ఏడు సిటీల్లో `పుష్ప 2` హంగామా, `సలార్‌ 2`లో కొరియన్‌ యాక్టర్‌.. కిరణ్‌ అబ్బవరంపై బన్నీవాసు సంచలన కామెంట్‌

First Published | Nov 10, 2024, 12:22 AM IST

`పుష్ప 2` సినిమా హంగామా స్టార్ట్ అయ్యింది. `సలార్‌2`లో కొరియన్‌ యాక్టర్‌ నటించబోతున్నాడు. ఇక `క` సక్సెస్‌ విషయంలో కిరణ్‌ అబ్బవరంపై బన్నీవాసు క్రేజీ కామెంట్స్ చేశారు. ఆ కథేంటో చూద్దాం. 
 

ఏడు నగరాల్లో `పుష్ప 2` ప్రమోషనల్‌ ఈవెంట్లు..

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న `పుష్ప 2` సినిమా వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 5న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్‌ పెంచింది టీమ్‌. తాజాగా క్రేజీ అప్‌ డేట్స్ ఇచ్చింది. ఏడు నగరాల్లో భారీ ఈవెంట్లు ప్లాన్‌ చేసినట్టు తెలిపింది. హైదరాబాద్‌తోపాటు ముంబయి, చెన్నై, బెంగుళూరు, కొచ్చి, పాట్నా, కోల్ కత్తా వంటి నగరాల్లో ఈవెంట్లు నిర్వహించబోతుంది.

అయితే దీనికి సంబంధించిన డేట్స్ త్వరలోన వెల్లడించబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ చివరి దశ షూటింగ్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అనుకున్న డేట్‌కి తీసుకురావాలని టీమ్‌ శ్రమిస్తుంది. సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఓపెనింగ్‌ డేనే రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని టార్గెట్‌ చేసినట్టు తెలుస్తుంది.  
 

Kiran Abbavaram , KA movie

`క` హీరో కిరణ్‌ అబ్బవరంపై నిర్మాత బన్నీ వాసు క్రేజీ కామెంట్స్.. 

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం 'క'. తన్వీరామ్‌, నయన సారిక హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి సుజీత్‌, సందీప్‌ దర్శకులు. చింతా గోపాల్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం దిశగా పయనిస్తోంది.  ఈ నేపథ్యంలో ఈ చిత్రం గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న బన్నీవాస్ 'క' టీమ్‌ను అభినందించారు.

ఆయన మాట్లాడుతూ హీరో కిరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `ఈ సినిమా నిజంగా బాగా నచ్చింది. నేను ఎన్నో కథలు విన్నాను. ఎన్నో వందల కథలు వినడం వల్ల సినిమా గురించి ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం.  కానీ  ఈ సినిమా క్లైమాక్స్‌ నేను ఎక్స్‌ పెక్ట్‌ చేయలేదు. ఇలాంటి పతాక సన్నివేశాలు వస్తాయని నేను గెస్‌ చేయలేదు. గ్రేట్‌ స్క్రీన్‌ప్లే ఇది. స్క్రీన్‌ప్లేలో చిన్న తప్పు కూడా లేదు. పతాక సన్నివేశాల్లో ఈ సినిమా స్క్రీన్‌ప్లే విషయంలో క్లాప్స్‌ పడ్డాయి. 
 


మీరు ఎంత గొప్ప రచయిత అయినా ఈ సినిమా క్లైమాక్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తే మీరు దేవుళ్లతో సమానం.ఈ సినిమాలో పనిచేసిన అందరికి శుభాకాంక్షలు. ఈ నిర్మాత గట్స్‌ అభినందనీయం. ఈ సినిమా  బడ్జెట్‌ విని షాక్‌ అయ్యాను. కిరణ్‌, వంశీ నాకు నా మనసుకు దగ్గరయిన వ్యక్తులు. వంశీ నందిపాటి నాకు రేట్‌ చెప్పకుండా కొన్నాడు. రేట్‌ తెలిసి షాక్‌ అయ్యాను. సినిమా చూసిన తరువాత వీళ్ల క్యాలికేలేషన్స్‌ వంశీ నమ్మకం నిజమైంది.

సినీ పరిశ్రమలో ఛాన్స్‌  క్రియేట్‌ చేసుకున్న వ్యక్తులు ఎదుగుతారు. కిరణ్‌ అవకాశం క్రియేట్‌ చేసుకున్నాడు. చాలా కషపడ్డాడు. చాలా మంది కిరణ్‌ పడిపోయాడు. ఇక పని అయిపోయింది అన్నారు. కానీ అతను ఫైట్‌ ఆపలేదు. ఆట ఓడిపోవడం అంటే ఆ ఆటగాడు  ఆటను వదిలేసినప్పుడే , కిరణ్‌ ఎప్పుడు సినిమాను వదల్లేదు. అందుకే కిరణ్‌ గెలిచాడు. కిరణ్‌ ను చూస్తే ఇన్‌స్పిరేషన్‌గా ఉంది అన్నారు బన్నీవాసు. 
 

`సలార్‌ 2`లో కొరియన్‌ స్టార్‌.. హైప్‌ పెంచిన టీమ్‌

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో గతేడాది డిసెంబర్‌లో వచ్చిన `సలార్‌` సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. గట్టి పోటీ మధ్య ఇది ఏడువందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఇందులో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్ర పోషించగా, శృతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా పెద్ద హిట్‌ అయిన నేపథ్యంలో ఇప్పుడు `సలార్‌2`కి  సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇటీవలే ప్రభాస్‌తో మూడు సినిమాలు చేయబోతున్నట్టు హోంబలే ఫిల్మ్స్ సంస్థ ప్రకటించారు. అందులో భాగంగా మొదట `సలార్‌ 2` రాబోతుందని తెలిపింది. ఇప్పుడు మరో అప్‌ డేట్‌ ఇచ్చింది టీమ్‌. ఇందులో సౌత్‌ కొరియన్‌- అమెరికా స్టార్‌ నటించబోతున్నారు. పాపులర్‌ స్టార్‌ డాన్‌లీ నటించబోతున్నారు. ఆయనే ఈ విషయాన్ని తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయాన్ని పంచుకోవడం విశేషం. దీంతో సినిమాపై హైప్‌ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌..ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారు. అనంతరం ఈ మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ రెండూ పారలల్‌గా చేయబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. 
 

`ధూం ధాం` థ్యాంక్స్ మీట్‌.. 

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందించారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. శుక్రవారం విడుదలైన మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది టీమ్‌. సినిమాకి ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో థ్యాంక్స్ చెప్పింది టీమ్‌. 

హీరో హీరో చేతన్ కృష్ణ మాట్లాడుతూ - మా "ధూం ధాం" సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుంచి ఎక్సలెంట్ రెస్పాన్స్ వస్తోంది. మీడియా నుంచి కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. నిన్న (ఫ్రైడే) మార్నింగ్ నుంచి రాత్రి వరకు ప్రతి షోకు థియేటర్స్ లో ఫుట్ ఫాల్స్ పెరిగాయి. సినిమా చాలా బాగుందంటే తప్ప ఆడియెన్స్ బయటకు రాని ఈ ట్రెండ్ లో మా మూవీకి 70, 80 పర్సెంట్ హౌస్ ఫుల్స్ కావడం సంతోషంగా ఉంది.

సినిమాలో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని మేము ముందు నుంచీ చెబుతూ వస్తున్నాం. ఆ ఎంటర్ టైన్ మెంట్ కే ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. సినిమాని పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నా అన్నారు. ఇందులో గోపీమోహన్‌, దర్శకుడు సాయి కిషోర్‌ మచ్చా, నిర్మాత రామ్‌ కుమార్‌,  రైటర్‌ ప్రవీణ్‌, నటుడు గిరిధర్‌, ఎడిటర్‌తోపాటు హీరోయిన్‌ హెబా పటేల్‌ పాల్గొని తమ ఆనందాన్ని 

Read more:`గేమ్‌ ఛేంజర్` టీజర్‌, విజువల్స్ కేక.. కానీ ఆ మ్యాటర్‌ విషయంలోనే అన్‌ ప్రెడిక్టబుల్‌ !

Also read: సూర్య-జ్యోతిక ఎంత ధనవంతులో తెలుసా?.. సూర్య కంటే జ్యోతికకే ఎక్కువ ఆస్తులున్నాయా?

Latest Videos

click me!