అల్లు అర్జున్‌ చేసిన పనికి, ఆ బ్లాక్‌ బస్టర్‌ స్టార్‌ హీరోకి కమిట్‌ అవుతున్న త్రివిక్రమ్‌

Published : Apr 30, 2025, 06:29 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఎవరితో సినిమా చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన బన్నీతోనే సినిమా చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్‌.. అట్లీతో మూవీ ప్రకటించారు. దీంతో త్రివిక్రమ్‌ ఖాళీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 

PREV
15
అల్లు అర్జున్‌ చేసిన పనికి, ఆ బ్లాక్‌ బస్టర్‌ స్టార్‌ హీరోకి కమిట్‌ అవుతున్న త్రివిక్రమ్‌
trivikram, allu arjun

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నుంచి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. గతేడాది సంక్రాంతికి మహేష్‌ బాబుతో `గుంటూరు కారం` సినిమాని రూపొందించారు. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.

ఆ తర్వాత కొత్తగా మరే సినిమా ప్రకటించలేదు. అంతా అల్లు అర్జున్‌తో మూవీ ఉంటుందని భావించారు. కానీ బన్నీ పెద్ద షాకిచ్చాడు. త్రివిక్రమ్‌తో కాకుండా అట్లీతో మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు. 

25
Allu Arjun And Atlee

దీంతో త్రివిక్రమ్‌ ఇప్పుడు ఎవరితో సినిమా చేయబోతున్నారనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అయితే అల్లు అర్జున్‌తో చేయాల్సిన మూవీ ఉంది. దీన్ని మైథలాజికల్‌ గా తెరకెక్కించబోతున్నారట. అందుకు చాలా సమయం పడుతుంది.

భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో దాన్ని రూపొందించనున్నారు. అందుకే కాస్త గ్యాప్‌ తీసుకుని ఫ్రీగా చేయాలనుకుంటున్నారట. అందులో భాగంగానే త్రివిక్రమ్‌, బన్నీ మూవీకి కొంత గ్యాప్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. 

35
allu arjun

ప్రస్తుతం అల్లు అర్జున్‌.. కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీతో సినిమాని ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అనంతరం త్రివిక్రమ్‌తో సినిమా చేయాలనుకుంటున్నారట బన్నీ. మరి అప్పటి వరకు త్రివిక్రమ్‌ ఖాళీగానే ఉంటాడా? మ సినిమా చేస్తాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 

45
trivikram srinivas

త్రివిక్రమ్‌ ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయాలనుకుంటున్నారట. వెంకటేష్‌తో మూవీకి సంబంధించిన ప్లాన్‌ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వెంకటేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రావాల్సి ఉంది. అధికారికంగానూ ప్రకటించారు.

కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్‌ అయ్యింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ని సెట్‌ చేసే పనిలో త్రివిక్రమ్‌ ఉన్నట్టు తెలుస్తుంది. బన్నీ.. అట్లీ మూవీ కంప్లీట్‌ చేసే లోపు తాను వెంకీ మూవీని పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. 

55
trivikram, venkatesh

వెంకటేష్‌ ఈ సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` అనే చిత్రంలో నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే.

ఈ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన తెలుగు మూవీగా నిలిచింది. సుమారు రూ.350కోట్ల కలెక్షన్లని సాధించింది. ఆ తర్వాత వెంకీ మరే మూవీని ప్రకటించలేదు. ఇప్పుడు త్రివిక్రమ్‌తో సినిమా చేసినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories