Intinti Gruhalakshmi: హనీని అడ్డం పెట్టుకొని సామ్రాట్‌తో గేమ్ ఆడుతున్న లాస్య.. పండుగ సంబరాల్లో తులసి!

First Published Oct 10, 2022, 12:21 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..తులసి కుటుంబం అంతా గుడికి వెళుతుంది. అదే సమయంలో నందు, లాస్య, లక్కీలు కూడా అక్కడికి రావడం చూసి ఇంట్లో సభ్యులందరూ వీల్లెందుకు ఇక్కడికి వచ్చారు అన్నట్టుగా ముఖాన్ని పెడతారు. అప్పుడు అనసూయ, వాళ్లకు హాయ్ చెప్తుంది. ఎందుకే చెయ్యి ఊపుతున్నావు అని అనసూయని పరంధామయ్య అడగగా, నేనే వాళ్ళని పిలిచాను నందుకి మేనేజర్ పోస్ట్ వచ్చిందని నా పేరు మీద పూజ చేయడానికి ఇంటికి రమ్మన్నారు. నేను కుదరదు గుడికి రమ్మని చెప్పాను అని అనగా, ఒకేసారి ఇంత ప్రేమ వచ్చింది ఎందుకు అని అడిగావా అని పరంధామయ్య అడుగుతాడుదానికి అనసూయ, ఒకేసారి అంత కోపం వస్తే అడగాలి గాని ప్రేమ వస్తే అడగడం ఎందుకు అని వాళ్ళని పిలిచి లోపలకి తీసుకొని వెళ్తుంది అనసూయ. అప్పుడు తులసి తన అత్తయ్య, మావయ్య పేరు మీద అర్చన చేయిస్తాము అని పంతులు గారితో చెప్పగా లాస్య ఆపి, ఈ సారికి నేను చేపిస్తాను అని అనసూయ, పరంధామయ్యల పేరు మీద పూజ చేయిస్తుంది.

అప్పుడు పంతులుగారు, ఈరోజు చాలా అదృష్టమైన రోజమ్మ మనసులో ఏమైనా అనుకొని ముడుపు కడితే అది తీరే అవకాశం ఉంది.మీరు వెళ్లి కట్టండి తులసి గారు అని పంతులుగారు అనగా,లాస్య నందుతో, సామ్రాట్ తన భర్తగా కావాలి అని కోరుకుంటుంది. అంతకుమించి ఏమున్నది అని అంటుంది. అప్పుడు తులసి, నాకేం పెద్దగా కోరికలు లేవు పంతులుగారు నాకు మనవులు పుట్టి వాళ్ళతో ఆడుకోవాలని ఉన్నది అని అనగా, మరి ఇంకేమీ మీ పిల్లలు చేత వెళ్లి మునుపులు కట్టించండి అని అంటారు పంతులుగారు. అప్పుడు శృతి,ఇప్పుడు ఇదంతా అవసరమా ఆంటీ ఎలాగో దేవుడు మన నుదిటి మీద మన రాత రాసి ఉంటారు కదా.ఇది ఎందుకు అని అనగా అనసూయ, అంటే మీకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదా అని అడుగుతుంది. దానికి తులసి, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా అని అంటుంది.
 

అప్పుడు దివ్య, మీరు త్వరగా వెళ్లి ముడుపు కట్టండి వదినలు మా అన్నయ్యలతో ఆడుతూ నాకు అలసట వస్తుంది నాకు కొత్తదనం కావాలి అని అంటుంది. దానికి అంకిత, నువ్వు వెళ్లి ముడుపు కట్టు ఒక సంవత్సరంలో నీకు పెళ్లి అవుతుంది అప్పుడు కొత్తదనం బాగుంటుంది అని అంటుంది. దానికి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు. అప్పుడు అంకిత,శృతిలు కొబ్బరికాయలు కొడతారు. అప్పుడు శృతి మనసులో, అమ్మ నేను ఇక్కడ అనుకున్నది ఒక్కటి జరుగుతున్నది ఒకటి అంతా నువ్వే చూసుకోవాలి అని అంటుంది. అంకిత మనసులో, మనసులు కలవకపోయినా ముడుపు వల్ల మనుషులు కలుస్తారంటే నేను నమ్మలేను అని అనుకుంటుంది.అప్పుడు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత పూజారి గారు, భర్తలు భార్యలను ఎత్తుకొని ముడుపు కడితే అప్పుడు అది నెరవేరుతుంది అని అనగా,ప్రేమ్,అభి లు సంకోచిస్తారు.ఇంట్లో వాళ్ళు బలవంతం చేసేసరికి వాళ్ళని వెళ్లి ఎత్తుకుంటారు. 

అప్పుడు శృతి,అంకితలు ముడుపు కడతారు.అప్పుడు లాస్య మనసులో, చూసేవా దీని పిసినారితనం ఆశకి హద్దు ఉండాలి ఒక వైపు మనవులు కావాలి అని కోరుకుంటూ ఇంకోవైపు సామ్రాట్ తో జీవితం పంచుకోవాలని చూస్తుంది అని అనుకుంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు, పదండి మన కాలనీలో ఫంక్షన్ కి లేట్ అయిపోతుంది అని అక్కడికి వెళ్తారు.అక్కడ అందరూ ఉత్సాహంతో బతుకమ్మ పండగలను డాన్స్ చేస్తూ పండగ వాతావరణం అంతా అక్కడ పుష్కలంగా కనిపిస్తుంది. అప్పుడు అందరూ ఆనందంగా ఉన్నా,లాస్య మాత్రం హనీ ఒక్కతే కనిపిస్తుంది ఏంటి సామ్రాట్ రాలేదా? అయినా సామ్రాట్ ఎందుకు తులసికి  ఈ మధ్య దూరంగా ఉంటున్నాడు. ఏదో అవుతుంది తెలుసుకోవాలి అయినా సామ్రాట్ ని ఇక్కడికి రప్పించి అవమానం చేస్తేనే కదా ఇంక తులసి కి పూర్తిగా దూరంగా గా ఉంటాడు అని అనుకుంటుంది.అదే సమయంలో హనీ మంచి నీళ్ళు తాగుతూ బయటికి వస్తుంది.అప్పుడు లాస్య హనీ దగ్గరకు వెళ్లి,ఏమన్నా మీ డాడీ రాలేదు అని అడగగా, ఏదో మీటింగ్ ఉన్నది అట ఆంటీ అందుకే రాలేదు.

నేను రమ్మని చెప్పాను అని అంటుంది. దానికి లాస్య, నువ్వు చెప్తే రాకపోవడం ఎంటమ్మా? ఇక్కడ ఇంత ఆనందంగా ఉన్నప్పుడు ఒకలే ఏం చేస్తారు అని అంటుంది. అప్పుడు హనీ, మీటింగ్లో ఉన్నారంటే నేను బలవంతం పెట్టడం మంచిది కాదు కదా అని అంటుంది. అప్పుడు లాస్య మనసులో, దీన్ని  వాడుకొని సామ్రాట్ ని ఎలాగైనా ఇక్కడికి రప్పిస్తే అప్పుడు ఆట నేను మొదలుపెట్టి ఇస్తాను అని అనుకుంటుంది. అప్పుడు హనీ,అయితే ఒక మార్గం ఉన్నది ఆంటీ అని చెప్పి సామ్రాట్ కార్ డ్రైవర్ ఫోన్ తీసుకుని సామ్రాట్ కి ఫోన్ చేస్తుంది. అప్పుడు సామ్రాట్ ఫోన్ ఎత్తి,ప్రోగ్రాం అయిపోయిందా పాపని ఇంటికి తీసుకొస్తున్నావా అని అడగగా, నాన్న నేను హనీ ని మాట్లాడుతున్నాను అని హనీ అంటుంది.
 

గొంతు ఏంటమ్మా మారింది అని సామ్రాట్ అడగగా, నాకు చాలా కడుపు నొప్పిగా ఉన్నది నాన్న నేను తులసి ఆంటీకి చెప్పాను మందులు ఇచ్చారు అని అంటుంది. దానికి సామ్రాట్ కంగారుగా, ఇంటికి వచ్చేయమ్మా నేను చూసుకుంటా నిన్ను జాగ్రత్తగా అని అంటాడు. దానికి హనీ, నువ్వే వచ్చి తీసుకెళ్ళు నాన్న అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు హనీ,ఎలా ఉంది ఆంటీ నా నాటకం అని లాస్యతో  అంటుంది. నాన్న కనబడితే తిడతారు కదా అమ్మ అని అనగా, మా నాన్నగారు నన్ను తిట్టరు ఆంటీ చూద్దామా కావాలంటే. మా నాన్నకి నేనంటే ఇష్టం అని అంటుంది. మరోవైపు ఏమైందిరా అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్, సామ్రాట్ ని అడగగా, హనీకి కడుపునొప్పిగా ఉన్నదట బాబాయ్.
 

తులసికి ఫోన్ చేస్తే అక్కడ పండగ బిజీలో ఎత్తడం లేదు. నాకు చాలా కంగారుగా ఉంది నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్, నేను కూడా వస్తాను అని అంటాడు. అప్పుడు ఇద్దరూ బయలుదేరుతారు. మరోవైపు తులసి వాళ్ళు, బతుకమ్మ పండుగలో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు మోనో యాక్టింగ్ చేయమని అక్కడున్న యాంకర్ చెప్పగా, సినిమా పేరు అంకిత చేత చెప్పించడానికి అభి ప్రయత్నిస్తాడు కానీ అంకిత చెప్పలేక పోతుంది. మరోవైపు సామ్రాట్, వాళ్ళ బాబాయ్తో కారులో వస్తుండగా తులసికి చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉంటాడు. తులసి ఫోన్ ఎత్తదు.
 

అప్పుడు సామ్రాట్, వాళ్ళ బాబాయ్ తో, ఇంత టెన్షన్లో ఉంటే ఫోన్ ఎత్తదేంటి బాబాయ్. హనీకి ఒంట్లో బాలేనప్పుడు ఫోన్ ఎత్తాలి కదా అని కంగారుగా అంటాడు. మరోవైపు ఫంక్షన్ లో గేమ్స్ లో నందు, లాస్యలు వెళ్లి పాల్గొంటారు. అప్పుడు నందు,సినిమా పేరు లాస్య చేత చేపించడానికి ప్రయత్నించినా లాస్య చెప్పకుండా ఓడిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!