త్రిషను మళ్లీ వివాదంలోకి , ‘బెడ్ రూమ్ వీడియోలు’గోల తప్పేలా లేదు, నేను 'గే' కాను

First Published May 15, 2024, 10:39 AM IST

‘సుచీ లీక్స్’ దెబ్బకు ఎంతో మంది చీకటి బాగోతాలు బయటకు వచ్చాయి.మీడియాలో ఎక్కడ చూసినా అవే. అయితే మెల్లి మెల్లిగా జనం వాటిని మర్చిపోయారు. 

TRISHA


గాయని సుచిత్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుటికే ఆమె  ధనుష్ గే అనే విధంగా ఆమె కామెంట్ చేసి షాక్ ఇచ్చింది. అలాగే  ధనుష్ మాజీ భార్య పిల్లలను పెంచే  తల్లిగా పనికిరాదని, ఆమెకి అఫైర్ల విషయాలు తప్పించి  తన పిల్లల బాగోగులు పట్టవని చెప్పడం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే సమయంలో   త్రిష పేరుని కూడా తన ఇంటర్వ్యూలోకి తీసుకొచ్చింది. దాంతో  మరోసారి వివాదంలో త్రిష వార్తల్లో నిలిచింది.

Trisha, suchitra


గాయని సుచిత్ర తాజా ఇంటర్వ్యూ మీడియాకి ఎంతో పని కల్పించింది. ఆమె “కుముదం” అనే పత్రికకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ధనుష్, ధనుష్ మాజీ భార్య, త్రిష, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, ఇంకా పలువురు తమిళ సెలెబ్రిటీల గురించి మాట్లాడింది. అలాగే తన మాజీ భర్త, నటుడు కార్తీక్ కుమార్ హోమో సెక్స్ వల్ అని పేర్కొంది.

Latest Videos



అప్పట్లో  చాలా మందికి గుర్తు “సుచి లీక్స్” పేరుతో కొన్నేళ్ల క్రితం కొన్ని శృంగార  వీడియోలు, తమిళ హీరోల, హీరోయిన్ల రహస్యాలు అప్పట్లో బయటికి వచ్చాయి. సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ ద్వారా బయటపడ్డాయి. అవి పెద్ద సెన్సేషన్ అయ్యాయి.  ఈ  ‘సుచీ లీక్స్’ దెబ్బకు ఎంతో మంది చీకటి బాగోతాలు బయటకు వచ్చాయి.మీడియాలో ఎక్కడ చూసినా అవే. అయితే మెల్లి మెల్లిగా జనం వాటిని మర్చిపోయారు. 

Actress Trisha Krishnan

 
 తాజాగా సుచిత్ర చేసిన కామెంట్స్ మరోసారి తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. తన మాజీ భర్తతో పాటు తమిళ స్టార్ హీరో ధనుష్, ఆయన మాజీ సతీమణి ఐశ్వర్య రజనీకాంత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే అదే  ఇంటర్వ్యూలో సుచిత్ర మరోసారి త్రిష గురించి ప్రస్తావన తెచ్చింది. అప్పట్లో సుచి లీక్స్ బయటపడడంలో త్రిష పాత్ర ఉంది అనే ఆమె ఇప్పుడు చెప్పింది. 

kollywood actress trisha

సుచిత్ర మాట్లాడుతూ...బయటికి కనిపించే త్రిష వేరు, నిజమైన త్రిష వేరు. “సుచి లీక్స్ అనేవి ఒక ప్రాంక్ లా మొదలుపెడితే అది ఆన్ లైన్ డేటాబేస్ లోకి రావడానికి కారణం త్రిష, గాయని చిన్మయి. ఇద్దరికీ ఉసురు తగులుతుంది,” అని ఆమె తాజాగా పేర్కొన్నారు.

Trisha


2017లో సుచి లీక్స్ పేరుతో ట్విట్టర్ లో ఫోటోలు, వీడియోలు, చాట్స్ బయటపడటం వెనక ధనుష్, త్రిష వంటివారు ఉన్నారనటం ఆశ్చర్యమే అంటున్నారు. త్రిష, శింబు, చిన్మయి, ఆండ్రియా ‘బెడ్ రూమ్ వీడియోలు’, ఇంకా చాలామంది రహస్యాలు అప్పట్లో బయటపడ్డాయి.  అయితే  తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘సుచీ లీక్స్’ పేరుతో ప్రైవేటు వీడియోలు లీక్ కావడం వెనుక కార్తిక్ తో పాటు ధనుష్ హస్తం ఉందని ఆరోపించింది.  అయితే ఎవరి వీడియోలు వారు లీక్ చేసుకోరు కదా..ఈ చిన్న లాజిక్ సుచిత్ర ఎలా మిస్సైందని అంటున్నారు. 
 

Actress Trisha


ఇక  ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దాంపత్య జీవితంలో నిప్పులు పోసిన ఘటన సుచీ లీక్స్ అనే సంగతి తెలిసిందే. పెళ్లికి ముందే ఐశ్వర్య రజనీకాంత్ కు మరో వ్యక్తితో ఎఫైర్ ఉందని వెల్లడించింది. ధనుష్ కు కూడా పలువురుతో శారీరక సంబంధాలున్నాని వెల్లడించింది. ధనుష్ గే కావడంతో పాటు మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు కారణంగానే ఐశ్వర్య విడాకులు తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. 


అదే సమయంలో “నా భర్త గే అన్న విషయం పెళ్ళైన కొన్నాళ్లకే అర్థమైంది. ధనుష్, నా భర్త కార్తీక్ కుమార్, ఇంకా తొట్టి గ్యాంగ్ తెల్లార్లూ పార్టీ చేసుకునేవారు. ధనుష్ తోనే ఉండేవాడు కార్తీక్ కుమార్. ఒక గేతో ధనుష్ కి ఏమి పని?,” అని బాంబు పేల్చింది సుచిత్ర.


ధనుష్, ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఇంకా ఈ ఇంటర్వ్యూ గురించి స్పందించలేదు. ఐతే, ఆమె మాజీ భర్త కార్తీక్ కుమార్ తాజాగా ఒక వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. “నేను నిజంగా హోమ్ సెక్స్ వల్ ని అయి ఉంటే నేను దాన్ని దాచుకోను. స్వలింగ సంపర్కుల ర్యాలీలో ఆనందంగా పాల్గొనేవాడిని,” అంటూ ఆమె ఆరోపణలను కార్తీక్ కుమార్ తోసిపుచ్చారు.

 
తమిళ సినీ పరిశ్రమలో ఆర్జేగా, గాయనిగా రాణిస్తున్న సుచిత్ర కార్తీక్ కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అప్పట్లో ధనుష్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం మత్తులో ముంచి తనను ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ శారీరకంగా అనుభవించారు అని ఆరోపించారు. 


ఆ సమయంలో గాయని చిన్మయి, అనిరుధ్, ధనుష్‌పై ఆరోపణలు చేయడం సంచలనం రేపాయి. అయితే అదంతా 2017లో జరిగింది గతం ...అనుకునేలోగా ఇప్పుడు మరోసారి సుచిత్ర సీన్ లోకి వచ్చారు. #Suchileaks కు మరోసారి స్వాగతం అంటున్నారు.  
 


 ఇక సుచిత్ర కెరీర్ విషయానికి వస్తే... పోకిరి చిత్రంలో డోలు డోలు, కాక్క కాక్క చిత్రంలో ఉయిరిన్‌ ఉయిరే వంటి పలు పాటలను పాడిన సుచిత్ర పలువురు హీరోయిన్లకు డబ్బింగ్‌లు చెప్పారు. అంతే కాదు జేజే, ఆయుధ ఎళుత్తు, బలే పాండియా వంటి పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలో నటించారు.

click me!