Pawan Kalyan: తమిళ దర్శకుడితో పవన్‌ కళ్యాణ్‌ మూవీ.. క్రేజీ కాంబో సెట్‌ చేస్తోన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ

Published : Mar 17, 2026, 04:18 PM IST

పవన్‌ కళ్యాణ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`తో అలరించనున్నారు. నెక్ట్స్ సురేందర్‌ రెడ్డితో సినిమా చేయాల్సింది. అంతేకాదు ఇప్పుడు మరో సినిమాకి కమిట్‌ అయ్యారట. తమిళ దర్శకుడితో మూవీ చేయబోతున్నారట. 

PREV
14
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ తో రాబోతున్న పవన్‌ కళ్యాణ్‌

పవన్‌ కళ్యాణ్ ఇప్పుడు `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రంతో రాబోతున్నారు. హరీష్‌ శంకర్‌ రూపొందించిన ఈ చిత్రం ఈ ఉగాదికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో పవన్‌ నెక్ట్స్ సినిమాల గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. రామ్‌ తళ్లూరి దీనికి నిర్మాత. ఈ మూవీకి ఇంకా ప్రారంభం కాలేదు. ఈక్రమంలో మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

24
మోహన్‌ రాజాతో పవన్‌ మూవీ?

తమిళ దర్శకుడితో పవన్‌ కళ్యాణ్‌ సినిమా చేయబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. చిరంజీవితో `గాడ్‌ ఫాదర్‌` మూవీ చేసిన మోహన్‌ రాజాతో పవన్‌ మూవీ చేయబోతున్నారని అంటున్నారు. ఇటీవలే మోహన్‌ రాజా.. పవన్‌ కళ్యాణ్‌ ని కలిశారని, స్క్రిప్ట్ నెరేట్‌ చేయగా, ఆయన ఆసక్తి చూపించారని టాక్‌. ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉందని అంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్ చేస్తుందట.

34
టీజీ విశ్వప్రసాద్‌ క్రేజీ ప్లాన్‌

ఆ మధ్య `ది రాజా సాబ్‌` మూవీ ఫ్లాప్‌ తర్వాత.. నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ని కలిశారు. తాము కలిసి పనిచేయబోతున్నట్టు తెలిపారు. పవన్‌ నిర్మాణ సంస్థ పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్ కూడా ట్వీట్‌ చేసింది. దీంతో నిర్మాణంలో వీరిద్దరు భాగస్వామ్యంతో సినిమాలు చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో మోహన్‌ రాజా దర్శకత్వంలో పవన్‌ సినిమా చేయబోతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. వైరల్‌గా మారింది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. `ది రాజాసాబ్‌`తో వచ్చిన నష్టాలను పవన్‌ మూవీతో భర్తీ చేసుకోవాలని నిర్మాత భావిస్తున్నట్టు టాక్‌. 

44
సురేందర్‌ రెడ్డి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?

ఇక `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` తర్వాత పవన్‌.. సురేందర్‌ రెడ్డితో సినిమా చేస్తారు. అయితే ఇది ఇంకా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్‌ కాలేదు. ఫైనల్‌ స్క్రిప్ట్ కూడా ఇంకా నెరేట్‌ చేయలేదు. ఇంకా ఆ వర్క్ జరుగుతుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. రాజకీయ కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఎప్పుడు టైమ్‌ ఇస్తారు? ఎప్పుడు మూవీని పూర్తి చేస్తారనేది పెద్ద సస్పెన్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్‌తో సినిమా అంటే షూటింగ్‌ స్టార్ట్అయ్యేంత వరకు క్లారిటీ లేదనే చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories