‘పుష్ప-2’ : నాన్ థియోటర్ రెవిన్యూలో న్యూ హిస్టరీ, లెక్కలు చెప్పిన మరో స్టార్ పొడ్యూసర్

First Published | Nov 10, 2024, 8:17 AM IST

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాకి భారీ క్రేజ్ నెలకొంది. నాన్ థియేటర్ రెవిన్యూలో కొత్త రికార్డులు సృష్టించింది. పుష్ప 2 హిందీ వెర్షన్ రైట్స్ 260 కోట్లకు అమ్ముడుపోయాయి.

Allu Arjun, #Pushpa2, sukumar

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా “పుష్ప 2” కి  ఏ రేంజిలో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  హై ఎక్సపెక్టేషన్స్  ఉన్న ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ అంతకు మించి అన్నట్లు  తెరకెక్కిస్తుండగా ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.  అదే సమయంలో ఈ చిత్రం బిజినెస్ కూడా జరిగింది. నాన్ థియేటర్ రెవిన్యూలో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


పుష్ప 2 చిత్రం ఓటిటి, శాటిలైట్, ఆడియో రైట్స్ విషయంలో రికార్డ్ లు బ్రద్దలు కొట్టింది. ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పిన దాని ప్రకారం పుష్ప 2 హిందీ వెర్షన్ రైట్స్ 260 కోట్లు పలికాయి.  ఏ సౌతిండియన్ సినిమా ఈ రేటు పలకలేదు.  

ఈ రేటుతోనే చెప్పచ్చు...నార్త్ లో ఈ సినిమాకు ఏ స్దాయి క్రేజ్ ఉంది అనేది. ఇదొక ఫ్యాన్సీ డీల్ అని చెప్పాలి.  అయితే ఇంత పెద్ద మొత్తం రికవరీ అవ్వాలంటే మినిమం మూడు  వారాలు అయినా హౌస్ ఫుల్స్ తో నార్త్ లో  ఆడాలని అంటున్నారు.  


Allu Arjun, #Pushpa2, sukumar


తెలుగు రాష్ట్రాల్లో ఎలాగో అల్లు అర్జున్ మేనియాతో నడిచిపోతుంది. ఇప్పుడు నార్త్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయితే ప్యాన్ ఇండియా మార్కెట్ లో అల్లు అర్జున్ తనదైన ముద్ర వేస్తున్నట్లే.  గతంలో నార్త్ లో రికార్డులు తిరగరాసింది పుష్ప చిత్రం.

అల్లు అర్జున్ మేనరిజమ్స్ అక్కడి ఆడియన్స్ ని ఫిదా చేసేశాయి. నార్త్ లో పుష్ప రూ.108 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ‘పుష్ప’ కి సీక్వెల్ గా ‘పుష్ప 2 ‘ (Pushpa2) కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

Allu Arjun, #Pushpa2, sukumar


2021లో విడుదలై సూపర్‌హిట్‌ అందుకున్న ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2). అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటిస్తోంది.
ఈ సినిమా భారీ రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాని మాత్రం భారత్‌లో విడుదల చేసిన రోజునే, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించింది. రష్యాతోపాటు... 20కి పైగా  దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.  సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమా కోసం రాత్రింబవళ్లూ పని చేస్తున్నారు.  
 

Allu Arjun, #Pushpa2, sukumar


  ఈ సినిమాతో ఎట్టిపరిస్దితుల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిన పరిస్దితి సుకుమార్. అయినా ఆ ఒత్తిడిని తన మీద పడనివ్వకుండా సుకుమార్ చాలా జాగ్రత్తగా సినిమా అన్ని అంశాలు అద్బుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ముఖ్యంగా పెద్ద సినిమాలకు ప్రాణంగా నిలిచే విజువల్ ఎఫెక్ట్స్,   VFX క్వాలిటీ మిస్ కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు  VFX వర్క్ యూరప్ లో చేయించారు.

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

విజువల్ ఎఫెక్ట్స్ పుష్ప2  సినిమాకు ప్రాణంగా నిలవనున్నాయి. జపాన్, శ్రీలంక వంటి వైవిధ్యమన లొకేషన్స్ లు, మల్టిఫుల్ జోన్స్, అడవులలో షూట్ చేయటంతో వాటిని ఒకే తాటిపై తెచ్చి...ఒకే చోట చిత్రీకరించినట్లు అనిపించటానికి VFX వాడుతున్నారని తెలుస్తోంది. లైవ్ యాక్షన్ షాట్స్ తో కూడిన విజువల్ ఎఫెక్ట్స్ రియలిస్టిక్ లుక్ తేవటంలో తమ  పాత్రను సమర్దవంతంగా నిర్వహిస్తాయి. 

పుష్ప 2 లో కొన్ని పార్ట్ లు CGI లో క్రియేట్ చేసినప్పటికీ, VFX కే ఎక్కువ ప్రయారిటీ. VFX, CGI కలిసి కొత్త ప్రపంచాన్ని చూసేవారికి అందించబోతున్నాయి. హాలీవుడ్ చిత్రాలు ఎక్కువగా యూరప్ లో  VFX చేస్తూంటారు.

అక్కడ చాలా పెద్ద సినిమాలకు పని చేసిన టీమ్ పుష్ప 2 కు పనిచేస్తోంది. కాబట్టి సుకుమార్ రిలాక్స్ గా,కాన్ఫిడెంట్ గా ఉన్నారు.  ఇప్పటికే ఫస్టాఫ్ ఓకే చేసి లాక్ చేసేసారు. దాదాపు  600 నుంచి  800 షాట్స్ దాకా రీవర్క్ చేసారు. ఎంత ఖర్చు అయినా పెట్టడానికి నిర్మాతలు ఉత్సాహం చూపించటమే అందుకు కారణం. 
 

 మొదటి పార్టులో పుష్ప ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్.. రెండో పార్టులో ఎలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అని చూపించబోతున్నారని సమాచారం.  ఈ సీక్వెల్ లో జపాన్ ఎపిసోడ్, జాతరలో బన్నీ చీర కట్టు ఫైట్ ఓ రేంజ్​లో ఉండనుందని టాక్ వినిపిస్తోంది.

ఫహద్ ఫాజిల్ - అల్లు అర్జున్ మధ్య ఫైట్స్​ను మూడో భాగంలోనే ఎక్కువగా చూసే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు పరిచయం కాని చాలా కొత్త పాత్రలు కూడా ఎంట్రీ ఇస్తాయని చెబుతున్నారు. దీని బట్టి పుష్పను టాలీవుడ్​లో ఒక పవర్ ఫుల్ బ్రాండ్​గా మార్చేందుకు సుక్కు సినిమాను గట్టిగానే చెక్కుతున్నారని అర్థమవుతోంది.

Read more: `గేమ్‌ ఛేంజర్` టీజర్‌, విజువల్స్ కేక.. కానీ ఆ మ్యాటర్‌ విషయంలోనే అన్‌ ప్రెడిక్టబుల్‌ !

Also read: ఏడు సిటీల్లో `పుష్ప 2` హంగామా, `సలార్‌ 2`లో కొరియన్‌ యాక్టర్‌.. కిరణ్‌ అబ్బవరంపై బన్నీవాసు సంచలన కామెంట్‌
 

Latest Videos

click me!