అయితే కొన్నాళ్లుగా మెగా హీరోలకు అల్లు అర్జున్ దూరమవుతూ వస్తున్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. మెగా హీరో అనే ట్యాగ్ వదిలించుకోవాలని అనుకుంటున్నాడు. కొణిదెల-అల్లు కుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇటీవల అవి తారాస్థాయికి చేరాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.
మెగా హీరోల మధ్య మాటల దాడి చోటు చేసుకుంది. పుష్ప చిత్రం పై పవన్ కళ్యాణ్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ఒకప్పుడు హీరోలు అడవులను పెంచి, అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. ఇప్పటి హీరోలు చెట్లను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. నటుడిగా నాకు అలాంటి పాత్రలు చేయడం ఇష్టం ఉండదని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మామయ్య స్పందించారు. అల్లు అర్జున్ నిజంగా స్మగ్లింగ్ చేయలేదు. అది సినిమాలో పాత్ర మాత్రమే అంటూ అసహనం వెళ్లగక్కారు.