`హిట్‌ 3` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. నాని సినిమా లాభాల టార్గెట్‌ ఇదే

Published : Apr 30, 2025, 03:35 PM IST

Hit 3 Business: హీరో నాని వరుస విజయాలతో రాణిస్తున్నారు. `హాయ్‌ నాన్న`, `సరిపోదా శనివారం` చిత్రాలతో వరుసగా హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో సక్సెస్‌ కోసం రెడీ అవుతున్నారు. `హిట్‌ 3` సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం రేపు గురువారం(మే 1)న విడుదల కాబోతుంది.   

PREV
15
`హిట్‌ 3` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. నాని సినిమా లాభాల టార్గెట్‌ ఇదే
Nani starrer Hit 3

Hit 3 Business: నేచురల్‌ స్టార్‌ నాని ఇప్పుడు తన ట్యాగ్‌ని మరిపించే ప్రయత్నంలో ఉన్నారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు యాక్షన్ సినిమాలతో మాస్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకునే పనిలో ఉన్నారు. `దసరా` సినిమా నుంచి నాని ట్రెండ్‌ మార్చారు. వరుసగా రా అండ్‌ రస్టిక్‌ మూవీస్‌ చేస్తూ అలరిస్తున్నారు. 

25
Nani starrer Hit 3

తాజాగా `హిట్‌ 3` అంటూ మరో యాక్షన్‌ మూవీతో రాబోతున్నారు. గతంలో ఈ ఫ్రాంఛైజీ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. విశ్వక్‌ సేన్‌, అడవి శేషు నటించారు. ఇప్పుడు మూడో ఫ్రాంఛైజీలో నాని హీరోగా నటించారు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీలో `కేజీఎఫ్‌` ఫేమ్‌ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. మే డే సందర్భంగా మే 1న ఈ మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా హైప్ ఎలా ఉందనేది చూస్తే. 

35
Nani starrer Hit 3 film update out

`హిట్‌ 3` మూవీపై ప్రారంభం నుంచి ఆసక్తి ఏర్పడింది. రక్తపాతానికి ప్రయారిటీ ఇవ్వడంతో సినిమాలో ఏదో ఉండబోతుందని, పైగా నాని నుంచి ఇలాంటి హింసని ఎవరూ ఊహించరు, దీంతో అది కూడా కొత్తగా ఉంది. పైగా విడుదలైన టీజర్‌, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. దీంతో సినిమా బిజినెస్‌ కూడా బాగానే జరిగింది.

45
hit 3, nani

నాని సినిమాల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ సినిమా సినిమాకి పెంచుకుంటూ వస్తున్నారు. ఈ చిత్రానికి సుమారు యాభై కోట్ల రేంజ్‌లో వ్యాపారం జరగడం విశేషం. నైజాంలో 13కోట్లు, సీడెడ్‌లో 5.40కోట్లు, ఆంధ్రాలో 15కోట్ల వ్యాపారం జరిగింది. తెలుగు స్టేట్స్ లో 33.40కోట్లు, కర్నాటక, తమిళనాడు, నార్త్ ఇలా ఇండియా మొత్తంలో 5.50కోట్ల బిజినెస్‌ అయ్యింది. ఓవర్సీస్‌లో పది కోట్ల వ్యాపారం జరిగింది.

ఇలా మొత్తంగా `హిట్‌ 3` ప్రపంచ వ్యాప్తంగా 48.90కోట్ల బిజినెస్‌ అయ్యింది. సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే సుమారు 50కోట్ల షేర్‌ సాధించాలి. అంటే వంద కోట్ల కలెక్షన్లు రావాలి. నాని మార్కెట్‌ దృష్ట్యా సినిమా బాగుంటే వంద కోట్లు పెద్ద లెక్కేమీ కాదు. మరి ఏ మేరకు రీచ్‌ అవుతుందో చూడాలి. 

55
Nani starrer Hit 3 film

`హిట్‌ 3`లో నాని అర్జున్‌ సర్కార్‌ గా కనిపించబోతున్నారు. వైజాగ్‌ సిటీలో వరుసగా కిడ్నాప్‌లు, హత్యలు జరుగుతుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లల కిడ్నాప్‌ కేసులు కలవరానికి గురి చేస్తుంటాయి ఈ క్రమంలో ఈ కేసుని డీల్‌ చేయడానికి ఎస్పీ క్యాడర్‌ పోలీస్‌ అధికారి అర్జున్‌ సర్కార్‌ డ్యూటీ ఎక్కుతాడు.

ఆయన నేరాలను ఎలా అడ్డుకట్ట వేశాడు? సీరియల్‌ కిల్లర్‌ ఆట ఎలా కట్టించడానేది ఈ మూవీ కథగా ఉండబోతుందని తెలుస్తుంది. గత రెండు సినిమాలు బాగానే ఆడాయి. `హిట్‌ 3` ఏ మేరకు ఆడియెన్స్ ని అలరిస్తుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories