
సినీ పరిశ్రమలో హీరోగా పవన్ ప్రయాణం గమనిస్తే...కెరీర్ లో హై సక్సెస్ రేటు ఆయనకు ఉంది. అయితే ఏ స్దాయి సూపర్ హిట్స్ ఇచ్చారో అదే స్దాయిలో ప్లాఫ్ లు వచ్చాయి. తోటి హీరోల తరహాలో ఆయనకు వరుస విజయాలు పది పదిహేనేళ్ల కాలంలో రాలేదు. అయితేనేం ఆయన సినిమాలకు ఓపినింగ్స్ కు కొదవలేదు. బిజినెస్ కాకపోవటం అనే ప్రసక్తే లేదు. అయితే ఆ వివరాలు పవన్ దాకా వెళ్లలేదా అనే సందేహం కలుగుతోంది. రీసెంట్ గా జనసేన పార్టీ ఘన విజయం సాధించిన వెంటనే మంగళగిరి ఆఫీస్ లో అభిమానులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాటల్లో ఆ విషయం వ్యక్తం చేసారు పవన్.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...నా జీవితంలో ఇప్పటిదాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడో ఒకే ఒక్కసారి తొలి ప్రేమ అనే విజయం చూసాను. ఆ తర్వాత ఎవ్వరూ నేను విజయం సాధించినట్లు గానీ డబ్బులు వచ్చినట్లు గానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలా నాకు. నా జీవితాంతం ఎప్పుడూ కూడా దెబ్బలు తింటాను. మాటలు పడతాను. తిట్టించుకుంటాను. నేను ఎంత ఎదిగానో నాకే తెలియదు ఈ రోజు మీ గుండెల్లో ఇంతలా ఉన్నానని, ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వచ్చేదాకా అన్నారు. కానీ తొలి ప్రేమ సినిమా తర్వాత చాలా సినిమాలు సూపర్ హిట్స్ ఇచ్చారు పవన్. వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
తమ్ముడు
తొలి ప్రేమ ఘన విజయం తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చిన సినిమా తమ్ముడు (1999). స్పోర్ట్స్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా పేర్కొనబడిన తమ్ముడు చిత్రానికి PA అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్, ప్రీతి ఝాంగియాని, అదితి గోవిత్రికర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రమణ గోగుల స్వరపరిచిన పాటలు ఆ కాలంలో ట్రెండ్ సెట్టర్. 13 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలైన కొన్ని వారాల్లోనే బ్రేక్ ఈవెన్ స్థాయిని సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ చిత్రం తమిళం, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ చేయబడింది.
బద్రి(2000)
డైరక్టర్ పూరి జగన్నాథ్ తొలి చిత్రం ఇది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బద్రి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. రమణ గోగుల సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని హిందీలో షార్ట్: ది ఛాలెంజ్ పేరుతో రీమేక్ చేశారు
పవన్ కెరీర్ లో 'ఖుషి' ఇండస్ట్రీ హిట్. అంతకు ముందు 'తొలిప్రేమ', 'బద్రి' వంటి సినిమాలు కొన్ని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కోట్లలో లాభాలు తెచ్చాయనేది నిజం. అయితే... 'ఖుషి' తర్వాత కొన్నేళ్ల పాటు ఆయనకు నిలకడగా విజయాలు రాలేదు. కానీ, ఆ సమయంలో వచ్చిన వరుస ఫ్లాపులతో పవన్ ఇమేజ్ ని తగ్గించలేకపోయాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అదే వేరే హీరోకు ఆ స్దాయి ప్లాఫ్ లు వస్తే అసలు ఈ పాటికి కనుమరుగు అయ్యిపోదురు.
జల్సా(2008)
రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందించిన బడిన జల్సా చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
గబ్బర్ సింగ్ 2012
హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన యాక్షన్ కామెడీ చిత్రం గబ్బర్ సింగ్‌లో పవన్ కళ్యాణ్ మరియు శృతి హాసన్ నటించగా, అభిమన్యు సింగ్, అజయ్, సుహాసిని మణిరత్నం, నాగినీడు మరియు కోట శ్రీనివాసరావు సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సల్మాన్ ఖాన్ యొక్క 2010 చిత్రం దబాంగ్ యొక్క అధికారిక రీమేక్ మరియు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌కు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి
అత్తారింటికి దారేది 2013
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన మరియు దర్శకత్వం వహించిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చిత్రంగా ప్రచారం చేయబడిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సమంత మరియు ప్రణిత సుభాష్ ప్రధాన పాత్రలలో నటించారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఆ కాలంలో అత్యధిక వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది
గోపాల గోపాల 2015
సెటైరికల్ కామెడీగా పేర్కొనబడిన ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహించారు మరియు సురేష్ ప్రొడక్షన్స్ మరియు నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డి. సురేష్ బాబు మరియు శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రియా శరణ్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2012లో విడుదలైన హిందీ చిత్రం OMG – ఓ మై గాడ్‌కి రీమేక్. ఇది గుజరాతీ రంగస్థల నాటకం కంజీ విరుద్ధ్ కంజి మరియు 2001 చిత్రం ది మ్యాన్ హూ స్యూడ్ గాడ్ ఆధారంగా రూపొందించబడింది. భారీ అంచనాల నడుమ విడుదలైన గోపాల గోపాల బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గ్రాసర్‌గా నిలిచింది.
వకీల్ సాబ్ 2021
హిందీలో హిట్ అయిన పింక్‌కి అధికారిక రీమేక్. 2019 ఎన్నికలకు దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు వకీల్ సాబ్ కూడా కమ్ బ్యాక్ సినిమానే. ఏప్రిల్ 9, 2021న విడుదలైన ఈ చిత్రం విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అనేక సమస్యలను ఎదుర్కొంది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రెండు వారాలు మాత్రమే రన్ చేయలేకపోయినప్పటికీ, వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్ల షేర్ వసూలు చేసి హిట్‌గా నిలిచింది.
భీమ్లానాయక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన సినిమా 'భీమ్లానాయక్'. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మాస్ పెర్ఫార్మన్స్ తో ఇరగదీశారు. ఆయనకు జోడీగా నిత్యామీనన్ నటించింది. హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది.
పవన్ కళ్యాణ్ కు వచ్చిన ప్రతి ఫ్లాప్ పవన్ మార్కెట్ పెరిగిందనే చెప్పాలి. విచిత్రంగా ప్రతి సినిమాకూ ఆయన ఫాలోయింగ్ బాగా పెరుగుతూ వచ్చింది. హిట్ కు, మార్కెట్ లెక్కలకు, ఇండస్ట్రీ సూత్రాలకు అతీతంగా పవన్ ఇమేజ్ పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తూంటుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు తక్కువే అయినా, ఆయనకు ఎనలేని క్రేజ్ ఏర్పడింది. నిజానికి ఆయన చేసిన సినిమాలు దాదాపు అన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. అలాంటి ట్రెండ్ సెట్ చేసిన ఆయన సినిమాలలో ఖుషీ సినిమా ఒకటి. ఈ సినిమా ద్వారా పవన్ కల్యాణ్‌కు యూత్‌లో క్రేజ్ ఏర్పడింది. పవన్ సినీ కెరీర్ లో ఖుషీ ఒక స్పెషల్ మూవీగా నిలిచింది.
ఇక ఇవన్నీ ప్రక్కన పెడితే...పవన్ కు రాజకీయాల్లో గత పది పదిహేనేళ్లలో చెప్పుకోదగ్గ విజయాలు రాలేదు. కానీ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన చుట్టూ రాజకీయాలు తిరిగాయని చెప్పడంలో అసలు ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎన్నికలకు ముందు నుంచి ప్రచారంలో పవన్ కళ్యాణ్ నోటి నుంచి వినిపించిన మాట ఒక్కటే... వైసీపీ ప్రభుత్వాన్ని పడగొడతానని, క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానని! ఆయన అన్నంత పని చేశారు.
'హలో ఏపీ... బైబై వైసీపీ' అనేది నిజం చేసి చూపించారు. పవర్ స్టార్... ఆయనకు సినీ ప్రేక్షకులు ఇచ్చిన బిరుదు. జనసేనాని... జనసేన పార్టీ శ్రేణులు, ప్రజలు ఇచ్చిన పేరు. కానీ, పిఠాపురం ప్రజలు మాత్రం ఆయన్ను ఎమ్మెల్యే (Pawan Kalyan Wins Pithapuram) చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఏం చేస్తారో అని యావత్ తెలుగు ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.