'గేమ్ ఛేంజర్' OTT డీల్..చరణ్ మార్కెట్ రేటు కన్నా బాగా తక్కువకే, ఎందుకంటే

First Published Oct 19, 2024, 11:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer) పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. 

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


భారీ బడ్జెట్ సినిమాలకు ఓటిటి వరంగా మారిన సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగానే ఇచ్చి రైట్స్ తీసుకుంటున్నారు. దాంతో నిర్మాతలకు రిలీజ్ కు ముందే తమ సినిమా సేఫ్ అనే ధైర్యం వచ్చేస్తోంది.   అయితే కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సినిమాలు కొనడంతో ఓటిటి సంస్థలకి కూడా భారీగా నష్టాలు వస్తున్నాయి.

ఆ  మధ్య భోళా శంకర్, లైగర్, ఏజెంట్, కస్టడీ, శాకుంతలం లాంటి డిజాస్టర్స్ ఓటిటిలోనూ అండర్ పర్ఫార్మ్ చేసాయి.  క్రేజ్ ఉన్న ప్రాజెక్టుకు ఎంతైనా పెట్టి తీసుకుంటున్నారు. అంతగా అయితే రిలీజ్ అయ్యాక రిజల్ట్ తేడా వస్తే రేట్లు తగ్గిస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న   'గేమ్ ఛేంజర్' OTT డీల్ హాట్ టాపిక్ గా మారింది. 

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer) పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు(Dil raju) నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.  

పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.  అలాగే ఈ సినిమాలో ఫైట్స్ డిఫరెంట్ గా ఉండనున్నాయి. దర్శకుడు శంకర్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేస్తున్నారు. ఆయన కెరీర్ కు ఇది లైఫ్ అండ్ డెత్ క్వచ్చిన్ లాంటింది. దాంతో ఈ చిత్రం ఖచ్చితంగా భారీ సక్సెస్ అవుతుందని భావించి, బిజినెస్ డీల్స్ భారీగా జరుగుతున్నాయి. 

Latest Videos



అందుతున్న సమాచారం మేరకు  'గేమ్ ఛేంజర్' OTT రైట్స్ భారీ రేటుకే అమ్ముడయ్యాయి. అమేజాన్ ప్రైమ్ వీడియో వారు రైట్స్ తీసుకున్నారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ రైట్స్ అన్ని  వారికే ఇచ్చారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ మార్కెట్ ని బట్టి ఆ రేటు తక్కువకే రైట్స్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.

అయితే అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. దిల్ రాజు ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని మూడేళ్ల క్రితం ఇచ్చేసారు. అప్పటికి ఇంకా RRR రిలీజ్ రాలేదు. చరణ్ కు గ్లోబల్ మార్కెట్ క్రియేట్ కాలేదు. ఈ మూడేళ్లలో చాలా మారిపోయాయి. సినిమా రిలీజ్ లేటు కావటంతో అప్పటి రేటు ఇప్పుడు చరణ్ మార్కెట్ కన్నా తక్కువగా కనపడుతోంది. ఇక గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్  ఓటిటి రైట్స్ ని Zee5 వాళ్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. 
  


మరో ప్రక్క నార్త్ లో ఈ చిత్రం భారీగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ముంబైకు   రామ్ చరణ్ ని తీసుకెళ్లి మరీ ప్రమోట్ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారట. దీపావళి నుంచి ప్రమోషన్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.  గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.

ముఖ్యంగా కథ బిల్డ్ అయ్యేది  తండ్రి పాత్ర నుంచే.  ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి సీన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చేలా ప్లాన్ చేసారట.  ఈ పాత్ర గెటప్, నటన  కొత్త‌గా ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ పాత్రతో చరణ్ కు నేషనల్ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యం లేదని, ఆ స్దాయిలో పాత్రను డిజైన్ చేసినట్లు చెప్తున్నారు.  

Game Changer


పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే రివేంజ్ స్టోరీ అని,శంకర్ మార్కు ఎలిమెంట్స్ తో సినిమా నడుస్తుందని కాబట్టి ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే ఫార్ములా స్టోరీ అని చెప్తున్నారు.

 ఈ సినిమాలో రామ్ చరణ్  ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా  ఈ పాత్రకు పేరు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది.  చరణ్ పాత్ర తెచ్చే మార్పులతో పొలిషియన్స్ గోలెత్తిపోతారట.ఏదైమైనా అప్పన్నగా రామ్ చరణ్ విశ్వరూపం చూడబోతున్నామన్నమాట. 

 

click me!