పవన్ కళ్యాణ్ గెలుపుతో... త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన నిర్ణయం, ఏం చేయబోతున్నాడో తెలుసా..?

Published : Jun 06, 2024, 03:09 PM IST

ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న మాట.. పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూక అని. పవన్ కళ్యాన్ హీరోగా.. ఇప్పుడు ఎమ్మెల్యేగా.. ప్రభుత్వంలో కీలక బాధత్యలు తీసుకోబోతుండగా.. ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ కూడా వినిపించబోతున్నాడు. 

PREV
18
పవన్ కళ్యాణ్ గెలుపుతో... త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన నిర్ణయం, ఏం చేయబోతున్నాడో తెలుసా..?

పవర్ స్టార పవర్ కళ్యాణ్.. టాలీవుడ్ లో స్టార్ హీరో. రోజుకు రెండు కోట్లు సంపాధించే స్టార్. రాజకీయల్లోకి వచ్చి ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేశాడు. ఎన్నో మాటలు..అవమానాలు తరువాత  పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ పవర్ ఏంటో చూపించాడు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు.. వంద శాంతం తన అభ్యర్ధులను గెలిపించుకున్నారు పవన్. 

28

దేశంలోనే ఇంతవరకూ ఎవరూ సాధించలేని రికార్డ్ సాధించాడు పవన్. ఇక ఆయనకు ఇండస్ట్రీ నుంచి వివిధ రంగాల ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు ఎన్ని వాచ్చాయో అందరికి తెలిసిందే. ఇక పవర్ స్టార్ పొలిటికల్ పవర్ ను చూడబోతున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్ దిల్ ఖుష్ గా ఉన్నారు. 

38

ఇక ఈక్రమంలో పవన్ కు ఆత్మియుల స్పందన కూడా అందరూ చూశారు. అందులో మరీ ముఖ్యంగా పవర్ స్టార్ వెన్నెంటే ఉండే స్నేహితుడు దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ కు ఎలా విష్ చేస్తారా అని అందరికి ఆలోచన ఉంది. అయితే ఈ విషయంలో త్రివిక్రమ్ ఓ సంచలన నిర్ణయం తీసకున్నాడట. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.

48
Pawan Kalyan- Trivikram

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ..త్రివిక్రమ్  ఎంతో హెల్ప్ చేశారు పవన్ కళ్యాణ్ కు అన్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే . చాలా మంది వాళ్ళని విడగొట్టడానికి చూసిన సరే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ మాత్రం ఎప్పుడు తమ ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేసుకోలేదు . 

58

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడానికి.. నిలబడటానికి..  పరోక్షకంగా త్రివిక్రమ్ సలహాలు కూడా కారణమే అంటున్నారు విశ్లేషకులు. పవన్ రాజకీయ జీవితంలో.. త్రివిక్రమ్ కూడా విమర్షలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ లో న్యూస్ వైరల్ అవుతోందతి. 

68


త్వరలోనే పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై ఒక సినిమా తెరకెక్కించడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడట. దీనికి సబంధించిన  కథను కూడా  రాసుకుంటున్నారట త్రివిక్రమ్. ఆయన ఎలా ఇండస్ట్రీలోకి వచ్చాడు ..? ఇష్టం లేకపోయినా సినిమాలల్లో ఎలా నటించాడు..? ఆయనను బాధ పెట్టిన వ్యక్తులు ఎవరు..? ఓడిపోయిన సంధర్భంలో ఆయన ఏం చేశాడు..? 
 

78

పవన్  పొలిటికల్ ఎంట్రీతో పాటు.. ఆయన్ను రాజకీయంగా ఇబ్బందిపెట్టింది ఎవరు..? ఎలా ముందుకు వెళ్లారు ..? ఎలా ఆయనను తొక్కేయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి.  అన్న విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాసరావు . అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తారా ..? వేరే హీరో నటిస్తారా..? అన్నది ఇంకా క్లారిటీ లేదు . 

88

అఫీషియల్ గా ఈ విషయం రాకపోయినా.. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అయ్యింది. అంతే కాదు ఈసినిమా నిజంగా వస్తే.. సినిమా చరిత్రలో పెద్ద సంచలనం అవుతుంది అంటున్నారు. మరి దీనికి పవర్ ఒప్పుకుంటాడా..? ఈ వార్త ఎంత వరకూ నిజం అయ్యే అవకాశం ఉంది చూడాలి మరి. 

Read more Photos on
click me!

Recommended Stories