కుక్కతో బిడ్డను పోలుస్తావా... పిల్లల్ని కంటే సరిపోదు, మళ్ళీ మంట రాజేసిన రష్మీ గౌతమ్!

Published : May 14, 2024, 09:42 PM IST

సోషల్ మీడియాలో రష్మీ గౌతమ్ కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా ఆమె బిడ్డ కంటే వీధి కుక్క ఎక్కువ అన్నట్లు మాట్లాడటాన్ని ఓ నెట్టిజెన్ తప్పుబట్టారు .సీరియల్ చర్చ జరిగింది. 

PREV
16
కుక్కతో బిడ్డను పోలుస్తావా... పిల్లల్ని కంటే సరిపోదు, మళ్ళీ మంట రాజేసిన రష్మీ గౌతమ్!

యాంకర్ రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. ఆమె ఏ రూపంలో జంతువులను హింసించినా రియాక్ట్ అవుతారు.  జంతు సంరక్షణ కోసం ఆమె కృషి చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అవగాహన కలిపిస్తూ ఉంటారు. 
 

26
Rashmi Gautam

రష్మీ గౌతమ్ జంతు ప్రేమ ఓ వర్గాన్ని కోపానికి గురి చేస్తుంది. అసలు మనుషుల కంటే వీధి కుక్కలే ఎక్కువ అన్నట్లు ఆమె మాట్లాడుతుంది. గతంలో హైదరాబాద్ లో ఓ బాలుడు వీధి కుక్కలా దాడిలో మరణించాడు. అప్పుడు రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేసింది. 

 

36
photo credit- rashmi Instagram

బాలుడు మరణంలో వీధి కుక్కల తప్పేమీ లేదు. పేరెంట్స్ అజాగ్రత్తగా ఉండటం వలనే జరిగిందని ఆమె అన్నారు. దాంతో నెటిజెన్స్ ఆమె ఏకి పారేశారు. మీలాంటి వాళ్ళ వలనే అధికారులు కుక్కలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీరు కేసులు పెడుతున్నారని అన్నారు. 

46
Rashmi Gautam


తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని తాండూర్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ బాలిక మరణించింది. దీనిపై రష్మీ గౌతమ్ స్పందించారు. మరలా ఆమెకు నెటిజెన్స్ తో సోషల్ మీడియా వార్ షురూ అయ్యింది. 

56

ఓ నెటిజన్ నీకు గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఒక బిడ్డ కంటే కూడా కుక్కకు నువ్వు ఎలా ప్రాధాన్యత ఇస్తావ్? నీవి మానవత్వం లేని మాటలు.. అని కామెంట్ చేశాడు. ఈ కామెంటుకి సమాధానంగా రష్మీ గౌతమ్... నేను తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలని చేపను... అని కామెంట్ చేసింది. 

 

66

పిల్లలను కనగానే సరిపోదు వాళ్ళను భద్రంగా పెంచే బాధ్యత తల్లిదండ్రులదే అని రష్మీ పరోక్షంగా చెప్పింది. ఆమె కామెంట్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories