నేను బతికి ఉన్నానో, చచ్చానో కూడా ఆయనకు తెలియదు, మహేష్‌ బాబు సినిమా అమ్మ కామెంట్స్ పై ట్రోల్స్.. మొత్తం రచ్చ

Published : Feb 18, 2025, 05:38 PM ISTUpdated : Feb 18, 2025, 05:40 PM IST

Mahesh babu: మహేష్‌ బాబుకి మదర్‌గా చేసిన సీనియర్‌ నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పెద్ద వివాదంగా మారుతున్నాయి.   

PREV
16
నేను బతికి ఉన్నానో, చచ్చానో కూడా ఆయనకు తెలియదు, మహేష్‌ బాబు సినిమా అమ్మ కామెంట్స్ పై ట్రోల్స్.. మొత్తం రచ్చ
mahesh babu

Mahesh babu: సినిమా అన్నప్పుడు ఒక్కో సినిమాకి చాలా మంది క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ లు ఉంటారు. ఒకప్పుడు హీరోయిన్‌గా చేసిన వాళ్లు కూడా ఇప్పుడు హీరోలకు తల్లిగానో, ఆంటీగానో, లేదంటే హీరోయిన్‌కి అమ్మగానో, ఆంటీ గానో చేస్తున్నారు. కీలకపాత్రల్లో కనిపిస్తుంటారు. హీరోలకు అమ్మ పాత్రలు చేసినవారు సినిమా సినిమాకి మారిపోతుంటారు. అయితే మహేష్‌కి అమ్మగా చేసిన సీనియర్‌ నటి చేసిన కామెంట్లు ఇప్పుడు రచ్చ అవుతున్నాయి. 

26
mahesh babu

మహేష్‌ బాబుకి చాలా మంది సీనియర్‌ నటీమణులు అమ్మ పాత్రలు చేశారు. అందులో `నిజం` సినిమాలో  నటి రామేశ్వరి అమ్మగా చేసింది. కొడుకుని పగతీర్చుకునేందుకు తాను శంఖం పూరిస్తుంది. మహేష్‌ వెంట వెళ్లి తన ప్లాన్‌ ప్రకారంగా ప్రత్యర్థులను చంపిస్తుంటుంది. ఇలాంటి డిఫరెంట్‌ రోల్లో నటించి మెప్పించింది.

ఆ తర్వాత పెద్దగా తెలుగులో కనిపించలేదు. అడపాదడపాగానే ఆమె సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన `బ్రహ్మా ఆనందం` సినిమాలో మెరిసింది. బ్రహ్మీకి లవ్‌ ఇంట్రెస్ట్ పాత్రలో కనిపించింది. క్లైమాక్స్ లో వీరి కాంబో నవ్వులు పూయిస్తుంది. 
 

36
rameshwari

ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ క్లిప్‌ వైరల్‌ అవుతుంది. ఆమె మహేష్‌ బాబుపై చేసిన కామెంట్‌ పెద్ద రచ్చ అవుతుంది. యాంకర్‌ మీ కొడుకుతో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తున్నారు. ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్ అయిపోయారుగా? మహేష్‌ మీ కొడుకే కదా అని అడిగింది.

దీనికి రామేశ్వరి రియాక్ట్ అవుతూ. తెలియదండి. వాళ్లెవరికి బహుశా నేను ఉన్నానా? చచ్చానో కూడా తెలియదు. నిజాలు మాట్లాడుకుంటే అంతే. వాళ్లంతా వేరు, దాని గురించి నేను ఆలోచించను` అని కామెంట్‌ చేసింది. 
 

46
rameshwari

దీంతో ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మహేష్‌ బాబు రియాలిటీ ఇదంటూ యాంటీ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. ఆమె కామెంట్స్ సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నాయి. మహేష్‌ ని నెగటివ్‌గా చిత్రీకరించే ప్రయత్నం ట్రోలర్స్ చేస్తున్నారు.

యాంటీ ఫ్యాన్స్ ఇదే అదునుగా భావించి రెచ్చిపోతున్నారు. ఇది వివాదానికి దారితీస్తుంది. దీనికి మహేష్‌ బాబు ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ, ఆయన గురించే నటి రామేశ్వరి మరో సందర్భంలో మాట్లాడిన వీడియోని జోడిస్తున్నారు. నంది అవార్డు ఫంక్షన్‌లో మహేష్‌ బాబుకి వెనకాలే తాను కూర్చుందట. 
 

56
mahesh babu

లేచి వెళ్లిపోతున్న సమయంలోనే ఆయన ఏదో కామెంట్‌ చేస్తూ ఆమె వైపు తిరిగి చూశాడట. మీరు కూడా వచ్చారా? అదేంటి మాట్లాడొచ్చు కదా అన్నాడట. మాట్లాడొచ్చు, కానీ ఎందుకు మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం అని ఊరుకున్నాను అని చెప్పిందట. దీనికి మహేష్‌ స్పందిస్తూ మీరు నన్ను కొట్టి అయినా మాట్లాడొచ్చు, తెలుసా మీకు అని చెప్పాడట మహేష్‌.

నాకు తెలుసు కానీ చేయను, నేను ఎప్పుడూ అలాంటి అడ్వాంటేజ్‌ తీసుకోను అని తెలిపింది రామేశ్వరి. సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది. దీని ప్రకారం ఆమె ఉద్దేశం వాళ్లు వేరు, పెద్ద స్టార్స్, ఇవన్నీ పట్టించుకోరు అనేది ఆమె చెప్పదలుచుకున్నారు, కానీ దాన్ని వివాదం చేయడం సరికాదని మహేష్‌ బాబు ఫ్యాన్స్.. ట్రోలర్స్ కి, యాంటీ ఫ్యాన్స్ కి కౌంటర్లు వేస్తున్నారు. 

66
Mahesh Babu

మహేష్‌ బాబు ఇప్పటి వరకు తెలుగు సూపర్‌ స్టార్‌గానే రాణించారు. ఇకపై ఆయన ఏకంగా గ్లోబల్‌ స్టార్‌గా పిలిపించుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ఎంబీ29 సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్‌లోనే ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది.

ఇందులో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే, ఆమె మహేష్‌కి సపోర్ట్ గా ఉండే పాత్రలో కనిపిస్తుందని, నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. దీన్ని అంతర్జాతీయ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దుతున్నారు రాజమౌళి.  

read more: తెలుగు అమ్మాయిలకు సినిమా ఆఫర్స్, ట్రోలర్స్ దెబ్బకి మనసు మార్చుకున్న ఎస్‌కేఎన్‌

also read: NTR: ఎన్టీఆర్ కు నిద్రపట్టనివ్వని ‘యమదొంగ’ఫస్ట్ డే షాకింగ్ టాక్ !
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories