22 ఏళ్లుగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది త్రిష. 42 ఏళ్ల వయసులోనూ, 22 ఏళ్ల హీరోయిన్లకు సవాల్ విసిరే అందం, ఫిట్‌నెస్‌తో దూసుకుపోతోంది సీనియర్ బ్యూటీ. గతంలో ఓ సారి ఎంగేజ్మెంట్ వరకూ వెళ్లి, క్యాన్సిల్ చేసుకున్నది చెన్నై చిన్నది. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని, అందుకే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటానని చెప్పింది త్రిష. కానీ ఇప్పుడు త్రిష పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని కోలీవుడ్ టాక్.
27
జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష
సినిమాల్లోకి రాకముందు త్రిష మోడలింగ్ చేసింది. అందాల పోటీల్లో పాల్గొంది. ఇతిరాజ్ కాలేజీలో చదువు పూర్తి చేసిన త్రిష... 1999లో మిస్ చెన్నై, మిస్ సేలం టైటిల్స్ గెలుచుకుంది. తర్వాత మిస్ ఇండియా 2001 పోటీలో 'బ్యూటిఫుల్ స్మైల్'గా ఎంపికైంది. మోడలింగ్‌పై దృష్టి పెట్టిన ఆమెకు... సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. అవకాశాల కోసం వెతుకుతున్న త్రిషకు, 'జోడి' సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిన్న అవకాశం లభించింది.
37
కెరీర్ బిగినింగ్ లో ఐరన్ లెగ్ ట్యాగ్
త్రిషకు చిన్న అవకాశం ఇచ్చి, వెండితెరకు పరిచయం చేసింది ఎవరో తెలుసా? ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్న ప్రవీణ్ గాంధీ. ఈ సినిమాలో హీరోయిన్ సిమ్రన్‌కు స్నేహితురాలిగా కొన్ని సెకండ్ల పాటుు త్రిష కనిపించింది. ఈ సినిమా తర్వాత, దర్శకుడు అమీర్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఆతరువాత సూర్య , శ్రీకాంత్ సరసన రెండు సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో కోలీవుడ్ లో ఐరన్ లెగ్ అని దర్శకులు, నిర్మాతలు ముద్ర వేశారు.
ఇండస్ట్రీ ఐరన్ లెగ్ అని చెప్పినా వినకుండా దర్శకుడు హరి త్రిషకు అవకాశం ఇచ్చాడు. ఆతరువాత కాలంలో త్రిష వరుస సక్సెస్ లతో లక్కీ లెగ్ గా మారిపోయింది. సినిమా అవకాశాలు కూడా ఎక్కువగానే వచ్చాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా ఆమె అడుగుపెట్టింది. టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస అవకాశాలతో తీరికలేకుండా సినిమాలు చేస్తూ వెళ్లింది త్రిష.
57
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా
తమిళంలో వరుసగా గిల్లీ, యువ, ఆరు సినిమాలతో దూసుకుపోయిన త్రిష, తెలుగులో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బుజ్జిగాడు, అతడు, పౌర్ణమి, స్టాలిన్, బాడీగార్డ్ లాంటి వరుస సినిమాలతో సందడి చేసింది. మధ్యలో కొన్నేళ్లు త్రిష మార్కెట్ పడిపోయి ఖాళీగా ఉంది. ఇక అదే టైమ్ లో ఆ మార్కెట్ ను నిలబెట్టింది దర్శకుడు మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ సినిమా. ఈ సినిమాలో త్రిష నటన అద్భుతం అని చెప్పాలి.
67
పెళ్ళి చేసుకోబోతున్న త్రిష?
త్రిష హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా ఉంది బ్యూటీ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటిస్తోంది త్రిష. సూర్య , అజిత్ లాంటి స్టార్స్ సరసన ఆఫర్లు కొట్టేసింది చెన్నై చిన్నది. ఈక్రమంలో త్రిష పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు ప్రాచారం జరగుతోంది.
77
త్వరలో త్రిష పెళ్లి?
ఈ ఏడాది ఎలాగైనా త్రిషకు పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ఫిక్స్ అయి ఉన్నారట. ఆమె కండిషన్లకు ఒప్పుకునే ఒక సంబంధం చూసి, వరుడిని కూడా ఫైనల్ చేశారని అంటున్నారు. త్రిషకు చూసిన అబ్బాయి, వాళ్ల కుటుంబ స్నేహితుడేనని, చండీగఢ్‌కు చెందిన వ్యక్తితో ఆమె పెళ్లి చేయబోతున్నట్టు సమాచారం. ఇరువైపులా పెళ్లికి సబంధించిన చర్చలు జరుగుతున్నాయని, అన్నీ కుదిరి, పెళ్లి ఖాయమైతే త్రిష నుంచే త్వరలో అధికారిక వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో చూడాలి.