ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇన్వాల్వ్మెంట్ పై హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 19న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబోలో తెరకెక్కుతున్న రెండవ చిత్రం ఇది. మార్చి 19న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ చిత్రం. దీనితో అప్పుడే అభిమానుల్లో హంగామా మొదలైంది.
25
డైరెక్టర్ హరీష్ శంకర్ వన్ మ్యాన్ ఆర్మీలా ప్రమోషన్స్
ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక్కరే వన్ మ్యాన్ ఆర్మీలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ హరీష్ శంకర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
35
త్రివిక్రమ్ ఫైనల్ చేస్తేనే ?
దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కూడా త్రివిక్రమ్ వేలు పెట్టారు అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ గారు కథ విని ఫైనల్ చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ సినిమా ముందుకు వెలుతుంది అని అంటున్నారు. ఇందులో నిజం ఎంత అని హరీష్ శంకర్ ని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ ఉన్నప్పుడే నేను ఉస్తాద్ భగత్ సింగ్ ఫైనల్ నెరేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఓజీ షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారు. త్రివిక్రమ్ గారు కూడా అక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు షాట్ కంప్లీట్ చేసుకుని వచ్చి హరీష్ స్టార్ట్ చేద్దామా అని అన్నారు.
55
త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది.
వెంటనే త్రివిక్రమ్ గారు స్వామి సెలవు, మీరు కానివ్వండి అని అన్నారు. మీరు ఎక్కడికి వెళతారు సార్.. మీరు కూడా ఉండండి అని అడిగా. లేదు హరీష్.. మీరు కానివ్వండి అని చెప్పి ఆయన వెళ్లిపోయారు. కథ కూడా వినలేదు. అయినప్పటికీ త్రివిక్రమ్ గారి సాయం ఈ సినిమాకు ఉంది. ఒక దశలో పవన్ కళ్యాణ్ గారు హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ మూడు సినిమాల కోసం ఒకేసారి షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చేది. ఆ టైంలో త్రివిక్రమ్ గారు నిర్మాతలు, పవన్ కళ్యాణ్ మధ్య సమన్వయం కుదిర్చి షూటింగ్స్ సవ్యంగా సాగేలా చేశారు అని హరీష్ తెలిపారు.