Bollywood Heros : బాలీవుడ్ హీరోల ఫేస్ మార్ఫింగ్.. ఒక్కొక్కరిని ఇలా మార్చారేంటయ్యా!

Published : Feb 20, 2024, 06:43 PM ISTUpdated : Feb 20, 2024, 06:47 PM IST

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో డీప్ ఫేక్, ఫేస్ మార్ఫింగ్ చేస్తూ సెలబ్రెటీలను ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హీరోల ముఖాలను మార్ఫింగ్ చేసిన వీడియో వైరల్ గా మారింది.  

PREV
16
Bollywood Heros : బాలీవుడ్ హీరోల ఫేస్ మార్ఫింగ్.. ఒక్కొక్కరిని ఇలా మార్చారేంటయ్యా!

ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా సెలబ్రెటీలు డీప్ ఫేక్ వీడియోలతో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. డీప్ ఫేక్ రాయుళ్లు తమ స్వలాభాల కోసం స్టార్స్ హోదాను కూడా గుర్తించకుండా పలు వీడియోలను, ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తున్నారు. 
 

26

ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలందరినీ ఇటీవల బాగా సెన్సేషన్ గా మారిన వీడియోతో ట్రోల్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఓ వైపు నవ్వు తెప్పిస్తున్న ఈ వీడియో మరోవైపు అభిమానులకు బాధకలిగిస్తోంది. 
 

36

ఆ మధ్యలో రష్మిక మందన్న (Rashmika Mandanna) ఫేస్ ను మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ వీడియోను వైరల్ చేశారు. దీనిపై సెలబ్రెటీలు పెద్ద ఎత్తుననే స్పందించారు. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. 

46

అయినా ఆగకుండా ఫేక్ రాయుళ్లు కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి స్వప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు. 

56

ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలందరినీ ఒకే వీడియోలో చేర్చి ఓ ఫన్నీ వీడియోను చేశారు. ఇటీవల ‘యాపిల్ యాపిల్.... రెడ్ రెడ్ యాపిల్.... బనాన బనాన ఎల్లో ఎల్లో బనాన’ అనే వీడియోతో మరో వీడియోను మార్చారు. 

66

ఈ ఫేక్ ఫన్నీ వీడియోలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రన్బీర్ కపూర్, అక్షయ్ కుమార్ వంటి బడా హీరోలను మార్ఫింగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై అభిమానులు తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories