`కేసరి చాప్టర్ 2` vs జాట్` బాక్సాఫీస్ కలెక్షన్స్
`కేసరి చాప్టర్ 2' 6వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్: అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ నటించిన ఈ చిత్రం 6 రోజుల్లో ₹42 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో సన్నీ దియోల్ 'జాట్` బుధవారం, ఏప్రిల్ 23న 14వ రోజుకి ₹79.22 కోట్లు వసూలు చేసింది.
కెసరి చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన
అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే నటించిన `కేసరి 2` చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. డీసెంట్ ఓపెనింగ్స్ తో రన్ అవుతుంది. స్టడీగా కలెక్షన్లు ఉండటం విశేషం.
`కేసరి చాప్టర్ 2 థియేటర్లలో బాగా ఆడుతోంది
కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన 'కెసరి చాప్టర్ 2' థియేటర్లలో బాగా ఆడుతోంది. ప్రారంభంలోనే మంచి కలెక్షన్లని సాధించింది. అయితే సోమవారం నుంచి రిజల్ట్ ఎలా ఉంటుందో అనే అనుమానం ఉండేది. కానీ పెద్దగా తగ్గలేదు. హిట్ మూవీ రేంజ్‌లోనే వసూళ్లు వస్తున్నాయి.
`కేసరి చాప్టర్ 2కి మంచి స్పందన
కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించిన 'కేసరి చాప్టర్ 2'కి విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా వచ్చే వారం వరకు థియేటర్లలో ఉండే అవకాశం ఉంది. సినిమాలోని డైలాగులకు ప్రేక్షకులు ఈలలు వేశారు.
కెసరి చాప్టర్ 2 ₹40 కోట్లు దాటింది
sacnilk.com నివేదిక ప్రకారం, 'కెసరి చాప్టర్ 2' 6 రోజుల్లో ₹40 కోట్ల మార్కును దాటింది. 6వ రోజు ₹3.2 కోట్లు వసూలు చేసి, మొత్తం వసూళ్లు ₹42.2 కోట్లకు చేరుకున్నాయి.
కెసరి చాప్టర్ 2 తొలి రోజు వసూళ్లు
ఏప్రిల్ 18న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు ₹7.75 కోట్లు వసూలు చేసింది. ఏప్రిల్ 19న ₹9.75 కోట్లు, ఏప్రిల్ 20న అత్యధికంగా ₹12 కోట్లు వసూలు చేసింది.
కెసరి చాప్టర్ 2 రోజువారీ వసూళ్లు
ఏప్రిల్ 21న 'కెసరి చాప్టర్ 2' ₹4.5 కోట్లు, ఏప్రిల్ 22న ₹5 కోట్లు, ఏప్రిల్ 23న ప్రాథమిక అంచనాల ప్రకారం ₹3.20 కోట్లు వసూలు చేసింది.