కాంతార 1 నుంచి బాహుబలి వరకు, హిందీ వెర్షన్ లో 100 కోట్లకు పైగా వసూలు చేసిన సౌత్ సినిమాలు?

Published : Oct 10, 2025, 08:08 PM IST

రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన "కాంతార చాప్టర్ 1" హిందీ వెర్షన్ 100 కోట్ల క్లబ్‌లో చేరింది. హిందీలో ఈ మైలురాయిని సాధించిన 12వ సౌత్ ఇండియాన్ మూవీగా రికార్డు సాధించింది. మరి హిందీ వెర్షన్ లో 100 కోట్ల మార్క్ దాటిన సౌత్ మూవీస్ ఏంటి?

PREV
17
కాంతారా చాప్టర్ 1 హిందీ వెర్షన్ కలెక్షన్స్

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా కాంతార చాప్టర్ 1. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈసినిమా, హిందీ వెర్షన్ లో కూడా భారీ రెస్పాన్స్ ను సాధించింది. ఇక ఈసినిమా హిందీ వెర్షన్ కలెక్షన్స్ 100 కోట్లు దాటాయి. సౌత్ నుంచి రిలీజ్ అయిన సినిమాలలో ఇంత స్పీడ్ గా 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా మరొకటి లేదు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లు అన్నీ కలుపుకుని కాంతార చాప్టర్ 1 ఇప్పటి వరకూ 500 కోట్ల కలెక్షన్ మార్క్ దాటింది.

27
బాహుబలి: ది బిగినింగ్

టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలిపిన సినిమా బాహుబలి. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి: ది బిగినింగ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ 118.7 కోట్లు వసూలు చేసింది. 2015లో విడుదలైన ఈసినిమాలో ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ సందడి చేశారు.

పుష్ప: ది రైజ్ హిందీ వెర్షన్ వసూళ్లు

అల్లు అర్జున్ హీరోగా , సుకుమార్ దర్శకత్వం వహించిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. ఈ తెలుగు సినిమా 2021లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రచ్చ రచ్చ చేసింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈమూవీలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఈసినిమా హిందీ వెర్షన్ 108.26 కోట్లు వసూలు చేసింది.

37
సాహో హిందీ వెర్షన్ వసూళ్లు

బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా సాహో. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించని ఈసినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించాడు. నీల్ నితిన్ ముఖేష్ లాంటి ఎంతో మంది స్టార్స్ నటించిన ఈ తెలుగు చిత్రం 2019 లో విడుదలైంది. ఈ సినిమా హిందీ వెర్షన్ 142.95 కోట్లు వసూలు చేసింది.

సలార్ పార్ట్ 1 కలెక్షన్ వివరాలు

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు చిత్రంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి ,శృతి హాసన్ నటించారు. 2023లో విడుదలైన ఈ సినిమా హిందీ వెర్షన్ 153.84 కోట్లు వసూలు చేసింది.

47
మహావతార్ నరసింహ హిందీ వెర్షన్ కలెక్షన్స్

అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన మహావతార నరసింహ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది. కన్నడనాట నుంచి వచ్చిన ఈసినిమా దక్షిణ భారత ఇతిహాస భక్తి యాక్షన్ మూవీగానిలిచింది. ఇక 2025 లో రిలీజ్ అయిన ఈసినిమా హిందీ వెర్షన్ 182.83 కోట్లువసూలు చేసింది. ఈ

2.0 హిందీ వెర్షన్ వసూళ్లు

రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ చిత్రానికి ఎస్. శంకర్ దర్శకత్వం వహించారు  అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటించిన ఈసినిమా  2018లోభారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఇక ఈసినిమా  హిందీ వెర్షన్ 189.55 కోట్లు వసూలు చేసింది.

57
KGF చాప్టర్ 2 నార్త్ కలెక్షన్స్

ఇది యష్ నటించిన కన్నడ సినిమా, 2022లో విడుదలైన ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిందీ వెర్షన్ 434.70 కోట్లు వసూలు చేసింది.

భారీగా రాబట్టిన బాహుబలి 2: ది కన్‌క్లూజన్

2017లో విడుదలైన "బాహుబలి 2: ది కన్‌క్లూజన్" హిందీ వెర్షన్ 510.99 కోట్లు వసూలు చేసింది. బాహుబలికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. ఇక హిందీలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ తెలుగు సినిమాలో ప్రభాస్, అనుష్క శెట్టి రానా దగ్గుబాటి ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

67
RRR హిందీ వెర్షన్ ఎంత రాబట్టింది?

టాలీవుడ్ కు మొదటి ఆస్కార్ తెచ్చిపెట్టిన సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈసినిమా 2022లో రిలీజ్ అయ్యింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈసినిమా బాలీవుడ్ లో కూడా దూసుకుపోయింది. ఈ హిందీ వెర్షన్ ఏకంగా 274.31 కోట్లు వసూలు చేసింది.

కల్కి 2898 AD హిందీలో ఎంత వసూలు చేసింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ కల్కీ. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు చిత్రంలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ , దీపికా పదుకొనే ముఖ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 2024లో విడుదలయ్యారు. ఈ చిత్రం హిందీ వెర్షన్ ఏకంగా 294.25 కోట్లు వసూలు చేసింది.

77
దుమ్మురేపిన పుష్ప 2: ది రూల్

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే హిందీ వర్షన్ వసూళ్లలో సూనామీ సృష్టించిన సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేష్ , జగపతి బాబు లాంటి సీనియర్ స్టార్స్ సందడి చేశారు. ఈ సినిమా హిందీ వెర్షన్ ఆశ్చర్యకరంగా 830.10 కోట్లు వసూలు చేసింది. ఓవర్ ఆల్ గా ఈ సినిమా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

Read more Photos on
click me!

Recommended Stories