40 లక్షలు సాయం.. నటుడు పొన్నంబలంకు ప్రాణం పోసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Published : Jul 09, 2024, 09:54 PM IST

నటుడు పొన్నంబలం టాలీవుడ్ స్టార్ హీరోను మరోసారి తలుచుకన్నాడు. మన హీరో చేసిన సాయం చరిత్రంలో ఇంకెవరు చేయరనే  చెప్పాడు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు 40 లక్షలతో తనకు ప్రానం పోశాడట. ఇంతకీ ఎవరా స్టార్ హీరో.  

PREV
16
40 లక్షలు సాయం.. నటుడు పొన్నంబలంకు ప్రాణం పోసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?
villain ponnambalam

నటుడు పొన్నంబలం గుర్తుండే ఉంటాడు.. విలన్ గా ఆయన పెర్ఫామెన్స్ కు.. భయపడి దగ్గరకు కూడా వెళ్లేవారుకాదు. ప్రముఖ  పొన్నంబలం చిన్నప్పటి నుంచి కోలీవుడ్ ప్రపంచంలో స్టంట్ మ్యాన్‌గా పనిచేసి ఆ తర్వాత పెద్ద విలన్‌గా మారారు.1988లో విడుదలైన "కలియుగం" సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ హిందీ సినిమాల్లో కూడా నటించాడ. 

26
Actor Ponnambalam

తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విలన్‌గా, స్టంట్ మ్యాన్‌గా నటించిన పొన్నంబలం 35 ఏళ్లకు పైగా ఈ రంగంలో ఉన్నాడు. అయితే ఆయనకు కు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో పాటు.. ఆరోగ్యం దెబ్బతినడంతో బాగా ఇబ్బందులు పడ్డాడు. అన్ని సినిమాలు చేసినా.. ఆయన  తీవ్ర పేదరికంలో కూరుకుపోవడంతో వైద్య ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యం   క్షీణించడంతో.. ఆయన పలువురి సహాయం అడిగాడట. 

36

అయితే ఆయనకు తమిళ పరిశ్రమ కంటే కూడా తెలుగు  స్టార్ హీరో నుంచే అతిపెద్ద సాయం అందడం విశేషం. అది కూడా ఎవరో కాదు..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పొన్నం బలం కు సాయం చేశారట. రీసెంట్ గా ఈ విషయాన్ని మరో సారి గుర్తు చేశారు పొన్నంబలం. తన ప్రాణాలు కాపాడి తన దైవంలా మారారు మెగాస్టార్ అంటూ తమిళ నటుడు పొన్నం బలం అంటున్నారు. చిరంజీవి వల్లే తాను ప్రాణాలతో ఉన్నానన్నారు. 

46
Ponnambalam Chiranjeevi

తనను అన్నా వదినలు విషం పెట్టి చంపాలని చూశారు.. కిడ్నీలు రెండు పాడైపోయి.. మంచాన పడటంతో తన పని అయిపోయింది అనుకున్నాడట  పొన్నం. ఎవరు సాయానికి ముందుకు రాకపోవడంతో..పొన్నంబలం ఆశలు వదలుకున్నారు.చివరి ప్రయత్నంగా మెగాస్టార్ చిరంజీవికి వేడుకున్నాడు తమిళ నటడు. ఇక వెంటనే స్పందించిన మెగాస్టార్ చిరు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న పొన్నంబలంకు కావల్సిన సాయం చేశారట. 
 

56

అయితే అందరిలాగే  లక్ష రెండు లక్షలు ఇచ్చి వదిలేస్తారు అనుకున్నాను కాని ఆయన ఏకంగా  ఆసుపత్రి ఖర్చులన్నీ పెట్టుకున్నారు.  నాకు కిడ్నీ ప్రాబ్లమ్ రావడంతో అపోలోలో నాకు ట్రీట్మెంట్ చేశారు. దాని కోసం ఆయన దాదాపు  40 లక్షల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు పొన్నంబలం. తాను కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఉన్నపుడు తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న కొందరు డయాలసిస్‌ కోసం మాత్రమే సాయం చేశారని చెప్పారు. 

66
Ponnambalam

 పొన్నంబలం తన ఆరోగ్యం గురించి చెప్పినప్పుడు ఒకటి రెండు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తానని అనుకున్నానని చెప్పాడు. అయితే చిరంజీవి తన కోసం దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారని, ఆ ఆసుపత్రిలో తన కోసం 2000 రూపాయల అడ్మిషన్ ఫీజుతో ప్రారంభించి, మొత్తం వైద్య ఖర్చులు తానే భరిస్తున్నారని పొన్నంబలం విస్మయం వ్యక్తం చేశారు.

click me!

Recommended Stories