Guppedantha manasu: రిషీ అని పిలవండి.. కొడుకులో మార్పు చూసి ఆనందపడుతున్న జగతి!

First Published Aug 18, 2022, 9:32 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 18వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... మహేంద్ర వాళ్ళు కేక్ కట్ చేసుకుందామనుకుంటారు. ఈలోగా రిషి, వసు అక్కడికి వస్తారు.మీరేంటి ఇక్కడ ఉన్నారు అని రిషి అడగగా గౌతం కేక్ కోసం  అని అంటాడు. అప్పుడు మహేంద్ర కేకే రావు, మా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను అని కవర్ చేస్తాడు. మీరు ఇప్పటి దాకా ఎక్కడున్నారు అని మహేంద్ర రిషిని అడగగా దగ్గర్లో పరీక్షలు ఉన్నాయి కదా దానికోసం డిస్కస్ చేసుకుంటున్నాము అని రిషి అంటాడు. మహేంద్ర మనసులో ఎంత బాగా అబద్ధం చెప్తున్నావు అని అనుకుంటాడు.
 

అప్పుడు జగతి, వసుని ఏ టాపిక్స్ చర్చించుకున్నారు అని అనగా రిషి వసుతో నాకు వెళ్లి కాఫీ తీసుకురా అని అంటాడు. మాకు అందరికీ కూడా కాఫీ కావాలి అని మహేంద్ర అనగా అందరికీ కాఫీ తెస్తుంది వసు. నువ్వేం తెచ్చుకోలేదు కాఫీ అని రిషి వసుధారని అడుగుతాడు.నాకు వద్దు సార్ అని అంటుంది వసు  అప్పుడు రిషి తన కప్పులోని సగం కాఫీని సాసర్ లో వేసి వసుకి ఇస్తాడు. పక్కనే ఉన్న జగతి మహీంద్రాలు నవ్వుకుంటారు. ఆ తర్వాత సీన్లో  కుటుంబం అంతా కూర్చొని భోజనం చేస్తారు. కానీ దేవయాని అక్కడికి రాదు.
 

పెద్దమ్మ ఎందుకు భోజనం చేయట్లేదు అని రిషి అడగగా ఈమధ్య అత్తయ్య గారు కిందకి రావడం లేదు అని ధరణి అంటుంది. అప్పుడు రిషి భోజనం దగ్గర నుంచి లేచి భోజనం ప్లేట్ తీసుకొని దేవయాని దగ్గరికి వెళ్లి దేవయానికి తినిపిస్తూ ఉంటాడు. దేవయాని అప్పుడు ఎందుకు రిషి నేనంటే నీకు అంత ప్రేమ అని అనగా మీరు చాలా స్వచ్ఛంగా ఉంటారు పెద్దమ్మ. కుళ్ళు కుతంత్రాలు ఉండవు, పక్కవాళ్ళని తొక్కేద్దాము అన్న స్వభావం ఉండదు అలాంటి వాళ్లంటే నాకు నచ్చరు అని రిషి అంటాడు.
 

అప్పుడు దేవయాని మనసులో, నిజంగా నా గురించి తెలిస్తే జీవితంలో నా మొఖం చూడవేమో అని మనసులో అనుకుంటుంది. అప్పుడు రుషి అన్నం తినిపిస్తూ జీవితంలో చాలా మంది నటిస్తూ ఉంటారు పెద్దమ్మ అలా నిజంగా నటించే వాళ్ళు అంటే నాకు చాలా చిరాకు ఎప్పుడు స్వచ్ఛంగానే ఉండాలి నీలాగా అని అంటాడు. అప్పుడు దేవయాని మనసులో తిడుతున్నాడా పొగుడుతున్నాడా అని అనుకుంటుంది.  రిషి దేవయానికి భోజనం తినిపించడం జగతి చూస్తుంది.
 

అప్పుడు జగతి దేవయాని స్థానంలో తనని ఊహించుకొని రిషి తనకి భోజనం పెడుతున్నట్టు అనుకుంటుంది.అప్పుడు మహేంద్ర అది కూడా త్వరలోనే జరుగురుంది.నువ్వు బాధపడొద్దు ఏదో ఒక రోజు నిజం బయటికి రావాల్సిందే అప్పటివరకు ఓర్చుకోవడమే మంచిది అని అంటాడు.ఆ తర్వాత సీన్లో వసు తన ఇంట్లో,ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను నాకు భోజనం తినాలని లేదు అని అనుకుంటూ ఉంటుంది.ఈ లోగా ఒక డెలివరీ వాడు వచ్చి కారేజ్ ఇచ్చి భోజనం అయ్యాక ఈ నెంబర్ కి ఫోన్ చేయమన్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు.
 

అప్పుడు వసు ఆ నంబర్ చూసి ఇది రిషి సార్ నెంబర్ అని చెప్పి రిషికి ఫోన్ చేస్తుంది. నువ్వు ఈరోజు భోజనం వండుకోలేదు కదా తిను ఇంకేమీ మాట్లాడొద్దు అని అంటాడు రిషి. ఏం కూరలు ఉన్నాయి సార్ అని వసు అనగా నువ్వు తింటావు కదా వెళ్లి చూసుకో అని రిషి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత సీన్లో రిషి వంటగదికి వచ్చి వదినా కాఫీ అని అడుగుతాడు కానీ అక్కడ ధరణి కాకుండా జగతి ఉంటుంది. కాఫీ పెట్టనా సర్ అని జగతి అనగా,మేడం ఈరోజు నుంచి మీరు నన్ను సర్ అని పిలవొద్దు అని అంటాడు రిషి. జగతి భయపడి ఎందుకు సార్ అని అడుగుతుంది.
 

మీరు నన్ను రిషి అని పిలవండి చాలు మీరు సరిగ్గా నే విన్నారు నన్ను రిషి అని పిలవండి. మనిద్దరికీ ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోని ఏ అభిప్రాయ భేదాలు లేవు కనుక ఇంకా ఆ విషయాన్ని వదిలేయండి అని అనగా జగతి చాలా సంబర పడిపోతూ ఉంటుంది. ఇదంతా ఒక చాటు నుంచి చూస్తున్నా మహేంద్ర కూడా ఆనంద భాష్పాలు తెచ్చుకుంటాడు. మీకు నా అభిప్రాయాలు నా అభిరుచులు ఇన్ని తెలుసని నాకు తెలియదు మేడం. వసుధార విషయంలో మీరు తనకి సహకరిస్తారని తెలుసు. అలాగే ఈ పరీక్షలు అయ్యేంతవరకు కూడా తనకి అలాగే సహకరించండి అని అంటాడు. కాఫీ కావాలి అని రిషి అనగా రిషికి కాఫీ ఇస్తుంది జగతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!

click me!