ఒక రకంగా ఇది ఊహించని పరిణామమే అని చెప్పొచ్చు. పృథ్వీరాజ్ ఈ రెండు వారాలు అంత యాక్టివ్ గా లేదు. కానీ సత్తా ఉన్న కంటెస్టెంట్. అంత తన మార్క్ ఇంత వరకు ప్రదర్శించలేదు. నిఖిల్, సోనియా, విష్ణుప్రియ, యాష్మి, ప్రేరణ లాంటి వాళ్ళు మాత్రమే హైలైట్ అవుతూవచ్చారు. ఇప్పుడు శేఖర్ భాషా ఎలిమినేట్ అవుతున్నట్లు వార్తలు రావడంతో ఇది పృథ్వీరాజ్ కి మంచి అవకాశం అని అంటున్నారు. లక్కీగా పృథ్వీరాజ్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ వీక్ నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. అందులో విష్ణు ప్రియ, నైనిక, నిఖిల్, మణికంఠ, ఆదిత్య ఓం, శేఖర్ బాషా, పృధ్విరాజ్, నబిల్, ఉన్నారు. అయితే వీరిలో అందరికి ఓటింగ్ పర్సంటేజ్ బాగానే ఉంది. అయితే అందరికంటే తక్కువ ఓట్లు పృధ్విరాజ్ కు పోల్ అయినట్టు సమాచారం.