ఏదో అనుకోని కష్టం వచ్చి ఉంటుంది అందుకే వెళ్లి ఉంటుంది దివ్య అంత బాధ్యత లేని మనిషి కాదు అంటాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఏమని సమాధానం చెప్తాం అనవసరంగా మా అక్కకి మాట వస్తుంది అయినా చెప్పి వెళ్లాలి కదా అంటూ విక్రమ్ ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతారు బసవయ్య దంపతులు. విక్రమ్, దివ్యకి ఫోన్ చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. దివ్య మీద నిందలు వేయొద్దు అంటూ ఆమెని వెనకేసుకొస్తాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య. దివ్య ఎందుకు ఇలా చేసింది ఎందుకు అందర్నీ ఇబ్బంది పెడుతుంది అనుకుంటాడు విక్రమ్.