హారిక మీదపడి మరీ రంగు పూసిన అమ్మా.. ఇంటిపని రచ్చ రచ్చగా మారిందిగా!

First Published Nov 6, 2020, 10:38 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 61వ రోజు కెప్టెన్సీ టాస్క్ ఆకట్టుకోగా, హౌజ్‌లో పని విభజన పెద్ద వివాదంగా మారింది. అమ్మా రూల్స్  రచ్చ రచ్చగా మారింది. 

మొదట అట్లు తోమే విషయంలో అభిజిత్‌, అరియానా మధ్య వివాదం రాజుకుంది. ఆ తర్వాత అరియానా.. అమ్మ రాజశేఖర్‌పై చేసిన దాన్ని చెప్పుకుంది. నేను ఒక పాయింట్‌మీద మాట్లాడితే, ఆయన మరో పాయింట్‌ తీసుకొస్తున్నాడని అరియానా వాపోయింది.
undefined
కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. కెప్టెన్సీ కోసం హారిక, అమ్మా రాజశేఖర్‌, అరియానా పోటీపడుతున్నారు. వీరు `రింగులో రంగు` టాస్క్ ఇచ్చారు. ఇందులో పోటీలో ఉన్నముగ్గురు రింగ్‌లో ఉంటారు. వీరు కళ్లకు గంతలు కట్టుకుని రంగుని చేతులకు పూసుకుని తోటి పోటీదారుల టీషర్ట్ వెనకాల రంగు పూయాల్సి ఉంది. టాస్క్ పూర్తయ్యేంతవరకు ఎవరి టీషర్ట్ పై రంగు తక్కువగా ఉంటుందో వారు విన్నర్.
undefined
ఈ టాస్క్ లో హారికపై మరోసారి పడి రంగు పూసాడు అమ్మా రాజశేఖర్‌. అయినప్పటికీ ఈ టాస్క్ లో అమ్మా రాజశేఖర్‌ టీషర్ట్ పై రంగు తక్కువ ఉండటంతో కెప్టెన్‌గాఎంపికయ్యారు. అవినాష్‌ని రేషన్‌ మేనేజర్‌గా ఎంపిక చేశాడు.
undefined
ఆ తర్వాత జీఆర్‌బీ నెయ్యి వంటలు చేసే టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యులు ఇద్దరి షెఫ్‌లను ఎంపిక చేసుకుని క్యారెట్‌ అల్వా చేయాల్సి ఉంది. ఇందులో లాస్య, మోనాల్‌ షెఫ్‌లుగాస్వీట్‌ చేసి అదరగొట్టారు. ఇద్దరు స్వీట్‌లు టేస్ట్ లుగా ఉన్నాయన్నారు.
undefined
ఇక కెప్టెన్‌.. ఇంటి సభ్యులకు పనులు అప్పగించగా.. ఇది సభ్యుల మధ్య పెద్ద వివాదానికి దారి తీసింది. పనులు సరిగ్గా కేటాయించలేదని సభ్యులు కెప్టెన్‌ అమ్మాపైతిరుగుబాటుకి దిగారు. హారిక స్వీపింగ్‌ చేయనని చెప్పింది. అలాగే అభిజిత్‌ సైతం అట్టు తోమే పనిని చేయమని, సోహైల్‌ సైతం తమ పని విషయంలో అభ్యంతరం వ్యక్తంచేశారు.
undefined
ఇంటి పని విషయంలో జరిగే వివాదంలో సోహైల్‌ పై మండిపడ్డాడు మెహబూబ్. ఈ క్రమంలో నువ్వు వద్దు.. నీ ఫ్రెండ్ షిప్‌ వద్దు అని అన్నాడు. దీంతో సోహైల్‌ ఫైర్‌ అయ్యాడు. ఏమన్నావ్‌.. అంటూ తన చేతిలో ఉన్న డ్రై ఫ్రూట్స్ ని నేలకేసి కొట్టి బయటకు వెళ్ళిపోయాడు.
undefined
దీన్ని సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు కెప్టెన్‌ అమ్మా రాజశేఖర్‌. మెహబూబ్‌ని అలా అనకుండా ఉండాల్సింది అని చెప్పాడు. ఈసందర్భంగా గత టాస్క్ విషయాన్ని తీసుకొచ్చాడు మెహబూబ్‌. టాస్క్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్‌షిప్‌ని ఎలా చూస్తామన్నాడు. ఇకపై తన గేమ్‌ తాను అడుతానని చెప్పాడు.
undefined
అయితే ఎన్నడూ లేనివిధంగా ఇంటి పనుల విషయంలో వివాదం రావడం ఇదే తొలిసారి. పరోక్షంగా అమ్మా కెప్టెన్సీపై ఆరోపణలు చేసింది లాస్య.
undefined
అమ్మా కెప్టెన్‌ అయ్యాక.. రూల్స్ చెప్పాడు. మైక్‌ పెట్టుకోకపోతే, ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఫనిష్‌మెంట్‌ గురించి చెప్పాడు. అయితే అభిజిత్‌ ఇంగ్లీష్‌లో మాట్లాడటంపై బిగ్‌బాస్‌ హెచ్చరించాడు. దీంతో అమ్మా రాజశేఖర్‌ ఎగిరి గంతేశాడు. తనదైన స్టయిల్‌లో ఎక్స్ ప్రెషన్స్ తోపాటు యాక్టింగ్‌ చేసి ఆశ్చర్యపరిచాడు.
undefined
అయితే మెహబూబ్‌ విషయంలో సోహైల్‌ చేసింది హైలైట్‌ అయ్యింది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో అని అభిజిత్‌, అఖిల్‌ చర్చించుకున్నారు. మరోవైపు చివరికి గుడ్ల కోసం అందరు ఎగబడటం ఆసక్తిగా మారింది.
undefined
click me!