నక్కలు, పిచ్చికుక్కలు ఓట్‌ చేస్తే టేస్టీ తేజని పనిష్‌ చేస్తారా? నాగార్జున, బిగ్‌ బాస్‌పై ట్రోల్స్

First Published | Nov 10, 2024, 8:20 AM IST

టేస్టీ తేజ బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌లో వరస్ట్ కంటెస్టెంట్‌గా నాగార్జున తేల్చిన నేపథ్యంలో బిగ్‌ బాస్‌పై, నాగ్‌పై ట్రోల్‌ నడుస్తుంది. పెద్ద తప్పు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 పదో వారం ముగింపుకి చేరుకుంది. ఈ ఆదివారంతో విజయవంతంగా పది వారాల షో పూర్తి చేసుకుంటుందని చెప్పొచ్చు. ఇకపై హౌజ్‌లో ఆట వేరే లెవల్‌లో ఉండే అవకాశం ఉంది. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లు అంతా ఒక్కొక్కరుగా ఎలిమినేట్‌ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక పదో వారం ఇప్పటికే గంగవ్వని బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు పంపించారు. ఆమెకి ఆరోగ్య సమస్యలు ఉండటంతో, తాను హౌజ్‌లో ఉండలేనని చెప్పడంతో బిగ్‌ బాస్‌ నిర్ణయం తీసుకున్నాడు, నాగార్జున ఆమెని డైరెక్ట్ గా ఎలిమినేట్‌ చేశాడు.

దీంతోపాటు ఈ రోజు నామినేషన్‌లో ఉన్న వారిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. నిఖిల్‌, గౌతమ్‌, యష్మి, ప్రేరణ, పృథ్వీరాజ్‌, విష్ణుప్రియా, హరితేజ పదో వారం నామినేషన్‌లో ఉండగా, వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు హరితేజ అని టాక్‌. ఆమెకి తక్కువ ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఎలిమినేట్‌ అయ్యిందని సమాచారం.  

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్‌బాస్‌ పై రెండు రకాలుగా ట్రోల్‌ నడుస్తుంది. అలాగే హోస్ట్ నాగార్జునపై కూడా ఆ ట్రోలింగ్‌ ఉండటం గమనార్హం. టేస్టీ తేజ విషయంలో నాగ్‌ నిర్ణయాన్ని, ఆయన చెప్పిన తీరుని తప్పుపడుతున్నారు. శనివారం ఎపిసోడ్‌లో టేస్టీ తేజకి నాగార్జున పెద్ద షాక్‌ ఇచ్చిన విసయం తెలిసిందే.

ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ని హౌజ్‌ గెలుచుకోలేకపోవడానికి కారణం తేజనే అని నాగార్జున తేల్చారు. ఆయన చేసిన మిస్టేక్‌ వల్లే హౌజ్‌ దాన్ని గెలుచుకోలేకపోయిందని, దీంతో ఆయన వచ్చే వారం మెగా చీఫ్‌ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడని, కండెండర్‌గా పోటీ పడేందుకు అవకాశం లేదని తెలిపారు నాగార్జున. 
 


అంతేకాదు బిగ్‌ బాస్‌ హౌస్‌లో వరస్ట్ పర్‌ఫెర్మర్‌గానూ తేజనే తేల్చారు. అయితే ఆయనకు కేవలం మూడు ఓట్లు మాత్రమే పడ్డాయి. 12 మంది హౌజ్‌మేట్స్ లో నిఖిల్‌, విష్ణుప్రియా, పృథ్వీరాజ్‌లు మాత్రమే తేజని వరస్ట్ పర్‌ఫెర్మర్‌గా తేల్చారు. ఇంకా 9 మంది ఇతరుల పేర్లు చెప్పారు. మూడు ఓట్లు వచ్చిన కారణంగా తేజని చెత్త కంటెస్టెంట్‌గా తేల్చేశారు నాగార్జున. దీని కారణంగా ఫ్యామిలీ వీక్‌లో ఆయన తన ఫ్యామిలీని చూసే అవకాశాన్ని, వాళ్లు హౌజ్‌లోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయాడు.

అంతేకాదు ఇది తేజకి వార్నింగ్‌ బెల్‌గానూ తెలిపారు నాగార్జున. దీంతో ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు తేజ. ఏదైతే అయ్యింది, తాను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు తేజ తెలపడం విశేషం. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా తాను ఎంట్రీ ఇచ్చిన ఉద్దేశ్యమే తన ఫ్యామిలీని హౌజ్‌లోకి తీసుకురావాలనేది. తన అమ్మని హౌజ్‌లోకి తీసుకురావాలనే ఎయిమ్‌తో వచ్చినట్టు తేజ ప్రారంభంలోనే తెలిపారు. 

గత సీజన్‌లోనూ తేజ వచ్చాడు. కానీ మధ్యలోనే ఎలిమినేట్‌ అయ్యాడు. ఫ్యామిలీ వీక్‌కి ముందే ఆయన ఎలిమినేట్‌ అయ్యాడు. దీంతో ఈ సారైనా ఆ కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. కానీ సడెన్‌ ట్విస్ట్ తో పెద్ద షాక్‌లోకి వెళ్లిపోయాడు తేజ. వరస్ట్ పర్ఫెర్మర్‌ అనే ట్యాగ్‌ కూడా ఇవ్వడం మరింత షాకిస్తుంది. దీంతో దెబ్బ మీద దెబ్బ పడ్డటయ్యింది.

నిజానికి తేజ మరీ అంత డల్‌గా లేడు, ఇతర చాలా మందితో పోల్చితే మంచి ఎంటర్‌టైనర్‌ కూడా. కానీ హౌజ్‌మేట్స్ గేమ్స్‌ ని చూసి మాత్రమే ఓట్‌ చేశారు. పైగా ఆయనకు కేవలం మూడు ఓట్లు మాత్రమే పడ్డాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా వరస్ట్ పర్‌ఫెర్మర్‌గా డిసైడ్‌ చేస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నక్క, పిచ్చికుక్క, టింగరి బుచ్చి వేసిన ఓట్లకు తేజ వరస్ట్ పరఫెర్మర్‌ అవుతాడా? అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

ఇది అన్‌ఫెయిర్‌ గేమ్‌ అంటున్నారు. మోరల్‌గా ప్రతి వీక్‌ తేజని డౌన్‌ చేస్తున్నారని, తేజనేకాదు, తెలుగు వారిని డౌన్‌ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇది బిగ్‌ బాస్‌ ఛీప్‌ ట్రిక్‌ అని, టీఆర్‌పీ కోసం ఇలా చేస్తున్నారని అంటున్నారు. 
 

అదే సమయంలో తేజ ఫ్యాన్స్ ఆయన బెస్ట్ గేమ్‌ వీడియోలను వైరల్‌ చేస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు. తేజ 2.0 అంటూ వైరల్‌ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో రోహిణి తేజ కోసం తన ఫ్యామిలీని త్యాగం చేస్తానని తెలిపింది. నా ఫ్యామిలీకి అంత ఎక్కువగా ఉండదు, కాబట్టి మీ ఫ్యామిలీని పంపించమని బిగ్‌ బాస్‌ని అడుగుతా అని వెల్లడించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌పై రెండు రకాలుగా ట్రోల్‌ నడుస్తుంది. ఒకటి తేజని ఇలా పనిష్‌ చేయడం, మరోటి వైల్డ్ కార్డ్ ద్వారా కొందర పప్పులను తీసుకురావడం. గంగవ్వని అనవసరంగా తీసుకొచ్చారని అంతా వైరల్‌ అయ్యింది. ఆమె వచ్చి ఎంటర్‌టైన్‌ చేసింది కూడా లేదు. దీంతోపాటు మెహబూబ్‌, నయనిపావని కూడా పెద్దగా ఆడలేదు. హరితేజ కొన్నిసార్లు మెరుస్తుంది, మరికొన్ని సార్లు డల్‌గానే ఉంటుంది.

ఇలా సగం కంటెస్టెంట్లు డల్‌ వాళ్లనే తీసుకొచ్చారు. ఇప్పటికే బిగ్‌ బాస్‌ షోని చూసేందుకు జనం ఆసక్తి చూపించడం లేదు, రేటింగ్‌ కూడా తక్కువగా ఉంది. దీంతో క్రేజీ కంటెస్టెంట్లని దింపాలి తప్ప, ఇలాంటి డల్‌ కంటెస్టెంట్లతో ఏం ప్రయోజనం అంటూ బిగ్‌ బాస్‌ షో నిర్వహకులను ఆడుకుంటున్నారు నెటిజన్లు. మరి దీన్ని వాళ్లు ఎలా తీసుకుంటారో చూడాలి.   

read more: `గేమ్‌ ఛేంజర్` టీజర్‌, విజువల్స్ కేక.. కానీ ఆ మ్యాటర్‌ విషయంలోనే అన్‌ ప్రెడిక్టబుల్‌ !

also read: ఎలిమినేషన్‌లో షాకింగ్‌ ట్విస్ట్, గంగవ్వని హౌజ్‌ నుంచి పంపించేసిన నాగ్‌.. బిగ్‌ బాస్‌ చేసిన మిస్టేక్‌ ఇదే
 

Latest Videos

click me!