అడ్డంగా దొరికిపోయిన అలీ ?, విపరీతంగా ట్రోలింగ్

Published : Jul 10, 2024, 07:13 AM IST

హాస్యనటుడు , నటుడు, టీవీ యాంకర్ అయిన అలీ 1000కి పైగా సినిమాల్లో నటించాడు. తమిళం, తెలుగు, హిందీ సినిమాలు ఈయన ఖాతాలో వున్నాయి. 

PREV
110
 అడ్డంగా దొరికిపోయిన  అలీ ?, విపరీతంగా ట్రోలింగ్

సోషల్ మీడియా యుగంలో ఉన్నాం మనం. ఇక్కడ ప్రతీ విషయాన్ని అందరూ నిశితంగా గమనిస్తూంటారు. మరీ ముఖ్యంగా సెలబ్రెటీలు విషయాలు అయితే జనాలకు బాగా పట్టించుకుంటారు. వాళ్లు మాట్లాడే మాటలకు, చేతలకు తేడా వస్తే తూర్పారబెట్టేస్తారు. ఇప్పుడు కమిడియన్ అలీకు అలాంటి పరిస్దితే ఎదురైంది. ఆయన గతంలో మీడియాలో చేసిన వ్యాఖ్యలకు ఆయన చేస్తున్న పనులకు పొంతన లేకపోవటం పట్టించింది. దాంతో ట్రోలింగ్ మొదలైపోయింది. ఇంతకీ అలీ ఏం చేసారు.

210


కమిడియన్ అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన అలీ కొన్ని సినిమాల్లో కమెడియన్ గా మరికొన్ని సినిమాల్లో హీరోగా నటిస్తూ వచ్చారు.  మధ్యలో  కొన్ని సంవత్సరాలు పాటు .హీరోగా సినిమాలు చేసి కూడా మళ్లీ  కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించిన అతికొద్ది మందిలో అలీ ఒకరు.
 

310


ఇప్పటికీ తన తోటి వాళ్లు రిటైర్ అయ్యిపోయినా తను మాత్రం కొనసాగటానికి కారణం ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడానికి అలీ ప్రయత్నించటమే అనేది నిజం.మద్రాస్ లో ఉన్న సమయంలో అలీ పడిన కష్టాలుకు హైదరాబాద్ షిప్ట్ అయ్యి బిజీ అయ్యాక సమాధానం దొరికింది. లేటెస్ట్ వస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో సైతం ఆయన కనిపించి నవ్వించనున్నారు.

410


హాస్యనటుడు , నటుడు, టీవీ యాంకర్ అయిన అలీ 1000కి పైగా సినిమాల్లో నటించాడు. తమిళం, తెలుగు, హిందీ సినిమాలు ఈయన ఖాతాలో వున్నాయి. ఇప్పటివరకు అలీ రెండు నంది అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు (సౌత్) సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అలీతో సరదాగా అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

510


 అలాగే రీసెంట్ గా అలీ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియజేశారు. ఇకపై తాను రాజకీయాలకు దూరమని ప్రకటించిన అలీ.. నటుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఏ పార్టీకి మద్దతు పలకబోనని స్పష్టం చేశారు. రామానాయుడు ప్రోత్సాహంతోనే తాను నటుణ్ని అయ్యానన్న అలీ.. ఆయన కోరిక మేరకే 1999లో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
 

610


 తెలుగుదేశం పార్టీ తరుఫున బాపట్ల లోక్ సభ నుంచి అప్పట్లో రామానాయుడు పోటీ చేశారని.. ప్రచారం చేయాలని తనను అడిగినట్లు చెప్పారు. ఆయన కోసమే టీడీపీలో చేరి 20 ఏళ్లు కొనసాగినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు తనకు అన్నం పెట్టింది తెలుగు సినిమా ఇండస్ట్రీనేనన్న అలీ.. తన దయాగుణానికి రాజకీయం తోడైతే మంచి చేయవచ్చనే ఆలోచనతోనే రాజకీయాల వైపు వచ్చినట్లు చెప్పారు. అంతేకానీ నిజంగా రాజకీయాలు చేద్దామని రాలేదని వీడియోలో చెప్పుకొచ్చారు. 
 

710


ఇదిలా ఉంటే అలీ తాజాగా ఓ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా జనాలకు దొరికిపోయారు. గతంలో ఇదే అలీ బెట్టింగ్ ల వేయద్దంటూ గొప్పగా చెప్పి మన్ననలు పొందారు. ఇప్పుడు తనే ఓ బెట్టింగ్ యాప్ ని డబ్బులు ఆశపడి ప్రమోట్ చేయటంతో జనాలు జీర్ణించుకోలేకపోయారు. చెప్పిన మాటకు చేసే చేష్టకు సంభంధం లేదా అంటున్నారు. 
 

810


అ మధ్యన  `అలీతో స‌ర‌దాగా` టైమ్ లో అలీ శివాజీని ఓ ఇంటర్వ్యూ చేసినప్పుడు బెట్టింగుల జోలికి పోవొద్ద‌ని, జీవితాలు నాశనం చేసుకోవొద్ద‌ని, డ‌బ్బులు సంపాదించ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు కానీ, ఇలా ఈజీ మ‌నీ కోసం ఆశ ప‌డొద్ద‌ని సుద్దులు చెప్పాడు. అయితే ఇప్పుడు అదే అలీ.. ఓ బెట్టింగ్ యాప్‌ని ప్ర‌మోట్ చేస్తూ డ‌బ్బులు సంపాదించుకొంటున్నాడని ఆ వీడియోని, బెట్టింగ్ వీడియోని కలిపి షేర్ చేస్తున్నారు.

910


అయితే బెట్టింగ్ యాప్ లను ఎవరు ప్రమోట్ చేసినా తప్పే. అలీ మాత్రమే కాకుండా మరికొందరు సెలబ్రెటీలు కూడా ఇలాంటి యాప్ లను ప్రమోట్ చేస్తున్నారు. సెలబ్రెటీలు ముఖ్యంగా సినిమావారు తెరపై కనపడి యాప్ లో బెట్టింగ్ లు వేయచ్చు అని చెప్తూంటే కుర్రాళ్లు ఊరుకుంటారా...అక్కడ నుంచి జీవితాలు నాశనం చేసుకునే పరిస్దితి వస్తోంది.  కాబట్టి అలీ లాంటి వాళ్లు ఆలోచించి ఇలాంటి యాప్ లు ప్రమోట్ చేయాలి. 

1010


చాలా మంది బెట్టింగ్ యాప్ ల్లో డబ్బులు పోగొట్టుకున్నారు.  ఆ మధ్యన సిద్దిపేట జిల్లా చిన్నకోడురు మండలం రామునిపట్లలో ఓ కానిస్టేబుల్ ఆన్ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాదు.. భార్య పిల్లల్ని కూడా చంపాడు. ఈ ఘటనతో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కథ మరోసారి తెరమీదకు వచ్చింది. ఆన్ బెట్టింగ్ చేసి చాలా మంది రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు.   యాదాద్రి భువనగిరి జిల్లా లిగొండ మండలం గొల్నేపల్లిలో ఓ మహిళ ఆన్ లైన్ లో గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుంది. 
 

click me!

Recommended Stories