బంగారం లాంటి ఎన్టీఆర్ ని బీరువాలో దాచిపెట్టకూడదు.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ పంచ్ లు

Published : Aug 10, 2025, 09:18 PM IST

వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఏమన్నారో ఈ కథనంలో చూడండి. 

PREV
15
వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ హీరో హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రం మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్, హృతిక్ రోషన్, దర్శకుడు అయాన్ ముఖర్జీ హాజరయ్యారు. నాగవంశీ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేసే బాధ్యత నాగవంశీ తీసుకున్నారు. 

25
త్రివిక్రమ్ స్పీచ్ 

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అతిథిగా హాజరయ్యారు. త్రివిక్రమ్ మైక్ అందుకుంటే ఆయన ప్రసంగం ప్రవాహంలా సాగుతుంది. పంచ్ డైలాగులు, ప్రాసలు ఉపయోగిస్తూ ఆలోచన రేకెత్తించే విధంగా త్రివిక్రమ్ తన స్పీచ్ తో ప్రభావితం చేయగలరు. వార్ 2 ఈవెంట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. నేనెంతో అభిమానించే వ్యక్తి నందమూరి తారక రామారావు(జూ. ఎన్టీఆర్) గారితో నా ప్రయాణం పాతికేళ్ల నుంచి సాగుతోంది. నేను సినిమాల్లోకి రాకముందు హృతిక్ రోషన్ గారి కహా నా ప్యార్ హై చిత్రాన్ని డజను సార్లు చూశాను అని అన్నారు. 

35
ఇది హృతిక్ రామారావు నామ సంవత్సరం 

నేను గతంలో మ్యాడ్ మూవీ ఫంక్షన్ లో ఇది దేవర నామ సంవత్సరం అని చెప్పాను. ఇప్పుడు దీనిని హృతిక్ రామారావు నామ సంవత్సరంగా ప్రకటిద్దాం అని అన్నారు. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరినీ కలిపి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఒకరేమో హియాలయాలు లాంటి వారు మరొకరు వింధ్య పర్వతాలు లాంటి వారు. 

45
యాక్షన్ మాత్రమే కాదు అంతకు మించి 

ఈ చిత్రంలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు అంతకు మించిన సర్ప్రైజ్ ఉంది. అయాన్ ముఖర్జీ నాకు ఇష్టమైన దర్శకులలో ఒకరు. ఈ చిత్రంలో కేవలం యాక్షన్ మాత్రమే ఉన్నట్లయితే అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ వరకు వచ్చేవారు కాదు. ఎన్టీఆర్ ఎలాంటి ఎమోషన్ అని అయినా పలికించగల నటుడు. 

55
బంగారాన్ని బీరువాలో దాచకూడదు 

అలాంటి నటుడు చేతిలో ఉన్నప్పుడు కేవలం యాక్షన్ మాత్రమే ఎందుకు చేయిస్తారు. బంగారం మన దగ్గర ఉన్నప్పుడు బీరువాలో దాచుకోకూడదు.. నగ చేయించుకుని వాడుకోవాలి అంటూ త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇంత పెద్ద స్టార్లని పెట్టి బ్యాలెన్స్ చేస్తూ మూవీ తీయడం సాధారణ విషయం కాదు. అందుకు డైరెక్టర్ అయాన్ ముఖర్జీకి హ్యాట్సాఫ్ చెప్పాలి అని త్రివిక్రమ్ అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories