కనపడ్డారు. వెన్నెల కిషోర్ ..ప్యాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ గా నవ్వించారు.

F3 Movie Review


నచ్చినవి

ఫస్టాఫ్ లో వచ్చే వెంకట్రావు భార్య ఎపిసోడ్
వరుణ్ తేజ్ నత్తి మ్యానరిజం
వింటేజ్ సునీల్
పూజ సాంగ్

నచ్చనవి

సెకండాఫ్ లో హీరోలు టెస్ట్ లు పెట్టే సీన్స్ బోర్ కొట్టించాయి
తమన్నా పాత్ర  
సరైన కథ లేకపోవటం
 

F3 Movie Review


ఫెనల్ థాట్

మరీ మూడు రెట్లు కామెడీ అని చెప్పలేం కానీ కామెడీ మూడ్ లోనే నడిచింది..ఎప్ 2 స్దాయి మాత్రం  కాదు

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.75
 

 
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు.
 సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
DOP: సాయి శ్రీరామ్
కళ: ఏఎస్ ప్రకాష్
ఎడిటింగ్: తమ్మిరాజు
స్క్రిప్ట్ కోఆర్డినేటర్: ఎస్ కృష్ణ
అదనపు స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్
సమర్పకుడు: దిల్ రాజు
సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి
నిర్మాత: శిరీష్
దర్శకుడు: అనిల్ రావిపూడి

click me!