త్రివిక్రమ్ గారు గతంలో ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఆ మూవీలో నన్ను, వెంకటేష్ సార్ ని హీరోలుగా అనుకున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ గారి నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఆయన నుంచి అప్డేట్ వస్తే వెంకీ సార్, నేను కలసి నటిస్తాం. అంతా త్రివిక్రమ్ చేతుల్లో ఉంది అని నాని అన్నారు. ఒక వేళ నాని, వెంకీ కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం వస్తే అదే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకంటే నాని, వెంకీ ఇద్దరికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.