నన్ను వాడుకున్న వాళ్ళు ఉండొచ్చు, నా చేతగాని తనం అయి ఉండొచ్చు మొత్తంగా నా డబ్బు పోయింది. డబ్బు పోయాక నా ఫ్యామిలీకి ఓపెన్ గా చెప్పేశా.. నేను ఇకపై 30 కోట్లు సంపాదించగలుగుతా. ఎందుకంటే మన అవసరాలకు ఆ డబ్బు బాగా సరిపోతుంది. అంతకి మించి వస్తే అది బోనస్. కానీ మీరు 30 కోట్లకి మించి ఆశించవద్దు అని భార్య పిల్లలకు చెప్పినట్లు జగపతిబాబు ఓపెన్ కామెంట్స్ చేశారు. ఫ్లైట్ టికెట్స్, జల్సాలు, రెస్టారెంట్స్ ఇవ్వన్నీ లెక్క వేసుకుని టార్గెట్ పెట్టుకున్నా. ఇప్పుడు 30 కోట్లకి మించి సంపాదన వస్తోంది అని జగపతి బాబు తెలిపారు.