భగత్ సింగ్ బయోపిక్స్
2002లో విడుదలైన ఈ సినిమాలన్నీ అమరవీరుడు భగత్ సింగ్ బయోపిక్‌లే. 23 ఏళ్ల చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ తో పాటు సుఖ్‌దేవ్, రాజ్‌గురు కూడా ఉన్నారు. 23 మార్చి 1931న భగత్ సింగ్ తో పాటు ఉరికంబాలెక్కిన వీరులు వీళ్ళు. ఆ ఏడు సినిమాలు ఇవే...
ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్
1. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్
7 జూన్ 2002న విడుదలైన ఈ సినిమాకి రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించారు. అజయ్ దేవగన్ భగత్ సింగ్ గా, సుశాంత్ సింగ్ సుఖ్‌దేవ్ గా, డి. సంతోష్ శివరాం రాజ్‌గురుగా, అఖిలేంద్ర మిశ్రా చంద్రశేఖర్ ఆజాద్ గా నటించారు. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కేవలం 7.44 కోట్లు వసూలు చేసి డిజాస్టర్ అయ్యింది.
23 మార్చి 1931 షహీద్
2. 23 మార్చి 1931 షహీద్
గుడ్డు ధనోవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా 7 జూన్ 2002న విడుదలైంది. బాబీ డియోల్ భగత్ సింగ్ గా, రాహుల్ దేవ్ సుఖ్‌దేవ్ గా, విక్కీ ఆహుజా రాజ్‌గురుగా, సన్నీ డియోల్ చంద్రశేఖర్ ఆజాద్ గా నటించారు. 20 కోట్లతో నిర్మించిన ఈ సినిమా కేవలం 7.60 కోట్లు వసూలు చేసి డిజాస్టర్ అయ్యింది.
షహీద్-ఎ-ఆజమ్
3. షహీద్-ఎ-ఆజమ్
31 మే 2002న విడుదలైన ఈ సినిమాకి సుకుమార్ నాయర్ దర్శకత్వం వహించారు. సోనూ సూద్ భగత్ సింగ్ గా, మానవ్ విజ్ సుఖ్‌దేవ్ గా, దేవ్ గిల్ రాజ్‌గురుగా, రాజ్ జుత్షి చంద్రశేఖర్ ఆజాద్ గా నటించారు. 1.75 కోట్లతో నిర్మించి, కేవలం 22.50 లక్షలు వసూలు చేసి డిజాస్టర్ అయ్యింది.
భగత్ సింగ్ (దూరదర్శన్)
4. భగత్ సింగ్
రామానంద్ సాగర్ నిర్మాతగా, ఆనంద్ సాగర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2002లో దూరదర్శన్ లో విడుదలైంది. దీపక్ విర్క్, కుమార్ హెగ్డే, ముకుల్ నాగ్, వినోద్ పాండే ప్రధాన పాత్రలు పోషించారు.
షహీద్ భగత్ సింగ్ (తరుణ్ వాధ్వా)
5. షహీద్ భగత్ సింగ్
దర్శకుడు తరుణ్ వాధ్వా ప్రకటించిన ఈ సినిమాలో తరుణ్ ఖన్నా, సామ్రాట్ ముఖర్జీ, సమీప్ కాంగ్, గౌరవ్ ఘై నటించారు. 2002లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది.
భగత్ సింగ్: ది షహీద్
6. భగత్ సింగ్: ది షహీద్
2002లో విడుదల కావాల్సిన ఈ సినిమాతో మనోజ్ కుమార్ కొడుకు విశాల్ గోస్వామి హీరోగా పరిచయం కావాల్సి ఉండగా, కేవల్ కశ్యప్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ భగత్ సింగ్ పై వస్తున్న సినిమాల హడావిడి చూసి కేవల్ వెనక్కి తగ్గారు. సినిమా ఆగిపోయింది.
కేదార్ కశ్మీరీ సినిమా
7. కేదార్ కశ్మీరీ సినిమా
2002లో కేదార్ కశ్మీరీ కూడా భగత్ సింగ్ జీవితంపై సినిమా తీయాలనుకున్నారు. ఆమీర్ ఖాన్ తమ్ముడు ఫైసల్ ఖాన్ ని భగత్ సింగ్ గా, ముకేష్ ఖన్నాను చంద్రశేఖర్ ఆజాద్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ ప్రకటన తర్వాత సినిమా ముందుకు సాగలేదు.