ఫ్లిప్‌ స్టార్‌ గా పది తరాలు నిలిచిపోతావు తల్లి, మహానటితో పోల్చుతూ యష్మి గౌడపై క్రేజీ ట్రోల్స్

First Published | Sep 15, 2024, 7:57 AM IST

రెండు వారాల పాటు బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో చీఫ్‌గా ఉంది యష్మి గౌడ. శనివారం నాగ్‌ వచ్చి ఆమె అసలు రూపం బయటపెట్టాడు. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోతున్నాడు. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ మిక్స్ డ్ టాక్‌తో రన్‌ అవుతుంది. ఓపెనింగ్‌ డే టీఆర్‌పీ రేటింగ్‌ బాగున్నా, ఎపిసోడ్ల పరంగా అంతగా లేదనే టాక్‌ వినిపిస్తుంది. ఈషోని జనాలు పట్టించుకోవడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. పెద్దగా గుర్తింపు లేని కంటెస్టెంట్లని బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి తీసుకురావడమే అందుకు కారణమని అంటున్నారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్, ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

పైగా ప్రారంభం నుంచే కంటెస్టెంట్లు స్ట్రాటజీ ప్రకారం గేమ్‌లు ఆడుతున్నారు. చాలా వరకు సహజంగా ఉండటం లేదు. ముసుగేసుకొని ఉంటున్నారని, సింపతీ గేమ్‌ ఆడుతున్నారని, మరికొందరు అసలు బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఉన్నారా? లేరా? అనే డౌట్‌ వచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం యాక్టివ్‌గా ఉండటం లేదు. దీంతో చెప్పుకోదగ్గ కంటెంట్‌ రావడం లేదు. ఇదే పెద్ద మైనస్‌గా మారింది.

అయితే టాస్క్ ల్లో మాత్రం గట్టిగానే ఫైట్‌ చేస్తున్నారు. నామినేషన్లలో రెచ్చిపోతున్నారు. నోరు విప్పితే వాగ్వాదానికి దిగుతున్నారు. గొడవలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. గొడవలు పడితే హైలైట్ కావచ్చు అనే ఆలోచనతో వాళ్లు అలా ప్రవర్తిస్తున్నారని సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తుంది.

ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్‌ చూశాక నెటిజన్లు మరింత షాక్‌ అవుతున్నారు. ఓ కంటెస్టెంట్‌ విషయంలో వాళ్లు ఆవాక్కవుతున్నారు. ఆమె నిజ స్వరూపం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఎవరో కాదు యష్మి గౌడ. 


కన్నడకి చెందిన ఈ బ్యూటీ తెలుగులో సీరియల్స్ ద్వారా పాపులర్‌ అయ్యింది. ఈ క్రమంలో బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. వచ్చిన మొదటి వారంలోనే ఆమెకి చీఫ్‌ అయ్యే అవకాశాన్ని దక్కించుకుంది. ఏకంగా చీఫ్‌ అయ్యింది.

అతిపెద్ద క్లాన్‌(వంశాన్ని)ని పొందింది. ఎక్కువ మంది ఆమె టీమ్‌లోనే ఉన్నారు. అదే సమయంలో చీఫ్‌ అయిన కారణంగా నామినేషన్‌లో లేదు. ఇలా రెండు వారాలు తప్పిందుకుంది. అయితే గేమ్‌ల్లోనూ ఆమెకి పెద్దగా స్కోప్‌ లేదు. చాలా వరకు సంచాలక్‌గానే వ్యవహరించాల్సి వచ్చింది. 
 

అయితే ఈ వారంలో ఫుడ్‌ సంపాదించే టాస్క్ లో 250 గ్రాముల మురుమురాలు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ గేమ్‌కి సంబంధించిన తీర్పులో ఆమె వ్యవహరించిన విధానం శనివారం చర్చకు వచ్చింది. ఎంత వన్‌ సైడ్‌గా ఆమె నిర్ణయం తీసుకుందో బట్టబయలు అయ్యింది.

ఆమె ఎంత కన్నింగ్‌గా తీర్పు ఇచ్చిందో హోస్ట్ నాగార్జున బయటపెట్టాడు. అయితే ఆ విషయం చర్చకు వచ్చినప్పుడు తన తప్పు ఒప్పుకోలేదు యష్మి. తనది తప్పు కాదని చెప్పింది. కానీ వీడియో చూపించడంలో ఆమె అసలు రూపం వెల్లడైంది.

ఎంతటి పక్షపాతంతో వ్యవహరించిందో, ఎంతటి గేమ్‌ ఆడిందో తెలిసిపోయింది. నాగ్‌ ఆ విషయాన్ని చెప్పాక ఆమె ఒప్పుకోవడం గమనార్హం. అయితే ముందే ఎందుకు ఒప్పుకోలేదని నాగ్‌ ప్రశ్నించగా, ఎందుకు చెప్పడం అని చెప్పలేదు సర్‌ అంది. 

ఇక్కడే ఆమె అసలు గేమ్‌ చూపించింది. వీడియో చూపించాక తన రూపం బయటపడటంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, వాళ్లకి ఫుడ్‌ లేదు, వాళ్ల కోసం తాను ఈ నిర్ణయం తీసుకోవాలనిపించింది అంటూ కవర్‌ చేసుకునే ప్రయత్నం చేసింది. దానికి కన్నీళ్లు కార్చడం విశేషం.

ఆ కన్నీళ్లు కూడా ఒకే కంటి నుంచి రావడమే ఇక్కడ హైలైట్. దీంతో ఇప్పుడు నెటిజన్లు రెచ్చిపోతున్నారు. యష్మిలో మహానటిని చూసుకుంటున్నారు. ఈ తరం మహానటి అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. 
 

ఇంకో పది తరాల పాటు ఫ్లిప్‌స్టార్ అనే ప్రస్తావన వస్తే నీ పేరే గుర్తుస్తాదితల్లి అంటూ `మహానటి` సినిమాలోని సీన్‌ని పెడుతూ దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. వామ్మో యష్మిలో మహానటిని మించిన యాక్టర్ ఉన్నాడు అంటూ రచ్చ చేస్తున్నారు.

పెద్ద కన్నింగ్‌ బ్యాచ్‌ అని, వీడియో రాకముందు ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది ఫైర్‌, వీడియో వచ్చాక ఆ పర్‌ఫెర్మెన్స్ ఏదైతే ఉందో అది డబుల్‌ ఫైర్‌, పూర్తిగా శోభా శెట్టి(గత సీజన్‌ కంటెస్టెంట్‌)గా మారిపోయిన యష్మి, శోభా శెట్టి సిస్టర్‌ అంటూ దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!