మాటల మాంత్రికుడి అరుదైన విషయాలు.. త్రివిక్రమ్‌ బర్త్ డే స్పెషల్‌

First Published Nov 7, 2020, 9:57 AM IST

త్రివిక్రమ్‌.. మాటల మాంత్రికుడిగా టాలీవుడ్‌లో పాపులర్‌ అయ్యాడు. దర్శకుడిగా అంతకంటే బాగా పాపులర్‌ అయ్యాడు. అగ్ర దర్శకుల జాబితాలో స్థానం సంపాదించాడు. ముఖ్యంగా ఆయన సినిమాలోని డైలాగులు విశేష ఆదరణ పొందాయి. సింపుల్‌ డైలాగులను కూడా గొప్పగా చెప్పి వాహ్‌ అనిపించుకున్న మాటల మాంత్రికుడు తివిక్రమ్‌ పుట్టిన రోజు నేడు(శనివారం). ఆయనపై ఓ లుక్కేద్దాం. 

సాధారణ మనిషి జీవితాన్ని వెండితెరపై గ్రాండ్‌గా ఆవిష్కరించే త్రివిక్రమ్‌ రైటర్‌గా రచయితలకు ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొచ్చారనే చెప్పాలి. దర్శకుడిగా కంటే మాటలనుఅద్భుతంగా రాయడంపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెడతారు. మాటలతోనే యుద్ధం చేస్తారు. వాటి కొమ్ము విరిచి సాధారణ ప్రేక్షకుడికి సైతం అర్థమయ్యేలా చేస్తాడు.ఆహ్లాదాన్నిస్తాడు.
undefined
త్రివిక్రమ్‌, పవన్‌ మంచి స్నేహితులు. వీరిద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. బాగా పుస్తకాలు చదువుతారు. పవన్‌ ఏం చేయాలన్నా త్రివిక్రమ్‌ సలహాలుతీసుకుంటారని టాక్‌.
undefined
నిజ జీవితంలో సంఘటనలోనుంచి, వాస్తవ జీవితాన్నుంచే మాటలను ఒడిసి పట్టి వాటిని వెండితెరపై పలికిస్తాడు. అందమైన విజువల్స్‌తో, ఆలోచింపజేసే మాటలతో,ఆకట్టుకునే అనుబంధాలతో సినిమా రూపంలో సిల్వర్‌ స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడంలో ఆయనకు ఆయనే సాటి.
undefined
`స్వయంవరం`, `సముద్రం`, `నువ్వేకావాలి`, `చిరునవ్వుతో`, `నిన్నే ప్రేమిస్తా`, `నువ్వు నాకు నచ్చావ్‌`, `వాసు`, `నువ్వే నువ్వే`, `మన్మథుడు`, `మళ్లీశ్వరీ`, `జై చిరంజీవ`,`తీన్‌ మార్‌`, `ఛల్‌ మోహన్‌రంగ` వంటి చిత్రాలతో రచయితగా, డైలాగ్‌ రైటర్‌గా తనలోని రచనా కోణాన్ని ఆవిష్కరించారు.
undefined
ఇక దర్శకుడిగా `నువ్వే నువ్వే` చిత్రంతో దర్శకుడిగా మారి, `అతడు`తో డైరెక్షన్‌గా తానేంటో నిరూపించుకున్నారు. ఈ సినిమా టెలివిజన్‌లో అత్యధిక సార్లు టెలికాస్ట్ అయినచిత్రంగా, ఈ క్రమంలో అత్యధిక టీఆర్‌పీ సాధించిన చిత్రంగానూ నిలిచింది.
undefined
వీటితోపాటు `జల్సా`, `జులాయ్‌`, `ఖలేజా`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `అఆ`, `అజ్ఞాతవాసి`, `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` వంటి చిత్రాలతో దర్శకుడిగా తనేంటోనిరూపించుకున్నారు. ఇందులో `ఖలేజా`, `అజ్ఞాతవాసి` పరాజయాలు చెందగా, `అత్తారింటికి దారేదీ`, `అలా వైకుంఠపురములో` చిత్రాలు రికార్డ్‌ కలెక్షన్లని వసూలు చేయడంవిశేషం.
undefined
మాటల మాంత్రికుడు అని అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులు ముద్దుగా పిలుచుకునే త్రివిక్రమ్‌కు జయాపజయాలకు అతీతంగా అశేష ప్రేక్షకలోకాన్ని మరింతగామెప్పించేందుకు తపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో మరోసారి సినిమా చేయబోతున్నారు. మరోవైపు ఆయన ఫేమస్‌ డైలాగులను ఓ సారి చూస్తే, ..
undefined
ప్రేమంటే తేలికగా మర్చిపోయే సంఘటన కాదు.. బ్రతికినంత కాలమ్‌ గుర్తుండిపోవాల్సిన జ్ఞాపకం. గొంతులో వున్న మాట అయితే నోటితో చెప్పొచ్చు.. కానీ గుండెల్లో ఉన్నమాట కళ్లతోనే చెప్పగలము.
undefined
మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు.. ఓడిపోయినప్పుడు భుజమ్‌ తట్టేవాళ్ళు.. నలుగురు లేనప్పుడు.. యెంత సంపాదించినా..ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు.
undefined
కన్న తల్లిని, గుడిలో దేవున్నీ మనమే వెళ్లి చూడాలి. వాళ్లే మన దగ్గరకు రావాలనుకోవడం మూర్ఖత్వం.
undefined
అబద్దం చెప్పడం ఎంత తేలికో.. నిజం దాచడం అంతే కష్టం. మనల్ని చంపాలనుకున్నా వాడిని చంపడం యుద్ధం. మనల్ని కావాలనుకునే వాళ్లని చంపడం నేరం.. మనల్నిమోసం చేయాలనుకునే వాళ్లని చంపడం న్యాయం. యుద్ధంలో గెలవడం అంటే శత్రువులను చంపడం కాదు.. శత్రువుని ఓడించడం.. ఓడించడమే యుద్ధం లక్ష్యం.. చంపడంకాదు.
undefined
అందంగా లేదని అమ్మని, కోపంగా వున్నాడని నాన్నని వదిలేయలేం కదా!. కారణం లేని కోపం.. గౌరవం లేని ప్రేమ.. బాధ్యత లేని యవ్వనం.. జ్ఞాపకాలు లేని వృధ్యాప్యంఅనవసరం.
undefined
ఆశ క్యాన్సర్‌ ఉన్నోడిని కూడా బతికిస్తుంది. భయం అల్సర్‌ ఉన్నోడిని కూడా చంపేస్తుంది. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది. విడిపోయేటప్పుడే బంధం విలువతెలుస్తుంది.
undefined
రెండు దశాబ్దాల కెరీర్‌లో దర్శకుడిగా త్రివిక్రమ్‌ 11 సినిమాలు చేశారు. మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, నితిన్‌, తరుణ్‌లతో సినిమాలు చేశారు. ఇందులోపవన్‌తో మూడు సినిమాలు, బన్నీతో మూడు సినిమాలున్నాయి. త్రివిక్రమ్‌ ఎక్కువగా టీషర్ట్ లోనే కనిపిస్తారు. అది కూడా బ్లూ, బ్లాక్‌ టీషర్ట్ లే కావడం విశేషం.
undefined
click me!