వేణు మాధవ్ ని ఒక్క సీన్ తో పక్కన పెట్టేయాలనుకున్న రాజమౌళి.. కానీ పిలిచి మరీ, ఏం జరిగిందంటే 

First Published Jun 6, 2024, 3:03 PM IST

దివంగత కమెడియన్ వేణు మాధవ్ ని తెలుగు ప్రేక్షకులు మరచిపోలేరు. తన హాస్యంతో వేణు మాధవ్ కడుపుబ్బా నవ్వించిన విధానం చిరస్థాయిగా నిలిచిపోతుంది. అనారోగ్యం కారణంగా ఐదేళ్ల క్రితం వేణు మాధవ్ మరణించిన సంగతి తెలిసిందే.

దివంగత కమెడియన్ వేణు మాధవ్ ని తెలుగు ప్రేక్షకులు మరచిపోలేరు. తన హాస్యంతో వేణు మాధవ్ కడుపుబ్బా నవ్వించిన విధానం చిరస్థాయిగా నిలిచిపోతుంది. అనారోగ్యం కారణంగా ఐదేళ్ల క్రితం వేణు మాధవ్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే వేణు మాధవ్ ప్రముఖ కమెడియన్ గా కొనసాగుతూనే ఎన్నో వివాదాల్లో కూడా నిలిచారు. 

తన ప్రవర్తన కారణంగా దర్శకులు అతడిని దూరం పెట్టారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. హెల్త్ సమస్యల వల్ల చివర్లో వేణు మాధవ్ ఎక్కువ చిత్రాల్లో నటించలేదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అయితే గతంలో వేణుమాధవ్ రాజమౌళి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ముఖ్యంగా సై చిత్రం సమయంలో జరిగిన సంగతులని వేణు మాధవ్ గుర్తు చేసుకున్నారు. వాస్తవానికి సై చిత్రం విషయంలో నేను చేయాల్సింది ఒక్క సీన్ మాత్రమే. కాలేజీ గోడలపై పెయింట్ వేస్తుంటే స్టూడెంట్స్ వచ్చి నన్ను కొడతారు. ముందు స్టూడెంట్స్ ని నేను బెదిరిస్తాను. ఆ తర్వాత వాళ్ళు నన్ను కొడతారు. స్టూడెంట్స్ ని బెదిరించే సమయంలో డైలాగులు నా సొంతంగా చెప్పా. 

నాకు స్క్రిప్ట్ రైటింగ్ కూడా వచ్చు. నల్లబాలు నల్ల త్రాచు లెక్క నాకి చంపేస్తా అని స్టూడెంట్స్ తో డైలాగ్ చెప్పా. రాజమౌళి గారికి బాగా నచ్చింది. అయితే అదేంటి వేణు నాకైతే చచ్చిపోతారా అని డౌట్ గా అడిగారు. అవును అన్నా మనం అంత పవర్ ఫుల్ అని చెప్పా. ఒకే సన్నివేశం అయిపోయింది నేను వెళ్ళిపోయా. 

ఆ సన్నివేశాన్ని ఎడిటింగ్ చేస్తున్న సమయంలో పక్కనున్న వాళ్ళు రాజమౌళికి చెప్పారట. వేణు మాధవ్ చాలా బాగా డైలాగ్ చెప్పాడు. అతడి సీన్లు ఇంకా పెంచితే బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పారట. దీనితో రాజమౌళి నాకు ఫోన్ చేసి.. వేణు నాకు ఇలాంటి సీన్లు ఇంకా మూడు కావాలి.. ఏం చేద్దాం అని అడిగారు. నేను వస్తున్నా అన్నా అని చెప్పా. 

ఆ ఒక్క సీన్ కాబట్టి సినిమా గురించి నాకు పెద్దగా తెలియదు. ఇంకా ఎక్కువ సీన్లు కావాలంటున్నారు కాబట్టి కాస్త స్టోరీ నటీనటుల గురించి తెలుసుకున్నా. అప్పుడు రాజమౌళి గారు విలన్ గురించి, ఎసిపి క్యారెక్టర్ గురించి చెప్పారు. ఆల్రెడీ స్టూడెంట్స్ తో దెబ్బలు తిన్న క్యారెక్టర్ నాది. కాబట్టి ఇక స్టూడెంట్స్ జోలికి పోకూడదు. ఆ విధంగా కొన్ని సీన్లు నేనే రాసి ఇచ్చా. 

ఆ విధంగా సై చిత్రంలో తన పాత్ర బాగా వర్కౌట్ అయినట్లు వేణు మాధవ్ తెలిపారు. అదే విధంగా సింహాద్రి చిత్రంలో కూడా వేణు మాధవ్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. కాళ్ళు లేని వ్యక్తిగా అందరిని నమ్మిస్తూ ఉండే పాత్రలో వేణు మాధవ్ నటించారు. 

Latest Videos

click me!