డైరెక్టర్‌ని చూద్దామని వెళితే హీరోయిన్‌ని చేశారు.. ఫస్ట్ సినిమాతోనే స్టార్ అయి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తుంది

Published : Jul 09, 2024, 11:07 PM IST

హీరోయిన్‌గా సినిమా అవకాశాలు రావడం ఇప్పుడు పెద్ద టఫ్‌ జాబ్‌. కానీ ఓ స్టార్‌ హీరోయిన్‌కి మాత్రం లక్కీగా వచ్చింది. డైరెక్టర్ చూద్దామని వెళితే హీరోయిన్‌ని చేసేశారు.   

PREV
16
డైరెక్టర్‌ని చూద్దామని వెళితే హీరోయిన్‌ని చేశారు.. ఫస్ట్ సినిమాతోనే స్టార్ అయి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తుంది

 సినిమాల్లో ఎప్పుడు ఎలాంటి మ్యాజిక్‌ జరుగుతుందో ఊహించలేదు. అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. దర్శకులు, నిర్మాతలు, కాస్టింగ్‌ మేనేజర్లు, హీరోలు ఇలా ఎవరి కంట పడ్డా, వాళ్లకి కనెక్ట్ అయినా సినిమా అవకాశాలు అనూహ్యంగా వస్తాయి. అంతేకాదు ఒక్క హిట్‌ పడిందంటో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోవచ్చు. ఒక్క హిట్‌ జీవితాన్నే మార్చేస్తుంది. హీరోయిన్ల విషయంలో ఇది చాలా మ్యాజికల్‌గా జరుగుతుంది. దర్శకుడి కంట్లో పడటమే కాదు, హిట కొడితే ఇక లైఫ్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ అనేలా ఉంటుంది.  

26

చాలా మంది హీరోయిన్లు ఇలా అనూహ్యంగా సినిమా ఆఫర్లు దక్కించుకుని హీరోయిన్‌గా మారి, హిట్‌ కొట్టి, ఓవర్‌ నైట్‌లోస్టార్‌ అయిపోయి ఇండస్ట్రీని దున్నేశారు. ఇప్పుడు కూడా దున్నేస్తున్నారు. ఇటీవల కాలంలో కృతి శెట్టి, శ్రీలీల ఆ కోవలో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అంతకు ముందు ఓ స్టార్‌ హీరోయిన్‌ కూడా ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది. తెలుగు తమిళ ఇండస్ట్రీలను దున్నేసింది. 
 

36

ఆమె ఎవరో కాదు సమంత. `ఏం మాయ చేసావె`తో హిట్‌ అందుకుని అందరి ఆడియెన్స్ ని మాయ చేసింది. ఇండస్ట్రీని మాయ చేసింది. ఆ తర్వాత రెండు భాషల్లో సినిమాల చేసి ఓ ఊపు ఊపేసింది. దాదాపు అందరు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి హిట్లు అందుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. సీనియర్లు తప్ప, అందరు సూపర్ స్టార్లతో జోడీ కట్టింది సమంత. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగింది. 
 

46

ఫంక్షన్లలో వెల్‌కమ్ గర్ల్ గా పనిచేసిన సమంత, ఫ్యాషన్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చింది. అయితే తనకు మొదటి సినిమా అవకాశం రావడం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీని రివీల్‌ చేసింది సమంత. తాను గౌతమ్‌ మీనన్‌ అంటే చాలా ఇష్టమట. తన ఫేవరేట్‌ డైరెక్టర్‌. ఆయన సినిమాలంటే పిచ్చి. తను ఎలా ఉంటాడో చూద్దామని వెళ్లిందట. కానీ అనూహ్యంగా హీరోయిన్‌గా ఎంపికైనట్టు చెప్పింది సమంత. 
 

56

`ఏం మాయ చేసావె` సినిమా కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసింది. ఇష్టమైన దర్శకుడిని చూసే అవకాశం వచ్చిందని భావించిన సమంత. ఎలాగైనా ఆయన్ని కలవాలని చెప్పి ఆడిషన్‌లో పాల్గొనేందుకు వెళ్లిందట. చూసి వస్తే చాలు అనుకుందట. హీరోయిన్ అవ్వాలని, తాను సెలక్ట్ కావాలని అస్సలు ఊహించలేదు. తన మైండ్‌ లో కూడా లేదు. హీరోయిన్‌ అవుతానని అనుకోలేదు. కానీ ఆడిషన్‌ చేశాక హీరోయిన్‌గా ఎంపికయ్యావని చెప్పారట. దెబ్బకి తాను కూడా షాక్‌ అయినట్టు చెప్పింది సమంత. `ఏం మాయ చేసావె` రిలీజ్‌ తర్వాత సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ విషయాన్ని వెల్లడించింది. 
 

66

సమంత ఆ మూవీ తర్వాత స్టార్‌అయిపోయింది. తెలుగులో అందరు హీరోలతోనూ నటించింది. నాగచైతన్యతో ఐదు సినిమాలు చేసింది. ఆయనతో ప్రేమలో పడింది. 2017 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. 2021లో విడిపోయారు. ఈ ఇద్దరు విడిపోవడానికి స్పష్టమైన కారణాలేంటనేది తెలియదు. ఆ తర్వాత మయోసైటిస్‌ వ్యాధితో బాధపడిన సమంత.. దాన్నుంచి కోలుకుంటుంది. ఏడాది సినిమాలకు బ్రేక్‌ తీసుకుని ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతుంది. `మా ఇంటి బంగారం` అనే చిత్రంలో నటిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories